Home Health చిరు ధాన్యాలు వలన ఆరోగ్యానికి కలిగే మేలు ఏంటో తెలుసా ?

చిరు ధాన్యాలు వలన ఆరోగ్యానికి కలిగే మేలు ఏంటో తెలుసా ?

0

మన తాతలు, అవ్వలు వృద్ధాప్యంలో కూడా బాగా ఆరోగ్యం జీవించడం మనం చూశాము. కారణం వారు ధాన్యంతో చేసిన సాంప్రదాయ ఆహారాలను మాత్రమే తీసుకునేవారు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్ మరియు విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సాంప్రదాయక ఆహారాలు అంటే సిరిధాన్యాలు లేదా చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు. వీటినే ఇంగ్లీష్ లో మిల్లెట్స్ అని పిలుస్తారు.

Health benefits with whole grainsప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు వాడకం పట్ల ఎక్కువగా మక్కువ చూపుతున్నారు, వాటిలో అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు. మీరు ఎవరైనా ఫిట్‌నెస్ ఔత్సాహికుడితో మాట్లాడి చూడండి వారు చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల పొందుతారని మీకు హామీ ఇస్తారు. ఇవి మీ ఆరోగ్యాన్ని పెంచుతాయి మరియు బరువు తగ్గడంతో పాటు గ్లూటెన్ రహితంగా ఉంటాయి.

ఆరోగ్యకరమైన ఆహారం మన చుట్టూ ఉన్నాకానీ మనం మాత్రం ప్యాశ్చాత్య పోకడలకు అలవాటు పండి జంక్ ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయినప్పటికీ, దీర్ఘకాలిక ప్రాతిపదికన జంక్ ఫుడ్ వినియోగం, మనందరికీ తెలిసినట్లుగా, మన ఆరోగ్యానికి చాలా హానికరం. మీ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఆరోగ్యకరంగా ఎంపిక చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. సిరిధాన్యాలు లేదా చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు(మిల్లెట్లు) వివిధ రకాలుగా లభిస్తాయి, ప్రతి దానిలో వాటికవే ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సంవత్సరంలో ఏ సమయంలోనైనా మీరు సూపర్ మార్కెట్‌లో పొందవచ్చు మరియు ఇప్పటికీ చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు(మిల్లెట్ల)ను స్టాక్‌లో కనుగొనగలుగుతారు.

రోజువారీ ఆహారంలో భాగంగా చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు(మిల్లెట్ల)ను తీసుకోవడం ఇప్పుడేమీ కొత్త కాదు, పూర్వ కాలం నుండే వీటి వినియోగం ఎక్కువగా ఉండేది. వాస్తవానికి, హరిత విప్లవం బియ్యం మరియు గోధుమలను మరింత అందుబాటులోకి తెచ్చే వరకు మధ్య మరియు దక్షిణ భారతదేశ జనాభా చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు(మిల్లెట్ల)ను ప్రధాన ఆహారంగా తీసుకునెవారు.

సిరిధాన్యాల వలన ప్రయోజనాలు:

ఈ ధాన్యాలు ఏవైనా సరే బాగా నమిలి తినాలి. దాని వలన ప్రతి గంటకొకసారి ఏదో ఒకటి తినాలి అని అనిపించదు. అతిగా తినటం అనే అలవాటు తగ్గుతుంది.

వీటిని ఆహారంగా తీసుకుంటే రక్తంలో గ్లూకోస్ శాతం తగ్గుముఖం పడుతుంది. దీని వలన మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కాల్షియమ్ వీటిలో చాలా అధికంగా ఉంటుంది. కాల్షియమ్ వల్ల దంతాలు, ఎముకలు గట్టిగా ఉంటాయి.

సిరిధాన్యాలు పీచుని అధికంగా కలిగి ఉంటాయి. అందువలన వీటిని తింటే కిడ్నీలో, పిత్తాశయంలో రాళ్ళు రావటం వంటి సమస్యలు తగ్గుతాయి.

  • వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, కొవ్వు తగ్గుతుంది. ఇప్పటికే అసిడిటీ ఉన్నవారు వీటిని తినటం వలన చాలా మేలు చేస్తాయి.
  • వీటిలో ఎలర్జీ కలిగించే గుణం ఉండదు కనుక చిన్న పిల్లలకు కూడా ఇవచ్చు.
  • ఊబకాయం, కాన్సర్ మరియు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా వీటిని రోజు తీసుకోవచ్చు.
    తక్కువ తినగానే పొట్ట నిండుగా అనిపించటం వలన ఊబకాయం కూడా తగ్గుతుంది.

  • వీటిలోని పీచు పదార్ధం వలన ఉదర సమస్యలు తగ్గుతాయి. బాగా నమిలి తినటం వలన ఆహారం జీర్ణం అవుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
  • రక్తహీనత కూడా తగ్గుతుంది. రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. దీని వలన హార్మోన్ల అసమానం తగ్గి సమస్యలు దరిచేరవు. హార్మోన్లు సరిగా ఉంటే సంతానలేమి సమస్య కూడా తగ్గుతుంది. ఇలా వీటి వలన ఒక్కో సమస్య దూరం అయి ఆరోగ్యం మెరుగు అయి మన జీవనం హాయిగా సాగుతుంది.
  • శరీరంలో వ్యర్ధాలు బయటకి పోవటానికి ఇవి ఉపయోగపడతాయి.
  • సిరిధాన్యాలు తినటం వలన చెడు కొవ్వు బాగా తగ్గుతుంది. మనకి అవసరమైన కొవ్వు పదార్దాలు (good cholestrol) లభిస్తాయి.

  • అతి భయంకరంగా చెప్పబడే కాన్సర్ వ్యాధి బారిన పడకుండా మనల్ని కాపాడుతాయి ఈ ధాన్యాలు. రక్త పోటు ఉన్నవారు వీటిని తీసుకోవటం వలన అది అదుపులో ఉంటుంది.
  • శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి.
  • కాలేయం, పిత్తాశయం పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.
  • గాస్ట్రిక్, పొట్ట ఉబ్బరం లాంటి ఉదర సమస్యలు దరిచేరవు.

 

Exit mobile version