Home Health డయాబెటిక్ కు చెక్ పెట్టే ఔషధం అందరిళ్లలో ఉండేదే

డయాబెటిక్ కు చెక్ పెట్టే ఔషధం అందరిళ్లలో ఉండేదే

0

డయాబెటిస్ ఒక్కటి చాలు.. మనం ప్రశాంతంగా ఇష్టమైనవి తినటానికి కూడా ఉండదు.. ప్రస్తుతం ఇది చాలామందిలో కనిపిస్తున్న వ్యాధి.. కంట్రోల్ కాకపోతే… చాలా రకాల అనారోగ్య సమస్యలొస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు తరచూ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి… ఏం తిన్నా… బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం… బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని సహజసిద్ధంగా కంట్రోల్ చేసేదై ఉండాలి. అందుకు చాలా రకాల ఆహార పదార్థాలున్నాయి. అయితే వీటిలో పసుపు చాలా కీలకమైనది. పసుపుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలకు లెక్క లేదు. చక్కటి లైఫ్‌స్టైల్‌‌తోపాటూ…. చక్కటి ఆహారం తీసుకుంటూ… పసుపును కూడా డైట్‌లో చేర్చుకుంటే… డయాబెటిస్‌పై చక్కటి ప్రభావం చూపించి… బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది.

Health Tips for Diabeticsటైప్ 2 డయాబెటిస్‌ కి ఐతే చక్కని మెడిసిన్ అనే చెప్పాలి.. మరి ఎలా కంట్రోల్ చెయ్యాలి అంటే.. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్ళు, లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. చక్కటి హెల్తీ లైఫ్‌స్టైల్‌తో… డయాబెటిస్ వల్ల ఏర్పడబోయే తీవ్రమైన పరిణామాల నుంచీ తప్పించుకోవచ్చు.

పసుపులో ఔషధ గుణాలు ఎక్కువ. 2013లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం… టర్మరిక్ లో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం… బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్‌ని తగ్గించగలదు. అలాగే డయాబెటిస్ వల్ల తలెత్తే ఇతర సమస్యల్ని కంట్రోల్ చెయ్యగలదు.


పసుపులోని కర్క్యుమా లోంగా అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి విష వ్యర్థాలు, వైరస్, బ్యాక్టీరియా అంతు చూస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మనకు చాలా నష్టాలు తెస్తాయి. కర్క్యుమిన్ మన శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తాయి. అందువల్ల రక్తనాళాల్లో కొవ్వు కరిగి… శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇది డయాబెటిస్ తగ్గేందుకు, కంట్రోల్ అయ్యేందుకూ వీలు కలిగిస్తుంది.

Exit mobile version