అతి తక్కువ ఖర్చుతో ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్!

హెల్ది డైట్ అంటే తిండి మానేయడం కాదు టైం సరిగా సరిపోయేంత ఆరోగ్యకరమైన ఆహరం తినడం. అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్ టైం కి చేయడం.. అదికూడా పోషకాలతో కూడిన ఆహరం తినడం. కొంతమంది హడావిడిలో బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. కొంతంది లంచ్ కూడా స్నాక్స్ తినే టైం కి చేస్తారు. అది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇది కాసేపు పక్కన పెడితే ఇవన్నీ సరైన సమయానికి తినేవారు కూడా రోగాల బారిన పడుతున్నారని అడగొచ్చు.

getting lateస్నాక్స్ తిన‌కుండా ఏ రోజూ పూర్తికాదు. ఎదో ఒక స్నాక్స్ తింటూ మ‌నం రోజును పూర్తి చేస్తాం. అయినా సరే ఆరోగ్య సమస్యలు వస్తున్నామని చెబుతుంటారు. నిజమే సరైన సమయానికి తినడం ఎంత ముఖ్యమో సరైన ఆహరం తినడం కూడా అంతే ముఖ్యం. అన్ని ర‌కాల స్నాక్స్ తిన‌డం వ‌ల‌న మ‌న ఆరోగ్యం చెడిపోయే అవ‌కాశం ఉంది. సమయానికి ఏది దొరికితే అది తినడం వలన ఆరోగ్యంతో ఉండడం కాదు కోరి కొత్త సమస్యలు తెచుకున్నట్టవుతుంది. మరి ఎలాంటి ఆహరం తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

స్నాక్స్ లోకి ది బెస్ట్ గా చెప్పుకునేది పండ్లు. ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తింటే అసలు డాక్టర్స్, హాస్పిటల్స్ తో పనే ఉండదు. ఒకవేళ పండ్లు అలాగే నేరుగా తినలేకపోతే రకరకాల పళ్లతో మంచి సలాడ్ చేసుకోవచ్చు. తీపిని ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. స్నాక్స్ లో పండ్లు తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మం యొక్క ఆరోగ్యాన్ని పెరిగేలా చేస్తుంది.

fruitsవేయించిన వేరు శనగలు, బెల్లం దీనిలో ఐరన్, మెగ్నీషియం,ప్రోటీన్స్, సెలీనియం, ఉంటాయి. తీపిని ఇష్టపడే వాళ్ళు సందేహం లేకుండా తినవచ్చు. లేదా వేరు శనగలతో చాలా మంది ఇష్టపడే స్నాక్ చాట్. ఇది టమోటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మ రసం తో పాటు ఉడికించిన వేరుశనగలు కలిపి చేస్తారు. కూరగాయల నుంచి లభించే ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే రుచికరమైన స్నాక్ ఇది.

groundnut with jaggeryపచ్చి మొలకలు కొంతమంది కి జీర్ణం అవ్వక పోవడం జరుగుతుంటుంది. కాబట్టి మొలకలని ఉడకబెట్టి, టమాటా,ఉల్లిపాయ,పచ్చి మిర్చి ముక్కలు కలిపి, కాస్త నిమ్మరసం వేసుకొంటే మంచి రుచికరమైన,ఆరోగ్యవంతమైన స్నాక్ మీ ముందు ఉంటుంది. ఇందులో ప్రోటీన్ , ఫైబర్ సంవృద్ధిగా లభిస్తుంది. .

sproutsఅటుకులు నూనె లేకుండా వేయించి ఉప్పు, వేరుశనగ లు ,టమాటాలు, పచ్చిమిర్చి,ఉల్లిపాయ ముక్కలు వేసి టేస్టీ స్నాక్ తయారు చేసుకోవచ్చు. దీనిలో ఫైబర్ మరియు పోషకాలు ఉంటాయి. ఐరన్ ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. మరింత ప్రయోజనం ఉండాలంటే ఎర్ర బియ్యం నుండి తయారు చేసిన అటుకులు వాడితే మరింత ఆరోగ్యం.

మరో ముఖ్యమైన స్నాక్ ఐటమ్ డ్రై ఫ్రూట్స్. మనకు ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటాయి. వీటన్నిటిని కలిపి లేదా ఇష్టమైనది ఏదైనా ఒకదాన్ని తినవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది… వాటిలో ఉండే విటమిన్లు ,ప్రోటీన్లు రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

dry fruitsవర్షాకాలంలో చాలా వరకు వేడి సమోసాలు, పకోడిలు తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వర్షంలో రోడ్డు పక్కన లభించే టీ, స్నాక్స్ తినేస్తుంటారు. దీంతో ఈ సీజన్‏లో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే బయట లభించే ఆహారాన్ని తీసుకోవడం వలన ఫుల్ పాయిజన్… ఫ్లూ, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

టీ, పకోడిలు, సమోసాలు బరువు పెరుగెందుకు సహయపడతాయి. కానీ తక్కువ కేలరీలు కలిగి..బరువు తగ్గడమే కాకుండా.. ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్ పాప్ కార్న్ ఇందులో షుగర్ ఉండడం వలన బరువు తగ్గెందుకు సహాయపడదు. కానీ ఇది వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తుంది. ఈ కాలంలో మొక్కజొన్నను తినడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి.

corn

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR