పరగడుపునే బీట్ రూట్ జ్యూస్ తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు

బీట్‌రూట్‌ అంటే పెద్దగా ఎవరికీ ఇష్టం ఉండదు. తియ్యగా, వగరుగా ఉండే ఈ దుంపను పచ్చిగా తినేందుకు, జ్యూస్‌ తాగేందుకు కూడా ఆలోచిస్తారు. కానీ బీట్‌రూట్‌ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుంటే అసలు తినకుండా ఉండలేరు. బీట్‌ రూట్ లో మనిషికి కావాల్సిన చాలా పోషకాలుంటాయి.

బీట్‌రూట్‌శక్తినిచ్చే శాకందుంపల్లో బీట్‌రూట్‌ది ప్రత్యేక స్థానం. ఇది కనులకు ఇంపుగా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా ఎంతో మంచిది. బీట్ రూట్ జ్యూస్ లో కొవ్వు మరియు కెలరీలు అతి తక్కువగా ఉంటాయి. ప్రతి రోజు 200 నుండి 250 మిల్లీలీటర్ల బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషక విలువలు అందుతాయి. ఉదయాన్నే తాగడానికి బీట్ రూట్ జ్యూస్ ఎంతో అనువైనది.

బీట్‌రూట్‌రక్తహీనతతో బాధపడేవారు బీట్ రూట్ ను ఉపయోగిస్తే చాలా మంచిది. అయితే బీట్‌రూట్‌ను తినడం ఇష్టం లేని వారు, కనీసం దాని జ్యూస్‌ను ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపునే తాగాలి. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎనీమియాతో బాధపడేవారు రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్‌ రసం తాగితే త్వరగా కోలుకుంటారు. బీట్‌ రూట్ జ్యూస్ రోజూ తాగితే ఐరన్ పెరుగుతుంది. అలాగే బ్లడ్ లో హిమోగ్లోబిన్‌ స్థాయి కూడా పెరుగుతుంది.

బీట్‌రూట్‌చాలా మంది నీరసంతో ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు కొన్ని బీట్ రూమ్ ముక్కలు తిన్నా లేదంటే బీట్ రూట్ జ్యూస్ తాగినా సరిపోతుంది. దీంతో నీరసం పోయి ఫుల్ ఎనర్జీ వస్తుంది. బీట్‌రూట్‌ లో విటమిన్‌ ‘ఎ’, ‘సి’, ‘ఇ’లతో పాటు ఐరన్‌, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇక ఈ జ్యూస్‌లలో కొంచెం పసుపు, అల్లం లాంటివి జత చేయడం ద్వారా జలుబు, దగ్గు వంటి వాటికి కూడా చెక్‌ పెట్టవచ్చు. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు కూడా ఈ జ్యూస్‌ని కొద్ది మొత్తంలో తీసుకోవచ్చు.

బీట్ రూట్ జ్యూస్కొంతమంది చూడ్డానికి ఆరోగ్యంగా ఉన్నా కండరాలు బలహీనంగా ఉంటాయి. అలాంటి వారు కండరాల్లో శక్తి పెంచుకోవాలంటే బీట్ రూట్ రసం తాగాల్సిందే. ఇందులో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి నైట్రిక్ ఆమ్లాన్ని అందిస్తాయి. జీవక్రియల రేటుని మెరుగుపరుస్తాయి. నైట్రేట్లు శరీరానికి అందడం వల్ల శరీరంలో రక్తనాళాలు ఉత్తేజితమై, రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. దీనివల్ల కండరాల నొప్పులు తగ్గుముఖం పడతాయి. కాబట్టి తరచూ బీట్ రూట్ రసం తాగడం వల్ల.. కండరాలూ, శారీరం దృఢంగా తయారవుతాయి.

బీట్ రూట్ జ్యూస్ బీట్ రూట్ జ్యూస్ లో ఉండే నైట్రేట్ల వల్ల కండరాలు బలంగా తయారవుతున్నట్టు 2015 లో సైంటిస్ట్లు గుర్తించారు. 2015 లో జరిగిన ఈ అధ్యయనం ప్రకారం బీట్ రూట్ జ్యూస్ తాగిన రెండు గంటల తర్వతా గుండె జబ్బులు ఉన్న వారి కండరాల శక్తి 13 శాతం పెరిగినట్టు గుర్తించారు. బీట్‌రూట్ జ్యూస్ శరీరంలోని ప్లాస్మా నైట్రేట్ స్థాయిని పెంచుతుంది మరియు శారీరక పనితీరును పెంచుతుంది.

బీట్ రూట్ జ్యూస్శారీరంలోని నరాలు, కండరాలు సరిగ్గా పనిచేయాలంటే పొటాషియం చాలా అవసరం. శరీరంలో పొటాషియం ఒక ఎలక్ట్రోలైట్ లాగా పనిచేసి యాక్టివ్ గా ఉంచుతుంది. శరీరంలో పొటాషియం లెవల్స్ తగ్గితే అలసట, బలహీనపడటం, తిమ్మిర్లు వంటివి సంభవిస్తాయి. మనిషికి కావాల్సిన పొటాషియం బీట్ రూట్ లో అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు బీట్ రూట్ తినడం లేదా బీట్ రూట్ జ్యూస్ తాగవడం వల్ల శరీరానికి కావాల్సిన పొటాషియం కొంత వరకు అందే అవకాశం ఉంది.

బీట్ రూట్ జ్యూస్కావాల్సిన ఖనిజాలు/ మినరల్స్ లేకుండా మన శరీరం సరిగా పనిచేయదు. కొన్ని ఖనిజాలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి, మరికొన్ని ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాలకు ఏర్పడటానికి సాయం చేస్తాయి. మనం పైన చెప్పుకున్నట్టు బీట్ రూట్ లో పొటాషియంతో పాటు కాల్షియం , ఐరన్, మెగ్నీషియం , మాంగనీస్ , ఫాస్పరస్ , సోడియం, జింక్ , కాపర్ , సెలీనియం వంటి ఇతర మినరల్స్ సైతం బీట్ రూట్ నుండి కొద్దిమోతాదులో లభిస్తాయి.

బీట్ రూట్ జ్యూస్వృద్ధులలో మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి మరియు మతి మరుపు వచ్చే గుణాన్ని నెమ్మది చేయడానికి నైట్రేట్లు సహాయపడతాయి. బీట్ రూట్ లో ఈ నైట్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల డిమెన్షీయా లేద మతి మరుపు వచ్చే వేగం నెమ్మదిస్తుంది. ఈ విషయంలో అనేక ప్రయోగాలు జరిగినప్పటికి నూటికి నూరు శాతం ఇది నిరూపణ కాలేదు. అయితే బీట్ రూట్ తినడం లేదా బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల మతిమరుపు తగ్గడం, అల్జిమర్స్ వచ్చే వేగం తగ్గడం మాత్రం జరుగుతుంది.

బీట్ రూట్ జ్యూస్బీట్‌రూట్ జ్యూస్ మీ రక్తపోటును తగ్గించడంలో లేదా అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్ లో ఉండే నైట్రేట్లు కాంపౌండ్స్ రక్తంలో నైట్రిక్ యాసిడ్‌గా మారి రక్త నాళాలను రిలాక్స్ అయ్యేలా చేయడం వల్ల రక్తనాళాలకు విశ్రాంతి దొరుకుతుందని అందువల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. బీట్ రూట్ లో ఉండే బీటైన్ అనే పదార్థం లివర్ లోని టాక్సిన్స్ ను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అధిక మద్యపానం, ఫ్రైడ్ ఫుడ్స్ , బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తినే వాళ్లు బీట్ రూట్ జ్యూస్ తాగితే లివర్ కు మేలు జరుగుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR