సాధారణంగా కర్పూరం అనగానే హారతికి ఉపయోగించే కర్పూరమే గుర్తుకు వస్తుంది. ఇది మైనంలా తెల్లగా వుండి ఒక ఘాటైన వాసన కలిగిన పదార్థం. గుళ్లల్లో, ఇళ్లల్లో పెళ్లిల్లు, పూజల్లో కర్పూరాన్ని తరచుగా వాడుతుంటాం. కర్పూరాన్ని రుచికోసం మిఠాయిల్లో కూడా వాడుతారు. ఒక విశిష్ఠతను సంతరించుకున్న కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు వున్నాయని మనలో చాలామందికి తెలియదు. కర్పూరంలో పదిహేను రకాలు ఉన్నాయి. అవి: 1. ఘన సారం, 2. భీమసేనం, 3. ఈశావాసం, 4. ఉదయ భాస్కరం, 5. కమ్మ కర్పూరం, 6. ఘటికం, 7. తురు దాహం, 8. తుషారం, 9. హిమ రసం, 10. హారతి, 11. శుద్ధం, 12. హిక్కరి, 13. పోతాశ్రయం, 14. పోతాశం, 15. సితా భ్రం. వాటిలో తెల్ల కర్పూరం, పచ్చ కర్పూరం అనే రెండు రకాలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి.
తెల్ల కర్పూరం మనం తరుచూ హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తునే ఉంటాం. ఇది పూజకే కాదు ఆరోగ్యానికి కూడా మంచి మందులా పనిచేస్తుంది. జలుబు, దగ్గు, ముఖంపై మొటిమలు, కాళ్ల పగుళ్లకు కర్పూరం చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. కాలిన చోట కర్పూర తైలాన్ని రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది. దురద వున్నచోట కర్పూర తైలాన్ని అప్లై చేస్తే ఆ సమస్య తగ్గడమే కాకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి వుంచినట్లైతే గాలిలో బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. మనచుట్టూ వున్న పర్యావరణాన్ని శుభ్రంగా వుంచుతుంది.
ఇక పచ్చకర్పూరం అంటే, కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.
పచ్చ కర్పూరం తెల్లదని కంటే చాలా మంచి ప్రయోజనాలు ఇస్తుంది. ఇది మార్కెట్లలో పలుకులు పలుకులుగా లభిస్తుంది. ఈ పలుకులు రెండు, మంచి గంధం కొంచెం, వెన్న కొంచం కలిపి తమలపాకులో పెట్టుకొని నమిలి రసాన్ని మింగుతూ ఉంటె, శరీరంలోని అతివేడి ఇట్టే తగ్గిపోతుంది. ఈ కర్పూరం తీసుకోవడం వలన కళ్ళు బైర్లు కమ్మడం, తలతిరగటం, కడుపులో వికారం, అతిగా శరీరానికి చెమటలు పట్టడం లాంటివి తగ్గిపోతాయి.
పచ్చ కర్పూరాన్ని రోజు మూడు పూటలా, రెండు పలుకులు తీసుకుంటే.. శరీరానికి బలాన్ని కలిగించడమే కాకుండా, రక్తపుష్టి చేకూరుతుంది. ఈ కర్పూరం తో రక్తపోటుకు చెక్ పెట్టవచ్చు. అలాగే కంటి జబ్బులు, రక్త స్రావం లాంటివి అరికట్టవచ్చు. కంటి సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ పచ్చకర్పూరాన్ని తీసుకుంటే కళ్ళు మంటలు, ఎరుపెక్కడం, కంటి వెంట నీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గిపోతాయి. బాగా పైత్యం చేసినవారికి వికారం తగ్గిస్తుంది. వేడి చేయడం వలన వచ్చే ఒళ్ళు మంటలు, అరికాళ్ళ-చేతుల మంటలు వంటివి తగ్గాలంటే, పచ్చకర్పూరాన్ని గ్లాసు పాలల్లో కలిపి తీసుకోవాలి; వెంటనే ఉపశమనం ఉంటుంది.
చిటికెడు బెల్లం, చిటికెడు పచ్చకర్పూరం కలిపి తీసుకుంటే ఉబ్బసం వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఏదైనా మందులు వాడుతున్నప్పుడు, వాటితోపాటు ఒక్కపలుకు పచ్చ కర్పూరం కూడా తీసుకుంటే ఆ ఔషధగుణం పెరుగుతుంది. పచ్చకర్పూరంతో వడదెబ్బ, దాహం, తపన, శరీరం చిటపటలాడటం, శోషకు గురికావటం లాంటివి ఉండవు. మహిళల్లో మర్మావయవాల దురద తగ్గాలంటే పచ్చ కర్పూరాన్ని రోజ్ వాటర్‌లో కలిపి మెత్తగా నూరాలి. దీనిలో దూదిని ముంచి దురద ఉన్న చోట 15 నిమిషాలు ఉంచి ఆ తరువాత కడిగేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే ప్రయోజనం వుంటుంది.
శృంగార కోరికలు పెంచుకోవడానికి చాలామంది వయాగ్రా వాడుతుంటారు. వీటిని వాడటంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ పచ్చ కర్పూరంతో సహజసిద్ధమైన వయాగ్రాని తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవచ్చంటే.. పచ్చకర్పూరం-5 గ్రాములు, జాజికాయ-5 గ్రాములు, జాపత్రి- 5గ్రాములు, ఎండుద్రాక్ష- 5గ్రాములు తీసుకోవాలి. వీటన్నింటిని కలిపి బాగా నూరి చిన్నచిన్న బఠాణి గింజంత మాత్రలుగా తయారుచేయాలి. వీటిని రోజూ పడుకోబోయే ముందు ఒక మాత్ర వేసుకుని ఒక గ్లాసు పాలు తాగడం వల్ల వీర్యవృద్ధి చెందడమే కాక లైంగిక సామర్ద్యం కూడా పెరుగుతుంది.
శరీరానికి ఆయిల్ మసాజ్ చేసుకునే ముందు ఆయిల్ లో చిటికెడు పచ్చ కర్పూరం పొడి కలిపి శరీరానికి ఆయిల్ మసాజ్ చేయడం వలన కరోనా వైరస్ ను ఎక్కువ శాతం నివారించడానికి ఉపయోగపడుతుంది. ఆవు నెయ్యిలో చిటికెడు పచ్చ కర్పూరం కలిపి చేతులకు బాగా మర్దన చేసుకున్నా కరోనా వైరస్ ను అరికట్టవచ్చును. చేతులకు మర్దన చేసుకున్న ఆవునెయ్యి, కర్పూరం వాసనను తరచూ పిల్చుకుంటే అద్బుతమైన వైరస్ నకు నివారణ మందులా పనిచేస్తుంది.