ఉసిరితో ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

0
433

‘శ్రీ ఫలం’ అని పిలువబడే ఉసిరికాయ ఎన్నో ఔషధ విలువలు కలిగి ఉంటుంది. విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉన్న ఉసిరి ఆయుర్వేద వైద్యంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. తల వెంట్రుకల దగ్గర నుండి కాలి గోల్ల వరకు మానవ శరీరానికి అద్భుతంగా ఉపయోగపడే సర్వరోగ నివారిణి ఉసిరి. ఆలయాల్లో ఉసిరి చెట్టు తిరగడం సాంప్రదాయం మాత్రమే కాదు దాని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఉసిరి చెట్ల గాలి చాలా మంచిదని దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆ గాలి ఆరోగ్యానికి మేలు చేస్తుందని.

Indian gooseberryఅలాంటి ఉసిరితో ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో అవసరమైన విటమిన్ “సి” అధికంగా ఉంటుంది అలాగే ఉసిరికాయ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పెంచుతుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉదయాన్నే ఒక మంచి ఉసిరి కాయ తినడం వలన షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఉసిరికాయ లో ఉండే విటమిన్ సీ వల్ల ఇన్‌ఫెక్షన్స్ దరి చేరకుండా ఉంటాయి. రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఉసిరికాయ, తేనె, కరక (త్రిఫల) చూర్ణాన్ని ఆవు నెయ్యితో కలిపి ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే మధుమేహ వ్యాధి తగ్గుతుంది.

diabetes2. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి ఉసిరి ఎంతగానో తోడ్పడుతుంది. ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణమండలం మొదలైన వాటి సమస్యలను తగ్గించడానికి ఉసిరి ఎంతగానో దోహదపడుతుంది. ఉసిరిలో ఉండే ఫైబర్ వల్ల పేగు కదలికలు మెరుగుపడి, జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది. ఇందులో ఉండే లాక్సటివ్ ప్రాపర్టీస్ వలన మలబద్ధకం సమస్య దూరమౌతుంది. ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ని ఉసిరికాయ లో ఉండే ఫైబర్ క్లీన్ చేసేస్తుంది.

immunity power3.ఆడపిల్లల్లో నెలసరి సమస్యలు తగ్గించడానికి కూడా ఉసిరికాయ రసం ఎంతగానో తోడ్పడుతుంది. బాడీలో ఐరన్ కంటెంట్ పెంచుతుంది. తద్వారా ఎనీమీయా రాకుండా ఉంటుంది. రకరకాల క్యాన్సర్లకీ, సెల్ డీజెనరేషన్ కీ కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ని ఉసిరి కాయ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అడ్డుకుంటాయి.

4. మొటిమల నివారణకు కూడా ఉసిరికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫేషియల్ చేసుకుంటున్నప్పుడు ఉసిరికాయ పొడిని మిక్స్ చేసి ముఖానికి అద్దుకోవడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. ఇది పింపుల్స్, యాక్నే ని క్లియర్ చేస్తుంది. ఉసిరికాయ రసాన్ని తేనె తో కలిపి తీసుకుంటే మిలమిలా మెరిసే చర్మం మీ సొంతమౌతుంది.

skin problems5. జుట్టు కుదుళ్ళని బలపరిచి, జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ కి మంచి మందు. ఉసిరికాయ రసంతో మసాజ్ చేస్తే చుండ్రు కూడా పోతుందని అంటారు. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

6. ఉసికి కాయ జ్యూస్ రోజూ తాగడం వల్ల మూత్రనాళ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా యూనినర్ బర్నింగ్‌ను పారద్రోలడంలో ఉసిరి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Indian gooseberry7. కంటి బాధలు ఉన్నవారు ఒక స్పూన్ ఉసిరి రసం, అర టీస్పూన్ తేనె కలిసి తాగితే రోజూ తాగితే ఆ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

8. బాడీ న్యూట్రియెంట్స్ ని అబ్జార్బ్ చేసుకునేలాగా చేస్తుంది. అంతే కాక శరీరం లో నుండి టాక్సిన్స్ ని ఫ్లష్ ఔట్ చేస్తుంది.

9.లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది.

SHARE