అడ్డరసం మొక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

సాధారణంగా పల్లెటూరు ప్రజలు పొలం పనులకు వెళ్తూ ఉంటారు. వారు పొలాల్లో నడిచే దుగాలపై కొన్ని మొక్కలు కనపడుతూ ఉంటాయి. పిచ్చిమొక్కలు పెరుగుతూ ఉంటాయి. వాటిలో ఓ మొక్క ఇప్పుడు శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. అదే అడ్డసరం మొక్క. దీనిని ఉపయోగించి కరోనాకు విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. క‌రోనా వైర‌స్‌పై ఈ మొక్క ఏ మేర‌కు ప‌ని చేస్తుంద‌నే విష‌యంపై ఢిల్లీలోని ఆయుర్వేద‌, ఐజీఐబీ వంటి జాతీయ సంస్థ‌లు సంయుక్తంగా ప‌రిశోధ‌న‌లు చేప‌ట్టాయి.

health benefits there are with addar plantఈ మొక్కను మలబార్ నట్ ట్రీ, అడూస అని కూడా పిలుస్తారు. దీని శాస్ర్తీయ నామం అడహతోడ వాసికా నీస్. అడ్డసరం పొలం గట్ల మీద 1-4 మీటర్ల ఎత్తువరకు పెరిగే బహువార్షిక పొద. ఈ మొక్కు సామాన్య పత్రాలు కణుపునకు రెండు చొప్పున అభిముఖంగా అమరివుండి పొడవుగా, దీర్ఘవృత్తాకారంలో దళసరిగా, పెళుసుగా ఉంటాయి. ఆకర్షనీయమైన తెల్లని పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి.అయితే అడ్డసరం మొక్క గురించే ప్రస్తుతం నెట్టింట చాలామంది చర్చించుకుంటున్నారు. దీనిని ఉపయోగించి కరోనాకు విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. పరిశోధనల్లో వ్యాక్సిన్ కంటే చురుకుగా ఈ మొక్క సానుకూల ఫలితాలు ఇస్తుందని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పడంతో ఆశలను రేకెత్తిస్తోంది. ఈ మొక్కలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. దీని ఆకులు, పూలు, వేర్లు, కాండం మందుల తయారీలో ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. దీనిని వివిధ వ్యాధుల నివారణకు కూడా వినియోగిస్తున్నారు.

health benefits there are with addar plantచర్మవ్యాధులు, దగ్గు, జలుబు, ఉబ్బసం, రక్తస్రావం నివారణకు, పలు వ్యాధుల చికిత్సలకు ఉపయోగిస్తున్నారు. ఆకులను ప్రత్యేకంగా కొన్ని వ్యాధులు నయం కావడానికి ఉపయోగిస్తారు. కాండం, పుష్పాలు ఇలా ప్రతీ దానిని ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు.ఇప్పడు అన్నింటిని ఉపయోగించి కరోనాను నియంత్రించడానికి దీనిని వినియోగించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కరోనా రోగికి ప్రత్యేకంగా కొన్ని లక్షణాలు కనపడతాయి.

health benefits there are with addar plantసెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి లక్షణాలు లేకున్నా కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇది ఆందోళన కలిగించే అంశం అయినప్పటికీ కరోనా నివారణకు అడ్డసరం మొక్క ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కరోనా రోగిలో ఎక్కువ శాతం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటాడు. ఆక్సిజన్ స్థాయి తగ్గడం, రక్తం గడ్డకట్టడం వంటివి కూడా చూస్తుంటాం. వీటిని నియంత్రించడంలో ఈ మొక్క ఎంతగానో దోహదపడుతుందని పరిశోధనల్లో తేలింది. వైరస్‌ ప్రభావాన్ని తగ్గించడానికి, రోగనిరోధకశక్తిని పెంచడానికి తోడ్పడే జన్యువులకు సహాయపడే గుణాలు అడ్డసరం మూలికలలో ఉన్నాయని అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధన పత్రం తాజాగా రెస్పిరేటరీ రీసెర్చ్‌ పబ్లికేషన్‌లో ప్రచురితం అయింది.

health benefits there are with addar plantదీంతో ప్రతీ ఒక్కరికీ ఆశలు రేకెత్తాయి. ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరిశోధనల్లో అడ్డసరం మొక్క ఉపయోగపడితే చాలా మంది ప్రాణాలను కాపాడటంతో పాటు మహమ్మారి నుంచి కూడా పూర్తిగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా అడ్డరసం మొక్కతో ఇంకా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..

దగ్గు, ఆయాసం నివారణకు అడ్డసరం ఆకులు, వేర్లు అత్యంత ఉపయోగకరమైనవి. దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడే వారు, ఊపిరి అందక ఆయాస పడేవారు వేరు కషాయంలో చేర్చి 15 మి.లీ చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

health benefits there are with addar plantదీని ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరడును ఔషధాల్లో విరివిగా వాడతారు. అడ్డసరం మొక్కలో వాసిసిన్, అఢతోడిక్ ఆమ్లం, సుగంధ తైలం ఉంటాయి.అడ్డసరం పుష్పాలను సుఖవ్యాధుల నివారణ కు వాడతారు.

ఈ మొక్కలోని అన్నిభాగాలు నులి పురుగులను నివారిస్తాయి. ఉబ్బసం ఉపశమానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

health benefits there are with addar plantఅడ్డసరం ఆకుల కషాయం రోజుకు మూడుసార్లు సేవిస్తే రక్త విరేచనాలు, వాంతిలో రక్తం పడడటం, మొండి జ్వరాలు తగ్గుతాయి.

health benefits there are with addar plantగోరువెచ్చని ఆకు కషాయం చర్మానికి పూస్తే తామర, దురద, గజ్జి, దద్దుర్లు తదితర చర్మవ్యాధులు నయమవుతాయి, చర్మదోశాలలో అడ్డసరం (వైద్యమాత) కాషాయం తాగిస్తే తగ్గుతాయి.

health benefits there are with addar plantనరాల సమస్యలు, పట్లు, నొప్పులు తగ్గిపోతాయి. నీళ్ళవిరేచనాలను తగ్గిస్తుంది. కంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR