వక్కపొడిని ఎక్కువగా నములుతున్నారా? అయితే అనారోగ్యం తప్పదు

భోజనం అయ్యాక వక్కపొడి తినడం చాలా మందిలో అలవాటుగా చూస్తున్నాం. కొంతమంది ఆకు, వక్క, సున్నం కలిపి పాన్ రూపంలో తీసుకుంటారు. మ‌న పూర్వీకుల‌కు ఆకు, వ‌క్క‌, సున్నం క‌లిపి వేసుకునే అల‌వాటు ఎక్కువ‌గా ఉండేది. ఇది న‌ములుతూ ఉండ‌డం వ‌ల్ల వారికి ఆక‌లి కూడా త‌క్కువగా ఉండేది. అయితే ఇప్ప‌టి త‌రం వాటికి కొంత‌వ‌ర‌కు దూరంగా ఉన్నా వాటి రూపంలో ఉండే వ‌క్క‌పొడిని మాత్రం విప‌రీతంగా న‌ములుతున్నారు. సాధార‌ణంగా త‌మ‌ల‌పాకు న‌మిలితే ఆరోగ్యానికి మంచిది అంటారు. కానీ అదే ప‌నిగా వ‌క్క‌తోపాటు క‌లిపి న‌ములుతుంటే అది ఆరోగ్యానికి హానిక‌రంగా మార‌తుంది. శుభ‌కార్యాలు, వేడుక‌లు అలా ఎప్పుడైనా తింటే ప‌ర్వాలేదు. కానీ రెగుల‌ర్‌గా తిన‌డం మానేయాలి.

Health Defect of Betel Nutవక్కపొడిని ఎక్కువగా నమలడం వలన నోటి క్యాన్సర్ వస్తుంది. అంతేకాక ఓరల్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే సమస్య వస్తుంది. ఈ సమస్య వలన జా మూమెంట్ తగ్గిపోతుంది. వక్కపొడిని ఎక్కువగా నమలడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మెటబాలిక్ సిండ్రోమ్ కి గురయ్యి అది ఊబకాయం సమస్యకు దారితీస్తుంది. వక్కపొడిని అదే పనిగా నమలడం వలన గమ్ ఇరిటేషన్ తో పాటు టూత్ డికే వంటి దంత సమస్యలు వస్తాయి. దంతాలు శాశ్వతంగా రంగు మారే ప్రమాదమూ ఉంది. పైగా ఇది మ‌త్తుమందుతో స‌మానం అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఒకసారి దీనికి అలవాటు పడితే మానడం కష్టం అంటున్నారు.

Health Defect of Betel Nutముఖ్యంగా బాలింత‌లు, గ‌ర్భిణిలు వ‌క్క‌పొడిని అస‌లు న‌మ‌ల‌కూడ‌దు. వ‌క్క‌పొడి వ‌ల్ల త‌ల్లి, బిడ్డ ఇద్ద‌రికీ మంచిది కాదు. అంతేకాదు 18 సంవ‌త్స‌రాల వ‌య‌సులోపు వారు వ‌క్క‌పొడి తిన‌డం వ‌ల్ల వారి ర‌క్తంపై ప్ర‌భావం చూపుతుంది. వ‌క్క‌ల‌లో టానిన్ల శాతం, ఆల్క‌లాయిడ్స్ ఎక్కువ‌గా ఉంటాయి.

Health Defect of Betel Nutఇవి ఆరోగ్యాన్ని పాడు చేయ‌డ‌మే కాకుండా క్యాన్స‌ర్ బారిన ప‌డేలా చేస్తుంది. అన్నింటికీ మించి మ‌తిమ‌రుపు ఒక‌టి ప‌రిచ‌యం అవుతుంది. వ‌క్క‌పొడిని తిని ఇన్ని స‌మ‌స్య‌లు తెచ్చుకునే బదులు దానికి దూరంగా ఉండడమే మంచిది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR