గ్రీన్ ఫుడ్స్ అంటే ఏంటి? వీటి వల్ల కలిగే ఉపయోగాలేంటి?

గ్రీన్ ఫుడ్స్.. వీటి కలర్ లాగానే మన ఆరోగ్యాన్ని కూడా కలకాలం పచ్చగా ఉంచుతాయి.. అందుకే మనం ప్రకృతిలో భాగమైన గ్రీన్ ఫుడ్‌నే ఎక్కువగా తీసుకోవాలి.

గ్రీన్ ఫుడ్ అనేది అత్యంత తాజా ఆహారంగా పేర్కొనబడింది.. మనం రోజువారీ ఆహారంలో ఏం తిన్నా, తినకపోయినా… గ్రీన్ కలర్ ఫుడ్స్ తప్పనిసరిగా ఉండేలా చేసుకోవాలి. ఇందుకోసం రోజూ కూరగాయలు, ఆకు కూరలే తినాల్సిన అవసరం లేదు. గ్రీన్‌ ఫుడ్‌లో చాలా రకాలున్నాయి. వాటిని తినడం అలవాటు చేసుకుంటే… మన వెంట పడుతున్న ఎన్నో రకాల రోగాలకు చెక్ పెట్టేయొచ్చు.. అంతేకాదు మనకి ముసలితనం వచ్చే అవకాశాలు తగ్గించవచ్చు.. . ఎందుకంటే… తాజా ఆహారం ద్వారా లభించే పోషకాలు… మనకు అత్యంత ఎనర్జీని ఇస్తాయి. మన బాడీలోని ప్రతీ కణాన్నీ రిపేర్ చేసి… ఆరోగ్యంగా ఉంచుతాయి. మరి ఈ గ్రీన్ ఫుడ్స్ అంటే ఏంటి.. వీటి వల్ల కలిగే ఉపయోగాలేంటి? మనం ఇపుడు తెల్సుకుందాం..

Green Foodsగ్రీన్ ఫుడ్స్‌ అంటే ఆవకాడో, పాలకూర, బచ్చలి కూర, క్యాబేజీ, బ్రకోలీ, నిమ్మకాయ, ద్రాక్ష, కొత్తిమీర, కరివేపాకు, పుదీన, గ్రీన్ టీ ఇలా చాలా ఉంటాయి. గ్రీన్ ఫుడ్స్‌లో యాంటీఆక్సిడెంట్స్ చాలా బలంగా ఉంటాయి. అవి వాతావరణంలో విష వ్యర్థాల్ని బాడీలోకి రాకుండా చేస్తాయి. ఆల్రెడీ బాడీలో వ్యర్థాలు వుంటే తరిమేస్తాయి.

Green Foodsగ్రీన్ ఫుడ్స్‌లో ఉండే పోషకాలు… వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. వైరస్‌లు, బ్యాక్టీరియాలకు చెక్ పెడతాయి. గ్రీన్‌ ఫుడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపేస్తాయి. ఈ ఫుడ్స్ ఎంత గ్రీన్‌గా ఉంటే అంత మంచివి. బాడీ మెటబాలిజంను సరిచేసే శక్తి గ్రీన్ ఫుడ్స్‌కి ఉంటుంది. గ్రీన్ ఫుడ్‌లో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది… రక్త కణాల్ని అభివృద్ది చేస్తుంది. ఆక్సిజన్‌ను పెంచుతుంది. విష వ్యర్థాల్ని తరిమేస్తుంది. రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వాడకంలో ఉన్న గ్రీన్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Green Foodsవీటిలో మొదటి స్థానం బచ్చలి కూరదే.. ఓ కప్పు తాజా బచ్చలి కూరలో రోజువారీ మనకు కావాల్సిన విటమిన్లు, మినరల్స్ అయిన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫొలేట్, విటమిన్ K, A, C సంవృద్ధిగా ఉంటాయి. అంతేకాదు… ఫైబర్, ప్రోటీన్స్, గ్లైకోగ్లిసెరోలిపిడ్స్ కూడా ఉంటాయి. ఇవి మన జీర్ణవ్యవస్థను రక్షిస్తాయి.మన శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. బీపీని కంట్రోల్ చేస్తాయి. కాన్సర్ కణాలను దరిచేరనివ్వవు.. ఎముకల్ని బలంగా చేస్తాయి. గుండెను కాపాడతాయి. కంటికి మేలు చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి వారంలో కనీసం రెండుసార్లైన బచ్చలి కూర తినాలి అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు..

Green Appleనెక్స్ట్ గ్రీన్ యాపిల్స్ .. గ్రీన్ యాపిల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్స్, డైటరీ ఫైబర్, పొటాషియం ఎక్కువ. అలాగే విటమిన్ A, C, B, E ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. గ్రీన్ యాపిల్‌ని తొక్కతో సహా తింటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. బరువు తగ్గాలంటే ఇవి తప్పక తినాలి. వీటిని తీసుకోవటం వలన బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే నోట్లో దంతాలు మెరుపవుతాయి. జీర్ణ క్రియ కూడా మెరుగవుతుంది.

Green Foodsఇక తరవాత కీర దోసకాయలు.. వీటిలో నీటి శాతం ఎక్కువ. ఎండాకాలంలో వీటిని ఎక్కువగా తినాలి. వీటిలో విటమిన్ A, C, B12, B6, D, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. మన శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా ఇవి కాపాడుతాయి… వీటిని తీసుకోవటం వలన బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. ఇందులోని విటమిన్ C వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. రోజూ మీరు తీసుకునే డైట్ లో కీర దోస కూడా తప్పక యాడ్ చేసుకోండి. ఇలాంటి తాజా గ్రీన్ ఫుడ్ తింటే… మంచి ఆరోగ్యం డెవలప్ అవుతుంది. అయితే మార్కెట్ లో ఎక్కువ కలర్ కోసం రంగులు పూసి మరీ అమ్మటం చూస్తున్నాం.. కాబట్టి జాగ్రత్తగా ఎంచుకుని తీసుకోవటం ఉత్తమం.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR