ఆలయ క్షేత్ర పాలకుని గురించి విన్నాం… కానీ గ్రామ క్షేత్ర పాలకుని గురించి తెలుసా???

సంస్కృతి సాంప్రదాయాలకు మన దేశం పుట్టినిల్లు లాంటిది. ఎన్నో పురాతన ఆలయాలకు ఆలవాలం మన భారత దేశం. ప్రతి గ్రామానికి ఒక ఆలయం ఉంటుంది. కానీ కాశీ, పూరి జగన్నాధ్ క్షేత్రం, తిరుపతి లాంటి క్షేత్రాలు చాలా ప్రసిద్ధి. ఈ విధంగా ప్రసిద్ధి చెందిన ప్రతి దేవాలయానికి కూడా తప్పనిసరిగా క్షేత్రపాలకుడు ఉంటాడు.

kshetrapalakaపురాణ కథలలో కూడా ఈ క్షేత్ర పాలకుడు గురించి ఎన్నో సార్లు వినే ఉంటాము. అసలు ఈ క్షేత్రపాలకుడు అంటే ఎవరు? అనే విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. క్షేత్రపాలకుడు అంటే ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

క్షేత్రపాలకుడు అంటే ఆలయాన్ని పరిరక్షిస్తూ, రక్షణ కల్పించే వాడని అర్థం. ఎంతో ప్రసిద్ధి చెందినదేవాలయాలకు తప్పనిసరిగా క్షేత్రపాలకుడు ఉంటాడు.

kshetrapalakaశివాలయంలో ఆగ్నేయ దిక్కున క్షేత్రపాలకుడు ఆలయం ఉంటుంది. ఆలయాన్ని దర్శించిన భక్తులు ముందుగా క్షేత్రపాలకుని దర్శనం చేసుకున్నాక స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాలి.

ఆలయంలో ఉన్న పురోహితులు పూజా కార్యక్రమాల అనంతరం తాళాలను వేసి తాళం ఆ ఆలయ క్షేత్ర పాలకునికి ఇవ్వాలి. ఉదయం క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుని స్వామివారికి అర్చన కార్యక్రమాలు, మొదలుపెడతారు. క్షేత్రపాలకుడు స్వయానా ఆ పరమేశ్వరుడు వెయ్యవా అంశంగా భావిస్తారు.

mahashivaలోక రక్షణ కోసం ప్రతి గ్రామంలో ఈశాన్యదిక్కున ప్రత్యేక ఆలయాన్ని నిర్మించి పూజించాలని ఆగమ శాస్త్ర నియమం చెబుతుంది. క్షేత్ర పాలకుడు ఈ ఆలయాలలో నల్లని శరీరం వర్ణంతో, గుండ్రటి కళ్ళు, పొడవైన కేశాలు మెడలో కపాలమాల ధరించి చేతిలో ఆయుధాలను పట్టుకొని నగ్నంగా భక్తులకు దర్శనమిస్తుంటారు.
ఈ విధంగా ప్రతి ఆలయానికి క్షేత్రపాలకుడు ఎలాగ ఉంటాడో ప్రతి గ్రామానికి రక్షకుడిగా వీరభద్రుని రూపంలో కొలువై ఉంటారని పండితులు తెలియజేస్తున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR