వాము ఆకులు ఇలా తీసుకుంటే రోగాలు దరిచేరవు!

మనం పురాత‌న కాలం నుంచి వాడుతున్న వంట ఇంటి పోపు దినుసుల్లో వాము కూడా ఒక‌టి. వాము చక్కని సువాసనను అందిస్తుంది. వాము సుగంధ ద్ర‌వ్యాల జాతికి చెందిన ఓ మొక్క‌. దీని రుచి కారంగా, ఘాటుగా ఉంటుంది. ఇది వేడి వాతావ‌ర‌ణంలోనే పెరుగుతుంది. వాములో ఎన్నో అద్భుత ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే ప‌లు ఔష‌ధాల త‌యారీలోనూ వామును విరివిగా ఉప‌యోగిస్తుంటారు.

వాము ఆకులువాములోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ద‌గ్గు, జ‌లుబు, హైబీపీ, శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు.. ఏవైనా స‌రే.. వామును వాడితే త‌క్ష‌ణ‌మే ఆయా అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది. అలాగే విట‌మిన్ ఎ, సి, ఇ, కెల‌తోపాటు కాల్షియం, పొటాషియం, ఐర‌న్‌, పాస్ఫ‌ర‌స్ త‌దిత‌ర పోష‌కాలు కూడా వాములో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే వాము సర్వ‌రోగ నివారిణి కూడా ప‌నిచేస్తుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది.

వాము ఆకులువాము గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అదేవిధంగా వాము మొక్క ఆకులు అంతే మేలు చేస్తాయి. కొన్ని వాము ఆకులను శుభ్రంగా కడుక్కుని ఓ పాత్రలో నీరు తీసుకుని అందులో ఈ ఆకులను వేసి బాగా మరిగించి డికాషన్ తయారుచేసుకోవాలి. అందులో కొద్దిగా తేనే కలిపి వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ఇలా తరచు తాగితే వేసవి కారణంగా వచ్చే.. తలనొప్పి, జ్వరం నుండి ఉపశమనం లభిస్తుంది.

వాము ఆకులుకడుపు నొప్పులు మరియు ఇతర కడుపు సమస్యలను నయం చేయడంలో వాము ఆకులు ఉపయోగపడతాయని నిరూపించబడింది. ఈ ఆకులను నమలడం వల్ల శరీరంలోని అసౌకర్యం కడుపు లోపాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ ఆకుల రసం తేనెతో కలిపి తీసుకుంటే శిశువులలో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గును నయం చేయడంలో సహాయపడుతుంది. అటువంటి అంటువ్యాధులకు వ్యతిరేకంగా వారి నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

వాము ఆకులువాము ఆకుతో తయారుచేసిన డికాషన్‌ను తరచు తాగుతుంటే అజీర్తి సమస్య రాదు. ముఖ్యంగా జీర్ణక్రియలు సక్రమంగా జరుగుతాయి. అలానే డయాబెటిస్ ఉన్నవారు వాము డికాషన్‌ను రోజూ క్రమంగా తాగితే వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది. వాము ఆకుల డికాషన్ తాగడం వలన శరీర ఒత్తిడి తగ్గి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దాంతో మైండ్ రిలాక్స్‌గా ఉంటుంది. కొన్ని వాము ఆకులను తీసుకుని బాగా నలిపి వాసన చూస్తే ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

వాము ఆకులువాము ఆకులు మరియు తులసి ఆకులను కలపడం ద్వారా మూలికా రసాలను తయారు చేయవచ్చు. ఈ రసానికి రుచిని జోడించడానికి మరియు రుచికరమైనదిగా చేయడానికి ఆమ్‌చూర్ పౌడర్‌ను ఉపయోగిస్తారు. నిర్జలీకరణాన్ని నివారించడానికి వేసవికాలంలో వీటిని తినవచ్చు. వాము ఆకులు శరీరంలో జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి రోజువారీ భోజనం తర్వాత రోజుకొక ఆకుచొప్పున వీటిని తీసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలలో ఆకలి పెంచడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు.

వాము ఆకులువాము టీని తాగినా లేదా వామును తిన్నా హైబీపీ త‌గ్గుతుంది. విరేచ‌నాలు త‌గ్గిపోతాయి. బొంగురు పోయిన గొంతు స‌రి అవుతుంది. శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు వాము టీ తాగ‌డం మంచిది. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే నిత్యం వాము టీ తాగాలి. మొటిమ‌ల స‌మ‌స్య ఎదుర్కొంటున్న వారికి వాము చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. నిత్యం వాము టీని తాగితే డిప్రెష‌న్ త‌గ్గుతుంది. వాములో ఉండే యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గిస్తాయి.

వాము ఆకులుశ్వాససంబంధ సమస్యలును తొలగించడం ద్వారానోటి దుర్వాసన తొలగించి అవి నోరు ఫ్రెషనర్‌గా పనిచేస్తాయి. రోజూ వాము ఆకులను నమలడం వల్ల దుర్వాసన నుంచి బయటపడవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR