Home Health డార్క్ సర్కిల్స్ నివారించే సులువైన చిట్కాలు మీ కోసం

డార్క్ సర్కిల్స్ నివారించే సులువైన చిట్కాలు మీ కోసం

0

అందం కోసం అమ్మాయిలు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ వాడుతారు. కానీ కొన్ని సార్లు అవేవి కూడా అంత బాగా పని చెయ్యవు. ముఖ్యంగా కళ్ల చుట్టూ ఉండే బ్లాక్ సర్కిల్స్ అందాన్ని నాశనం చేస్తుంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్ తొలగించవచ్చు. డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో టమోటా ముందుంటుంది.

డార్క్ సర్కిల్స్టొమాటోకు సహజంగా బ్లీచ్ చేసే సామర్థ్యం ఉంది. చర్మాన్ని కాంతివంతం చేయడానికి నిమ్మరసం బాగా సహాయపడుతుంది. ఇది నల్లటి వలయాల నివారణకు ఒక అద్భుతమైన హోం రెమెడీ. టమోటా రసంలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని 10 నిముషాలపాటు మర్దన చేసి తర్వాత చల్లని నీటితో కడగాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కలబంద యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది మరియు చర్మాన్ని రక్షిస్తుంది. కాబట్టి కంటి చుట్టూ ఎలాంటి నొప్పి, నల్లని వలయాలున్నా ఇవి ప్రభావవంతంగా తొలగిస్తాయి. కలబంద గుజ్జులో టమోటా రసం కలిపి ఈ పేస్ట్ ను మీ కళ్ళ చుట్టూ రాసుకుని 15 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఉత్తమ ఫలితాల కోసం వారానికి 1 నుండి 2 సార్లు చేయండి.

బంగాళాదుంపలోని ఎంజైమ్ నల్ల మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. టమోటా బ్లీచింగ్ లక్షణాలతో కలిపినప్పుడు ఇది నల్ల వలయాలను తొలగించడానికి సహాయపడుతుంది.

టొమాటో గుజ్జులో బంగాళాదుంప పేస్ట్ వేసి ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ రాసుకుని డ్రై అయ్యే వరకు ఉంచి తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా 2 రోజులకు ఒకసారి చేస్తే మీరు మంచి ఫలితాలను పొందవచ్చు.

 

Exit mobile version