పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో తెలుసా ?

పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ఈ భూమిపై మనకు లభించే ప్రతీ పండు మనకు కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది.. వాటిలో ప్లమ్ కూడా ఒకటి..

మన దేశంలో లభించే అలూ బుఖారా పండ్లు లాంటివే ఈ ప్లమ్ పండ్లు.. అయితే వీటిలో చాలా రకాలున్నాయి. .ఇవి డ్రైఫ్రూట్స్ గానూ దొరుకుతాయి. ఎక్కువ మంది వీటిని డ్రైఫ్రూట్స్‌గానే తీసుకుంటారు. డ్రై ప్లమ్‌లను ప్రూన్స్ అని అంటారు.. రుచికి తియ్యగా, కాస్త గుజ్జుగా, ఎరుపు, బ్లూ కలర్ స్కిన్‌తో ఉంటాయి ఈ పండ్లు. వీటిలో ఖనిజాలు, పొటాషియం చాలా ఎక్కువ. యాంటీఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే. ఇవి కాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా చర్మాన్ని కాపాడతాయి. వీటిలో కేలరీలు తక్కువ. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెంచవు. అందుకే అందరూ వీటిని తింటారు. వీటితో కలిగే మరెన్నో ప్రత్యేక ప్రయోజనాల్ని గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.

Plum Fruitప్లమ్‌లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్… గుండెకు మేలు చేస్తాయి. శరీరంలోని విష వ్యర్థాల్ని తొలగిస్తాయి. గుండె సమస్యల్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి గుండెను కాపాడతాయి. ఈ రోజుల్లో చాలా మందికి మలబద్ధకం సమస్య బాగా ఉంటోంది. వారు ప్లమ్ పండ్లను తింటే… జీర్ణవ్యవస్త మెరుగవుతుంది. మూత్రనాళం బాగా పనిచేస్తుంది.

Plum Fruitsఈ ప్లమ్‌ ఎంత ఎరుపు, బ్లూ కలర్‌లో ఉంటే అంత మేలు. ఆ కలర్‌లో యాంతోసియానిన్స్ ఉంటాయి. అవి కాన్సర్ రాకుండా కాపాడతాయి. నోటి కాన్సర్, బ్రెస్ట్ కాన్సర్ రాకుండా చేస్తాయి. చిగుళ్లు పాడవకుండా కాపాడతాయి. ఈ పండ్లలోని ఐరన్… రక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. తద్వారా రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది…

Plum Fruitఈ పండ్లలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. లివర్‌లో ఉత్పత్తి అయ్యే బైల్ స్రావాలను ఈ ఫైబర్ పీల్చేస్తుంది. అప్పుడు లివర్… తనలో స్టోర్ అయిన కొలెస్ట్రాల్‌ను వాడుకుంటుంది. అలా కొలెస్ట్రాల్ తగ్గి లివర్‌కి మేలు జరుగుతుంది. చక్కటి కోమలమైన చర్మం కావాలనుకునే వారు ఈ ప్లమ్ పండ్లను తినాలి. ఇవి చర్మపు ముడతల్ని నివారిస్తాయి. చర్మ కణాల్ని వృద్ధి చేస్తాయి. యంగ్ ఏజ్‌గా కనిపించాలంటే రోజు ప్లమ్ జ్యూస్ తాగి చూడండి.. ఫలితం మీకే తెలుస్తుంది..

Plum Fruitప్లమ్‌లలో బోరాన్ ఉంటుంది. ఇది ఎముకల్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. పైగా ప్లమ్‌లో ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ఇంజ్యుర్డ్ ఎముకల్ని తిరిగి బాగుచేస్తాయి. చర్మంపై గీతలు, గాయాలు, మచ్చల్ని ప్లమ్ పోగొడతాయి. కొత్త చర్మం వచ్చేలా చేస్తాయి. చర్మం అందంగా చేయగల గుణం ప్లమ్ పండ్లకు ఉంది. ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు వంటివి ఉంటే కొన్ని రోజులు ప్లమ్ పండ్లను తిని చూడండి. ప్లమ్స్ జుట్టు పెరుగుదలకు కారణమైన ఎడ్రినల్ గ్రంధిని రిపేర్ చేయగలవు. వీటిలో ఐరన్ కూడా రక్త ప్రసరణను పెంచి… ఒత్తైన, బలమైన జుట్టు ఏర్పడేలా చేస్తుంది.

దగ్గు, జలుబు వంటి రెగ్యులర్‌గా వచ్చే అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే… ఈ ప్లమ్‌లను తింటూ ఉండాలి. దాంతో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. తద్వారా వైరస్ దాడి నుండి తప్పించుకోవచ్చు..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR