వేప నూనె వలన కలిగే ఆరోగ్యకరమైన ఉపయోగాలు

ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే మన ఇంట్లో ఔషధ మొక్క ఉన్నట్టే అని నమ్ముతారు గ్రామాల్లో ప్రజలు చల్లదనానికి చల్లదనం.. నీడ.. ఔషధాలను ఇచ్చే వేప నుంచి నూనెను కూడా తీయవచ్చు. ఎండలో ఎండబెట్టిన లేదా కృత్రిమంగా ఎండిన వేపగింజల నుంచి వేప నూనెను తయారుచేస్తారు. వేప నూనెలో యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలుంటాయి. వేపనూనెకి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా వేప నూనె చర్మ మరియు జుట్టు సంబంధిత వ్యాధుల నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది.

వేప నూనెచుండ్రు సమస్యకు వేప నూనె శాశ్వత పరిష్కారం అందిస్తుంది. ఉదయం, రాత్రి వేప నూనెతో మీ తలను మాయిశ్చురైజ్ చేయడం వల్ల తల మీద ఉన్న పుండ్లు తగ్గుతాయి. అదేవిధంగా, మీకు చుండ్రు సమస్య ఉంటే వేప నూనెను తరుచూ జుట్టకు అప్లై చేయడం వల్ల దానికి పరిష్కారం కనుగొనవచ్చు. అయితే ఇందుకోసం మీరు క్రమం తప్పకుండా తలకు వేప నూనెను వేయాలి. ఇది జుట్టును బలంగా మరియు మెరిసేలా చేస్తుంది. పేల నివారణకు చాలా బాగా పనిచేస్తుంది. రాత్రి తల వెంట్రుకలకు వేపనూనెను దట్టంగా పట్టించి, గాలి అందకుండగా గట్టిగా వస్త్రాన్నిచుట్టి ఉదయం వరకు ఉంచితే, తలలోని పేలు చనిపోతాయి.

వేప నూనెమలేరియాను నివారించడానికి వేప నూనెను ఉపయోగించవచ్చు. వేప నూనె మలేరియా వ్యాప్తి చేసే దోమల నుండి కాపాడుతుంది. చర్మంపై వేప నూనెను రాసుకుని నిద్రిస్తే దోమలు కుట్టవు. వేప నూనెలో ఒక క్రిమినాశక మందులా పనిచేస్తుంది. ఇందులో ఉండే క్రిమినాశక మరియు ఇతర లక్షణాల కారణంగా ఇది ఇంటిలోకి క్రిమికీటకాలను రాకుండా కాపాడుతుంది. ఒక చిన్న గిన్నెలో వేప నూనె వేసి ఉంచితే ఇంటిలోకి క్రిమికీటకాలు దరిచేరవు. నేలలో పాతి కర్ర భాగానికి, ఇంటిలోని దూలాలకు, వాసాలకు, గుమ్మాలకు వేపనూనెను రాసిన చెదపట్టదు.

వేప నూనెవేప నూనెను అనేక పురుగుమందులలో ఉపయోగిస్తారు. ప్రస్తుతం రైతులు తమ పంటలపై చీడ పీడల నివారణకు వేప నూనె ఆధారిత మందులను వాడుతున్నారు. దీనిని ప్రభుత్వం కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. దీనివలన పర్యావరణానికి ముప్పు ఉండదు. భూమి, జల వనరులు కలుషితం కావు. ఇటు వంటి మందులు వాడిన ఆహార పంటల వలన ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. నూనె తీసిన వేపచెక్క కూడా ఎరువుగా రసాయనిక ఎరువులతో కలిపి చల్లుతారు. నూనె తీసిన చెక్కలో 5.2-5.6 వరకు నత్రజని ఉంది. భాస్వరం 1.9%, పోటాషియం 1.5% ఉంది.

వేప నూనెపురాతన కాలం నుండి వివిధ రకాల ఆయుర్వేద మందులు తయారీలో వేపను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మొటిమలు, సోరియాసిస్, తామర, హెర్పెస్ మొదలైన చర్మ వ్యాధులు నయం చేయడానికి వేప నూనెను అనేక రకాల మందులలో ఉపయోగిస్తారు. వేప నూనె యొక్క ప్రయోజనాలు దురద మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందటానికి పని చేస్తాయి. వేపలో ఉండే యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు వేప నూనెలో కూడా సమృద్ధిగా ఉంటాయి.

వేప నూనెయవ్వనంలో మొటిమలు కనిపించడం సర్వసాధారణం. కానీ ఇది మీ అందాన్ని కూడా తగ్గిస్తుంది. దీనిని నివారించడానికి మీరు వేపనూనెను ఉపయోగించవచ్చు. ఇది స్వైన్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. మొటిమలను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాను తొలగించడానికి ఇది సహాయపడుతుంది. వేప బెరడు లాగా వేప నూనె కూడా దంతాల సమస్యలను తొలగిస్తుంది. దంతంలోని పిప్పళ్ళు క్రిములు నోటి దుర్వాసన పంటి నొప్పి తొలగించడంలో సహాయపడుతుంది.

వేప నూనెనోటికి సంబంధించిన అనేక సమస్యలకు వేప మంచి ఔషదం. ఒక గ్లాసు నీటిలో టీస్పూను వేపనూనె కలిపి ఆ నీటితో నోటిని బాగా పుక్కిలించినట్లయితే చిగుళ్ల నుండి రక్తం కారడం, మౌత్‌ అల్సర్‌, చిగుళ్ల నొప్పులు వంటివి పూర్తిగా నయమవుతాయి. రోజూ ఉదయాన్నే పది తాజా వేపాకులను నములుతుంటే నోటికి సంబందించిన సమస్యలు రావు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR