ముల్తానీ మ‌ట్టి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అందంగా కనిపించాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. అందుకోసం ఏవేవో క్రీమ్స్, ఫౌండషన్స్ వాడుతుంటారు. కానీ సహజ సిద్ధంగా అందాన్ని పెంచుకోవడానికి ముల్తానీ ఉపయోగిస్తే చాలు. ముల్తానీ మట్టితో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల నిర్జీవ కణాలు తొలిగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ ముల్తానీ మ‌ట్టి ఏ సీజ‌న్‌లో అయినా బాగా ప‌నిచేస్తుంది. ఎలాంటి చ‌ర్మం క‌లిగిన వారికైనా ముల్తానీ ప‌డుతుంది. దీనివ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు. వ‌ర్షాకాలంలో చ‌ర్మం బాగా పొడిబారుతుంది. అలాంటి వారికి ముల్తానీ ప‌ర్‌ఫెక్ట్ అని చెప్పొచ్చు‌.

multani mittiముఖానికి ముల్తానీ మ‌ట్టి వాడ‌డం వ‌ల్ల బ్ల‌డ్ స‌ర్క్యూలేష‌న్‌ను ఇంప్రూవ్ అవుతుంది. దాంతో స్కిన్ ప్రకాశవంతంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే.. ముల్తానీమట్టిని స్క్రబ్‌గా వాడవ‌చ్చు. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మొటిమల మచ్చలను దూరం చేయడంలో సహాయపడుతుంది. డార్క్ స‌ర్కిల్స్ ఎక్కువ‌గా వేధిస్తుంటే ముల్తానీ మ‌ట్టిలో నిమ్మరసం అలాగే పెరుగును కలిపి పేస్ట్ లా చేసి డార్క్ సర్కిల్స్ పై అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇది చర్మంలోని నూనె, ధూళి, మలినాలను సమర్థవంతంగా గ్రహించి, చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా ఉంచుతుంది.

multani mittiముల్తానీ మట్టి కేవలం చర్మ సౌందర్యానికి కాకుండా ఆరోగ్య సమస్యల నుండి కూడా కాపాడుతుంది. వడదెబ్బ, చర్మం దద్దుర్లు వంటి అంటూ వ్యాధుల చికిత్సలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. చర్మపు మంట మరియు పురుగు కాటు చికిత్స చేయడానికి కోల్డ్ కంప్రెషన్ లలో ఈ మట్టిని వాడుతారు. ముల్తానీ మట్టిని డైరెక్టుగా కాకుండా శాండ‌ల్ఉడ్ పౌడర్ లో కలిపి వాడితే ప్రీమెచ్యూర్ ఏజింగ్ సమస్య తగ్గుతుంది. ఇందులో కొంచెం రోజ్ వాటర్‌ను కలిపి పేస్ట్‌లా తయారు చేసుకొని ముఖానికి రాసుకోవాలి.

multani mittiఅయితే ముల్తానీ మట్టిని ముఖానికి రోజూ వాడకూడదు. అతిగా వాడ‌డం వ‌ల్ల చ‌ర్మంలోని నేచురల్ మాయిశ్చరైజర్‌ను కోల్పోయేలా చేస్తుంది. దాని వల్ల స్కిన్ పొడిబారుతుంది. దీన్ని వారానికి రెండుసార్లు క‌న్నా ఎక్కువ‌గా వాడ‌కూడ‌దు. ముల్తానీ మ‌ట్టిని ఎక్కువ‌రోజులు స్టోర్ చేసి కూడా పెట్టుకోవ‌చ్చు. అయితే దీనిని ఎయిర్‌టైట్ కంటైన‌ర్‌లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మ‌రింత మంచిది. మ‌ట్టిని కొనే ముందు అది స్వ‌చ్ఛ‌మైన‌దో కాదో చెక్ చేసుకొని తీసుకోవడం ఉత్తమం.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR