బాదం వలన గుండె సంబంధిత సమస్యలు తొలిగిపోతాయా

గుండె సమస్యలకు ప్రధాన కారణం ఒత్తిడి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న వారిలోనే గుండె సమస్యలు ఏర్పడుతున్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో నిర్థారణ అయ్యింది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అన్ని అంశాల్లోనూ మానసిక ఒత్తిడే ప్రధాన కారణం కావడం గమనార్హం. అయితే మానసిక ఒత్తిడి కారణంగా గుండె సమస్యలు ఉత్పన్నంకాకుండా బాదం పప్పులు రక్షణ కవచంలా నిలుస్తాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన అధ్యయన నివేదికలో నిపుణులు తెలిపారు.

Health Benfits Of Almondప్రధానంగా మానసిక ఒత్తిడితో హార్ట్ రేట్ వేరియబిలిటీ పడిపోవడాన్ని బాదం నిరోధిస్తుందని ఓ అధ్యయనంలో శాస్త్రవేత్తలు తెలిపారు. గుండె ఆరోగ్యానికి బాదం చాలా మంచిది. అది చెడ్డ కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. ఆరు వారాల పాటు బాదాంను స్నాక్స్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని…దీన్ని తీసుకున్న వారిలో హృదయ స్పందనలు బాగున్నాయని చెప్పారు. గుండె సంబంధిత సమస్యలే కాదు ఇతర ఆరోగ్య సమస్యల నివారణకూ బాదం ఉపయోగించవచ్చు.

Health Benfits Of Almondబాదం ఒమేగా 3, విటమిన్ ఇ, ప్రొటీన్, పీచుతో నిండి ఉంటుంది. దీని పోషకాహార విలువలని బట్టి సూపర్ ఫుడ్ అనొచ్చు. ఇందులో ఉన్న ప్రొటీన్ కారణంగా తొందరగా ఆకలి వేయదు. మెగ్నీషియం వల్ల ఎముకలు బలపడతాయి, ఇంకా మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. అంతేకాదు, రక్తపోటు ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. నానబెట్టిన బాదం పప్పులో నించి లిపేజ్ అనే ఒక ఎంజైమ్ విడుదల అవుతుంది. ఇది అరుగుదలకీ, అనవసరమైన కొవ్వు కరగడానికీ ఉపయోగపడుతుంది. ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. బాదాం పప్పులు తొందరగా ఆకలి కానివ్వవు. కాబట్టి అప్పుడప్పుడూ అవి తింటూ ఉండడం వల్ల త్వరగా ఆహారం మీదకి మనసు మళ్ళకుండా ఉంటుంది.

Health Benfits Of Almondబాదం లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి వయసు కనపడనివ్వకుండా చేస్తుంది. బాదం లో అద్భుతమైన పోషక గుణాలు ఉన్నాయి. పాయసం మీద సన్నని పలుకులుగా చేసి చల్లినా, నూరి కుర్మా లో వాడినా, నానబెట్టి రుబ్బి బాదం పాలు తయారుచేసినా మంచి ఫలితం ఉంటుంది. ఈ లాభాలన్నిటినీ పొందాలంటే బాదంని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆనంద, ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతం అవుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR