Home Health మినుములని రోజూవారి ఆహరంలో తీసుకుంటే కలిగే ఫలితాలు ఏంటో తెలుసా ?

మినుములని రోజూవారి ఆహరంలో తీసుకుంటే కలిగే ఫలితాలు ఏంటో తెలుసా ?

0

మినుములు తింటే ఇనుము అంత బలం అని మన పెద్దలు అంటుంటారు. వీటిలో ఉన్న పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని, అలాగే రకరకాల జబ్బులను నివారిస్తాయని వైద్యులు అంటున్నారు. అలాంటి మినుములని మన రోజూవారి ఆహరం లో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

health benefits with minumuluప్రతీ ఉదయం తినే ఇడ్లీ, వ‌డ ఇలా ఏదైన మినుములతోనే త‌యారు అవుతాయి. వాటిని నాన‌బెట్టి పిండి చేసి చేస్తారు. దీన్నీ వ‌ల్ల శ‌రీరానికి అధిక మొత్తంలో ఐరన్ లభిస్తుంది. మినుముల్లో ప్రోటీన్లు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

ఇక గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. మినుముల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. షుగ‌ర్ స‌మ‌స్య రాదు అంటున్నారు. గ్లూకోజ్ స్ధాయిలు నియంత్రిస్తుంది. ర‌క్తంలో చ‌క్కెర స్ధాయిలు పెర‌గ‌కుండా ఉంటాయి. యాంటియాక్సిడెంట్ల వ‌ల్ల క‌డుపులో మంట త‌గ్గుతుంది.

గ‌ర్భిణీలు కూడా మినువులతో చేసిన ప‌దార్దాలు తీసుకోవ‌‌చ్చ‌ని అంటున్నారు..రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ డయాబెటిస్ రాకుండా కాపాడతాయి. ఎముక‌లు బ‌లంగా మార‌తాయి, కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.

మినుముల్లో దాదాపు 72 శాతం ఫీచు ఉండటం వల్ల మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డయేరియా, డిసెంట్రీ వంటి సమస్యలు ఉన్న వారు కూడా మందులకు బదులు మినుములతో చేసిన వంటకాలను తినవచ్చని ఆహార నిపుణులు అంటున్నారు.

 

Exit mobile version