Home Health పుచ్చ‌కాయ విత్త‌నాలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

పుచ్చ‌కాయ విత్త‌నాలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

ఎండాకాలం వచ్చిందంటే చాలు మనలోని నీటిశాతం తగ్గి దాహం ఎక్కువగా వేస్తుంటుంది. సూర్యుడు కూడా తన ప్రతాపం చూపించడం మొదలెట్టాడు. ఈ టైంలో శ‌రీరానికి చ‌ల్ల‌దనాన్నిచ్చే ఆహార ప‌దార్థాల కోసం అందరూ వెతుకుతున్నారు. అయితే ఎండాకాలంలో ఎక్కువగా అందరూ తీసుకునే ఆహారం ఎక్కువగా పుచ్చ‌కాయ‌లు. ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా ల‌భించే పుచ్చ‌కాయ‌ల‌ను నిత్యం తింటే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది. అయితే మనలో చాలామంది మాత్రం పుచ్చకాయలను తిని వాటి విత్తనాలను మాత్రం ఊసేస్తుంటాం. అయితే అలా విత్తనాలను ఊసెయ్యొద్దు అంటున్నారు. పుచ్చకాయ విత్తనాలు తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయంటూ చెబుతున్నారు. పుచ్చ విత్తనాలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

Health Benefits of Watermelon Seedsపుచ్చకాయలో ఉండే లైకోపీస్ అనే పదార్థం పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది.

పుచ్చకాయ గింజల్లో విటమిన్-B అధికంగా ఉంటుంది. ఈ గింజలను తింటే గుండె జబ్బుల ముప్పు నుంచి బయటపడొచ్చు.

పుచ్చకాయ గింజలను ఆహారంలో తీసుకుంటే మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.

ఈ గింజలను నీటిలో వేసి మరిగించి ‘టీ’లా తాగితే.. కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయట.

జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంపొందించడానికి, కండరాల కదలికల క్రమబద్ధీకరణలో పుచ్చ గింజలు తోడ్పడతాయి.

పుచ్చకాయ గింజల్లో ఎల్ సిట్రులిన్ సమృద్ధిగా ఉండుట వల్ల కండరాలు బలంగా ఉండేందుకు మరియు కండరాల కణజాలాన్ని రిపేర్ చేయటానికి బాగా సహాయపడుతుంది.

పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అల‌స‌ట త‌గ్గుతుంది.

పుచ్చ‌కాయ విత్త‌నాలు షుగ‌ర్ ను అదుపులో ఉంచుతుంది.

హైబీపీ ఉన్న‌వారు పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను తింటే బీపీ త‌గ్గుతుంది. బీపీ త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుంది

కంటిజ‌బ్బుల‌కు కూడా పుచ్చ‌కాయ విత్త‌నాలు బాగా ప‌నిచేస్తాయి. కంటి వెంట నీరుకార‌డం, కంట్లో మంట‌, దుర‌ద వంటి స‌మ‌స్య‌లు ఉంటే పుచ్చ‌కాయ గింజలు అధ్బుతంగా ప‌నిచేస్తాయి.

మెద‌డు ప‌నితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను రోజూ తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 

Exit mobile version