గోరింటాకు వల్ల ఆరోగ్యానికి, అందానికి కూడా అనేక లాభాలున్నాయి అవి ఏంటో తెలుసా ?

మనదేశంలో ప్రాచీన కాలం నుండి గోరింటాకు ఎంతో చరిత్ర ఉంది. గోరింటాకు పెట్టుకోవడం అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. కొంతమంది పదిరోజులకొకసారైనా పెట్టుకుంటారు. సౌందర్య, సౌభాగ్య చిహ్నమైన గోరింటాకు ఎంతో ఆరోగ్యదాయకమైంది. దీనిలోని ఔషధ గుణాల గురించి తెలుసుకొంటే ఔరా అనకుండా ఉండలేరు. ఏ సందర్భమూ లేకుండా చేతులకు గోరింటాకు పెట్టుకోవడం కూడా ఓ వేడుకే. మహిళలు ఎర్రగా పండిన చేతులను చూసుకొని మురిసిపోతుంటారు. చేతిని అందంగా పండించే గోరింట వల్ల ఆరోగ్యానికి, అందానికి కూడా అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణకు గోరింట చేసే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Health benefits with gourd

  • గోరింటాకు బెరడు, విత్తనాలు జ్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. విత్తనాలు విరేచనాలను తగ్గిస్తాయి.
  • వాననీటిలో తిరిగినప్పుడు కాళ్ళు నాని ఇన్ఫెక్షన్ వల్ల వేళ్ళమధ్య పుండ్లు, గోరు పుచ్చిపోవడం, ఏదైనా దెబ్బతాకి ఇన్ఫెక్షన్ సోకడం వంటివి జరుగుతాయి. అలాంటప్పుడు గోరింటాకు ముద్దని గోరుకు తరుచూ పెట్టుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
  • కొందరికి అరికాళ్లు మండుతూ ఉంటాయి. అప్పుడు కూడా గోరింట పేస్టును రాయాలి. మంట తగ్గి కాస్త ఉపశమనం లభిస్తుంది.

Health benefits with gourd

  • గోరింటాకు కాలికి పెట్టుకుంటే పగిలిన మడమలూ సున్నితంగా మారతాయి.
  • కీళ్ల నొప్పులకు కూడా గోరింట ముద్ద బాగా పనిచేస్తుంది. గోరింటాకు ముద్దని పట్టించాలి.
  • గోరింటాకు ముద్దని మాడుకి తగలేలా రాసుకుంటే వెంట్రుకలు రాలడం కూడా తగ్గించి బాగా పెరుగుతాయి. తెల్లబడిన వెంట్రులకు రంగు వేయడం కన్నా వారానికోసారి గోరింట పెట్టుకుంటే సహజసిద్ధంగా నల్లగా మారతాయి.

Health benefits with gourd

  • నువ్వుల నూనెలో గోరింటాకు మరిగించి తలకు రాసుకుంటే కళ్ళుమంటలు, తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడడం వంటివి తగ్గుతాయి.
  • గాయమై రక్తం కారుతున్న చోట , కీళ్ళనొప్పులు, వాపులకు గోరింటాకు నూనె పైపూతగా వాడితే మంచిగుణం కనబడుతుంది.
  • శరీరంలో వేడి పెరిగినప్పుడు అరికాళ్ళ నిండా గోరింటాకు పట్టిస్తే వేడి తగ్గిపోతుంది.
  • గోరంటాకు పెట్టుకొన్న మహిళల్లో మానసిక ఒత్తిడి దూరమైనట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

Health benefits with gourdవర్ష కాలంలో గోరింటాకు పెట్టుకుంటే చర్మ వ్యాధుల బారి నుంచి రక్షణ పొందవచ్చు అనేది ఆరోగ్య రహస్యం. అందుకే ఆషాడమాసంలో వానలు ఎక్కువై ఇంటి లోగిళ్ళు, పంట పొలాలు బురదమయమై, క్రిమి కీటకాలు పెరుగుతాయి. మహిళలు వాటిలో పనిచేయడం సహజమే కాబట్టి వారికి చర్మ రోగాలు దరిచేరకుండా గోరింటాకును పెట్టుకునేవారు.

కేవలం అలంకరణగానే కాకుండా గోరింటాకును హెయిర్‌ డైగా, పొడినిహెన్నాగా ఉపయోగిస్తున్నారు. గోరింటాకుకు గాయాలను మాన్చే గుణం ఉంటుంది.

Health benefits with gourdదీని సహజ గునాల వల్ల తల్లనొప్పి, చర్మవ్యాధులు, లివర్‌ సమస్యలు వంటివి కూడా తగ్గుతాయి. ఔషధ గుణాల వల్ల గొంతులో ఇన్‌ఫెక్షన్‌, కాళ్ళ మంటలు తగ్గుతాయి. అలాగే గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. గోరింటాకు ఆకులను కానీ లేదా పొడిని కానీ వేడి నీళ్లుతో కలిపి రాత్రంతా నాన బెడితే మరింత డార్క్‌ కలర్‌లో గోరింట పడుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR