This Heartfelt Letter Proves Why A Show Like Big Boss Doesn’t Deserve A Person Like Gangavva

    0
    891

    నాలుగు మెతుకుల సాలవ్వ..
    నాలుగు రూపాయలు సాలవ్వ.
    నకిలీ మనుషులు వద్దవ్వ……..
    నీది కానీ ఈ నాటకంలో ….
    నువ్వు నటించకు అవ్వ…గంగవ్వ !

    బిగ్గు బాసు 4 మొదలైన కొన్ని రోజులకు
    నా మిత్రుడు నన్ను అడిగిన మొదటి ప్రశ్న….
    నా అంతటా నేను వేసుకున్న మొదటి ప్రశ్న ?

    నా స్నేహితుడు…ఏందుకు రా
    గంగవ్వకి వోట్ ఎయ్యావ్..గంగవ్వకి సపోర్ట్ చెయ్యవ్ ?

    ఒరేయ్ ఆ రోజు నా దగ్గర సమాధానం లేదు కానీ ఇప్పుడు చెప్తున్నా విను…

    పచ్చని చెట్ల మీద ఉండే కోకిలల శబ్దం…
    కొక్కొరొక్కో అని కోడి కుచే శబ్దం వినగానే…
    తెల్లారింది లేవాలి అని లేచే దానికి…

    ఒక ఆర్టిఫిసియల్ సెట్…..
    ఆర్టిఫిసియల్ మనిషుల మధ్య వచ్చే అర్ధం లేని పాట…
    ఆ పాటలకు కోతుల్లా గంతులేస్తున్న…
    మనుషుల మధ్య నిద్ర లేవడానికి తేడా లేదంటారా ?

    సరే నిద్రాది ఏముంది లే…
    కానీ పచ్చని పొలాల మధ్య వచ్చే శ్వాస పిలుస్తూ,
    ప్రకృతిని ఆస్వాదిస్తూ నిద్రించే నిద్రకు…
    ఇరికటిమైన గదుల్లో…చల్లగా వచ్చే AC లో పడుకోవడం అవ్వకి సాధ్యమా ?

    సరే నిద్ర-మేలుకోవడం అనేదేవి పక్కన పెడితే…
    తాను పండించే పొలములో నాలుగు మెతుకులు తింటూ…
    తన పొలం గట్టు మీద వెళ్ళే….
    నలుగురితో మాట్లాడనిదే పొద్దు పోనీ గంగవ్వ…

    ఒక ఆర్టిఫిసియల్ కిచెన్ లో చేసే
    రెడీ మేడ్ లేక INSTANT ప్రాసెసింగ్ ఫుడ్ పాకెట్స్
    ఆహారం తినగలదా ?
    సరే కడుపు కాల్చుకుని తినింది అనుకుందాం…?

    నిమిషానికి ఒక రంగు మార్చుకునే
    నలుగురు ఉసరవల్లి మనుషుల మధ్య
    ఇమిడిపోవడం మన గంగవ్వకి అంత సులువా ?

    అవ్వ ఓ గంగవ్వ
    ఆకలేస్తే జొన్న రోట్టె,,,రోట్లో కారం …
    దొరకని బిగ్గు బాసు ఇల్లొద్దు …
    అందులో ఉండే తేరా చాటు మనుషులు అసలొద్దు …

    తల్లి లాంటి ఊరుని వదలి ఉండడం అంటే
    అమ్మ ఆకలి అని పిలిచే పిల్లలని…. కాదని,
    నాలుగు రూపాల కోసం,…నలుగురితో పాటు
    నారాయణ అనే వేషం కట్టడం నీకు ఒద్దవ్వ !

    గంగవ్వ ఈ బిగ్గు బాసు నీకొద్దు…
    నీ ఊరు నిన్ను పిలుస్తుంది….
    నీ వాళ్ళు నీకోసం చుస్తునారు….
    పో నువ్వు నమ్ముకున్న మనుషుల దగ్గరకి….
    నీవు ఏరు…ఏస్తే పండానికే సిద్ధంగా ఉన్న పొలం
    పిలుస్తుంది పో ఆడికే పో…అవ్వ…గంగవ్వ

    నాలుగు మెతుకుల సాలవ్వ..
    నాలుగు రూపాయలు సాలవ్వ.
    నకిలీ మనుషులు వద్దవ్వ……
    నీది కానీ ఈ నాటకంలో …
    నువ్వు నటించకు అవ్వ…గంగవ్వ !

    ఇట్లు
    కళ్యాణ్ భరత్….
    తప్పులు ఉంటే క్షమించండి 🙏

    SHARE