Home Health ధ‌నియాల‌ను రోజూ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసా ?

ధ‌నియాల‌ను రోజూ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసా ?

0

ఆయుర్వేద వైద్యులు వంటగదిని ఒక మెడికల్ షాప్ గా చెబుతుంటారు. ఇందులో అనేక ర‌కాల ఔష‌ధాలు దాగుంటాయి. అందులో ఒకటి ధనియాలు. సాధారణంగా ధనియాలను సుగంధంకోసం వంటల్లో కూడా వాడుతుంటారు. ధనియాల గింజలను కూరపొడి, సాంబారు పొడి తయారీలకు, కూరల తాళింపుకోసం వాడటం ఒక నవాయితి. దీని వల్ల వంట‌లకు చ‌క్క‌ని వాస‌న, రుచి వ‌స్తాయి. అయితే కేవలం వంటింటి దినుసుగానే కాకుండా ధనియాలను ఔషధంగా కూడా వాడవచ్చు. నిజానికి ధ‌నియాల్లోఅనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. మ‌న శరీరానికి అవ‌స‌రం అయ్యే ముఖ్య‌మైన పోష‌కాలు వీటిల్లో ఉంటాయి. ఇందులో విట‌మిన్ ఎ, సీ,కె విరివిగా ఉంటాయి. సీ విట‌మిన్ క‌రోనాను కంట్రోల్ చేయ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందువ‌ల్ల ధ‌నియాల‌ను రోజూ తీసుకుంటే అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

ధ‌నియాల‌నుధనియాలను ఏ రకంగానైనా తీసుకోవచ్చు. నీటిలో ధనియాలు వేసి మరగబెట్టి తాగొచ్చు. పౌడర్‌ను నీటిలో కలుపుకోని కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న ధనియాల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ధ‌నియాల‌ను నీటిలో మ‌రిగించి ఆ నీళ్ల‌ను తాగితే ఇంకా ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంది. రోజుకు 1, 2 క‌ప్పుల ధ‌నియాల నీళ్ల‌ను తాగ‌వ‌చ్చు. ధనియాల నీరు చేసే మేలు.. ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ధనియాల నీటిని తయారు చేసుకోడానికి ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో కొన్ని ధ‌నియాల‌ను వేసి బాగా మ‌రిగించాలి. నీరు బాగా మ‌రిగాక స్ట‌వ్ ఆర్పి నీటిని వ‌డ‌క‌ట్టాలి. అనంత‌రం అందులో అవ‌స‌రం అనుకుంటే తేనె, నిమ్మ‌ర‌సం క‌ల‌ప‌వ‌చ్చు. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రోజూ ఉద‌యం, సాయంత్రం తాగాలి. దీంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

అలా కాకుండా నేరుగా ధ‌నియాల‌ను వేడి నీళ్ల‌లో మ‌రిగించి రోజూ తాగినా ఆర్థ‌టైటిస్‌, ఒళ్లు నొప్పులు త‌గ్గిపోతాయి. ఎముకలకి బలాన్ని చేకూర్చి ఆరోగ్యంగా ఉంచడంలో ధనియాలు మేలు చేస్తాయి. ధనియాల నీటిని ప్రతిరోజూ ఉదయాన్నే తాగితే సులువుగా బరువు తగ్గవచ్చు. ఈ నీళ్లు శ‌రీరంలో నీటి శాతం త‌గ్గ‌కుండా చూస్తాయి. దీంతో డీ హైడ్రేష‌న్ మ‌న దరికి చేర‌దు. శ‌రీరంలో నీటి శాతం ఎక్కువ‌గా ఉంటే చ‌ర్మ స‌మ‌స్య‌లు రావు. ఉదర సమస్యలు కూడా తగ్గుతాయి.

థైరాయిడ్ సమస్య సర్వసాధారణమైపోయింది. థైరాక్సిన్ హోర్మోన్ హెచ్చుతగ్గులకు లోనుకాకుండా సజావుగా విడుదలవ్వాలంటే థైరాయిడ్ గ్రంథిని సక్రమంగా పనిచేయించే కషాయం తీసుకోవాలి. ఇందుకోసం ఈ ధనియాల కషాయం ఎంతగానో సహాయపడుతుంది. దానికోసం ముందుగా ముందుగా ధనియాలు దంచి రాత్రివేళ చల్లని నీటిలో వేసి ఉదయాన్నే వడబోసి తాగాలి. ఇలా ప్రతిరోజూ గ్లాస్ ఈ కషాయాన్ని తాగితే థైరాయిడ్ వ్యాధి నుండి విముక్తి లభిస్తుంది. అలానే ధనియాలను దంచి రాత్రివేళ వేడినీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వడగట్టి తాగాలి. ఇలా తాగలేనివాళ్లు నీళ్లకు బదులు శీతలపానీయంలో ధనియాల పొడి, త్రికటు చూర్ణం కలిపి తాగవచ్చు.

ధ‌నియాల‌లో ఉండే ఐర‌న్ నీర‌సం, బ‌ల‌హీన‌త‌ను రానివ్వ‌దు. ధ‌నియాల నీటిని తాగ‌డం వ‌ల్ల వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. శ‌రీరంలోని వేడి త‌గ్గుతుంది. ఉద‌ర స‌మ‌స్య‌లు కూడా కంట్రోల్ అవుతాయి. అలాగే జుట్టు రాల‌డం త‌గ్గిపోతుంది.

కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తాయి. మూత్రపిండాలను పాడుచేసే మలినాలను బయటకు పంపి ఆరోగ్యంగా ఉంచుతాయి. తరుచూ ధనియాల నీటిని తాగడం వలన మూత్ర పిండాలు బాగా ప‌నిచేస్తాయి. ముఖం ఉబ్బిపోయే స‌మ‌స్య ఉన్న‌వారు ధ‌నియాల నీటిని తాగితే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ధ‌నియాలు పౌడ‌ర్ రూపంలో కూడా దొరుకుతాయి. దీన్ని వేడి నీళ్ల‌లో క‌లిపి ఉద‌యం, సాయంత్రం తాగితే శ‌రీరానికి ఎన్నో ర‌కాల మేలు జ‌రుగుతుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. అయితే.. ఉదయాన్నే పరిగడుపున ధనియాల నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది

Exit mobile version