వైట్ హనీతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలా తెలుసా ?

పురాతన కాలం నుండి భారతీయుల దైనందిన జీవితంలో తేనే భాగంగానే ఉంటూ వస్తోంది. ఆయుర్వేదంలో ప్రధమ ప్రాధాన్యత తెనేదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తరాలు మారిన నేటికీ తేనే వాడకం మాత్రం తగ్గలేదు. స్వీట్స్ లో, ఇతర వంటకాలలో తేనే ఉపయోగిస్తునే ఉన్నాం. మందులలో, బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా తేనేను విరివిగా ఉపయోగిస్తున్నారు.

Health Benefits Of White Honeyఅయితే సాధారణంగా తేనె అనగానే బెల్లం రంగులో ఉండే ద్రవపదార్థమే అని అందరూ అనుకుంటారు. కానీ, తేనెల్లో కూడా పలు రకాల రంగులున్నాయన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. తెలుపు రంగులో ఉండే తేనె గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెల్ల తేనెను ముడి తేనె అని కూడా అంటారు. ఈ తేనెను తేనెటీగల నుంచి తీసినట్లు చెబుతారు. అయితే దీనిలో తాపన ప్రక్రియను ఉపయోగించరు.

Health Benefits Of White Honeyతాపన ప్రక్రియలో తేనెలో ఉన్న కొన్ని ప్రయోజనకరమైన అంశాలు తొలిగిపోతాయి. కాబట్టి ఇది గోధుమ తేనె కంటే ఎక్కువ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ప్రతీ రోజు ఒక టీస్పూన్ వైట్ తేనె తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. వైట్ హనీలోని మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం, పొటాషియం వంటి మినరల్స్‌తో పాటు విటమిన్ ఏ, బీ ఉంటాయి.

Health Benefits Of White Honeyవైట్ హనీని యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌస్ అని పేర్కొంటారు. ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ అని పిలువబడే సమ్మేళనాలు కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్ల హ్యూమన్ బాడీలో వృద్ధాప్య ఛాయలు రావు. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు గుండె జబ్బుల నుంచి వైట్ హనీ సంరక్షిస్తుంది. అల్సర్ సమస్యకూ వైట్ హనీ చాలా మంచిది. జీర్ణవ్యవస్థను సరిచేయడంలోనూ కీలకంగా పనిచేస్తుంది.

Health Benefits Of White Honeyప్రతీ రోజు పరగడపున లేదా ఖాళీ కడుపున చెంచడు తెల్ల తేనే తీసుకుంటే చాలా మంచిది. మౌత్‌లో పుండ్లు ఉంటే ఈ ముడి తేనెను తీసుకుని వాటిపై అప్లై చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. ముడి తేనెలో ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇది గాయాలను త్వరగా నయం చేయడానికి సాయపడుతుంది. ప్రతీ రోజు ఒక్క స్పూన్ గోరువెచ్చని నీటితో కలిపి ఈ తేనెను సేవిస్తే శరీరంలో హిమోగ్లోబిన్ అత్యంత వేగంగా పెరుగుతుంది. మహిళలు రక్తహీనత సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం.

Health Benefits Of White Honeyఅలాగే చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు అందంగా ఉంచడంలోనూ ఇది సహాయకారి. ఇక నేటి బిగుతు దుస్తులను ధరించే కాలంలో ప్రతీ ఒక్కరు ఎప్పుడో ఒకసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతుండటం సహజం. కాగా, ఫంగస్‌ను తొలగించే లక్షణాలు ఈ వైట్ హనీలో ఉంటాయి. దగ్గు సమస్య ఉంటే తెల్ల తేనె చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది. నిమ్మకాయ, తెల్ల తేనె గోరువెచ్చని నీటిలో వేసి తాగవచ్చు. ఇది దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తోంది.

Health Benefits Of White Honeyవాస్తవానికి, దాని సూక్ష్మజీవుల కారణంగా తెల్ల తేనె కొన్నిసార్లు బొటూలిజానికి కారణమవుతుంది. బోటులిజం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది. కాబట్టి ముడి తేనెలో అనేక గుణాలు ఉన్నా.. వైద్య నిపుణుడి సలహా తీసుకున్న తర్వాతే ఎల్లప్పుడూ కొంత పరిమాణంలో తీసుకోవాలి. అప్పుడే ముడి తేనె నుంచి ప్రయోజనాలు పొందగలం. శరీరానికి కూడా ఎలాంటి హాని ఉండదు.

Health Benefits Of White Honeyరోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు కూడా ముడి తేనెను తీసుకోకూడదు. తెల్ల తేనెను అధికంగా తీసుకోవడం వల్ల కొన్నిసార్లు శరీరంలో ఫ్రక్టోజ్ అనే మూలకం పెరుగుతుంది. ఇది పోషకాలను గ్రహించే చిన్నపేగు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ముడి తేనెను అధికంగా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ సమస్యకు కారణమవుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR