వాటర్ యాపిల్ తినడం కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

వాటర్ యాపిల్ గురించి మీకు తెలుసా? యాపిల్ గురించి తెల‌సు, గ్రీన్ యాపిల్ గురించి తెలుసు, ఆఖరికి ఐస్ యాపిల్ కూడా తెలుసు కానీ ఈ వాట‌ర్ యాపిల్ ఏంటి అని సందేహం రావొచ్చు. చాలామందికి పెద్దగా తెలియని ఈ వాట‌ర్ యాపిల్‌ను వైట్ జామూన్ అని, జంబూ ఫలం అని పిలుస్తుంటారు. రోజ్ యాపిల్,గులాబ్ జామూన్ కాయలు అని కూడా పిలుస్తారు. తెలుగులో కమ్మరి కాయలు అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇదే పండును బెల్ ఫ్రూట్ అని పిలుస్తారు.

వాటర్ యాపిల్వేస‌విలో విరి విరిగా కాసే ఈ వాట‌ర్ యాపిల్స్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉండే ఈ వాట‌ర్ యాపిల్స్ కొంచెం తియ్య‌గా, కొంచెం వ‌గ‌రుగా ఉంటాయి. ఈ పండు ఎక్కువగా ఇండియా, ఇండోనేషియా, మలేషియాలో పండుతుంది. ఇది చూడటానికి అచ్చం జామపండులా ఉంటుంది. అలాగే.. బాగా పక్వానికి వస్తే.. గులాబీ రంగులో ఉంటుంది ఈ పండు. కొన్ని పండ్లు పసుపు రంగులో, మరికొన్ని ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

వాటర్ యాపిల్వాటర్ యాపిల్ మూడు నుండి పదిమీటర్ల ఎత్తులో పెరుగుతుంది. దీని అకులు పదిహేనుసెంటీమీటర్ల పొడవులో లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కొంచెం సువాసనగా ఉండి తెల్లగా ఉన్న పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఈ చెట్టు కాయలు నున్నగా మైనపు పూత పూసినట్లు గంట ఆకారంలో గుత్తులు, గుత్తులుగా కాస్తాయి. గులాబీ, ఎరుపు, మీగడ రంగులలో కాయలు కాస్తాయి. ముదురు రంగులో ఉన్న కాయలు ఎక్కువ తీపిగా ఉంటాయి..

వాటర్ యాపిల్గంగరేగు కాయలకు దగ్గరగా, వాటికంటే తక్కువ తీయగా ఉంటాయి. ఈ పళ్లలో నీటిశాతం ఎక్కువ. ఈ కాయలు తింటే దాహం తీరుతుంది కనుక పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఈ పండు ద్వారా లభిస్తాయి. నోట్లో వేసుకున్న వెంటనే క‌రిగిపోయే ఈ వాట‌ర్ యాపిల్స్‌లో పోష‌కాలు కూడా మెండుగానే ఉంటాయి కాబట్టి ఈ పండు ఎక్కడ కనిపించినా అస్సలు వదలొద్దు. వెంటనే దీన్ని తీనేయాలి.

వాటర్ యాపిల్ఈ పండులో ఉండే విటమిన్లు, మినరల్స్.. ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెడతాయి. ముఖ్యంగా దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అతి తక్కువగా ఉండటంతో.. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అందుకే.. డయాబెటిస్ ఉన్నవాళ్లు ఈ పండును ఎక్కువగా తీసుకోవాలి. దీన్ని మాంచి రోగనిరోధక బూస్టర్ అని కూడా పిలుస్తారు.

వాటర్ యాపిల్విటమిన్ బి, విట‌మిన్ సి, కాల్షియం, ఐర‌న్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌, ప్రోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు వాట‌ర్ యాపిల్ ద్వారా పొందొచ్చు. ముఖ్యంగా ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ను పెంచుకోవాలి అని ప్ర‌య‌త్నించే వారు ఈ వాట‌ర్ యాపిల్‌ను తీసుకోవ‌డం చాలా మంచిది.వాట‌ర్ యాపిల్‌లో ఉండే విట‌మిన్ సి, జింక్ పోష‌కాలు.శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దాంతో వైర‌స్‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

వాటర్ యాపిల్ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. దంతాలను బలంగా చేస్తుంది. చిగుళ్లను గట్టిగా చేస్తుంది. కంటి సమస్యలను దూరం చేస్తుంది. పలు రకాల బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈపండులో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అది గుండె జబ్బులను రాకుండా కాపాడుతుంది.

ఆల్ బుఖారా పండ్లుఒత్తిడి, మాన‌సిక అందోళ‌న‌, అల‌స‌ట‌, నీర‌సం వంటి స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయి.అధిక ర‌క్త పోటును త‌గ్గించ‌డంలోనూ ఈ వాట‌ర్ యాపిల్ స‌హాయ‌ప‌డుతుంది. రెగ్యుల‌ర్‌గా ఒక‌టి చ‌ప్పున ఈ వాట‌ర్ యాపిల్‌ను తీసుకుంటే, ర‌క్త పోటు కంట్రోల్‌లో ఉంటుంది.

ఆల్ బుఖారా పండ్లుక్యాన్సర్ నుంచి రక్షణ పొందడానికి కూడా ఈ పండును ఎక్కువగా తీసుకోవాలి. క్యాన్సర్ కణాలను ఈ పండు నాశనం చేస్తుంది. ఈ పండును నిత్యం తీసుకుంటే.. దాదాపు అన్ని రోగాలు నయం అవుతాయి. ఎంతో ఆరోగ్యవంతులు అవుతారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR