ఇప్పటికి అంతుచిక్కకుండా ఒక మిస్టరీగానే మిగిలిపోయిన ఆలయాలు

0
3499

మన దేశంలో ఎన్నో అద్భుత ఆలయాలు ఉండగా కొన్ని ఆలయాలలో రహస్యాలు ఇప్పటికి అంతుచిక్కకుండా ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. ఆలా మిస్టరీగా మిగిలిన ఆ ఆలయాలు ఏంటి? ఆ ఆలయాల్లో ఉన్న అద్భుత రహస్యం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. విరూపాక్ష దేవాలయం – హంపి

Verupaksha Temple

కర్ణాటక రాష్ట్రం, బళ్లారి జిల్లాలో, హంపి లో విరూపాక్ష దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని విజయనగర రాజులూ నిర్మించారు. ఇక్కడే విఠలాలయం ఉంది. ఈ కట్టడం శిల్పకళా రీత్యా అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది. అయితే గర్భాలయాన్ని అనుకోని 6 మండపాలు ఆలయ ప్రాగణంలో విడివిడిగా ఉన్నవి. ఇక్కడే సంగీత స్థంబాల మండపంలో 56 స్థంబాలున్నాయి. ఈ స్థంబాలని మీటితే సప్తస్వరాలు సరిగమలు వినిపించడం ఒక అద్భుతం. అందుకే ఈ స్తంభాలను సరిగమ స్తంబాలు అని కూడా అంటారు. ఆ కాలంలో ఇలా రాతిలో సప్తస్వరాలు వచ్చేలా ఎలాంటి టెక్నాలజీ వాడారనేది ఇప్పటికి ఎవరికీ అంతుపట్టిని విషయం.

2. ఐరావతేశ్వర ఆలయం – తంజావూరు

Verupaksha Temple

తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, కుంభకోణానికి సుమారు 4 కి.మీ. దూరంలో ధారసూరం అనే గ్రామంలో శ్రీ ఐరావతేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ ఉన్న ఈ ఆలయాలు 11 వ శతాబ్దానికి చెందినవిగా తెలియుచున్నది. ఇక్కడ ఉన్న ఈ రెండు ఆలయాలు కూడా గొప్ప శిల్పకళా సంపదతో నిర్మించబడినాయి. ఈ రెండు ఆలయాలు ఒకటి స్వామివారిది, ఒకటి అమ్మవారిది. ఈ ఆలయంలో ఉన్న ఏడూ మెట్లు ఏడూ రకాల శబ్దాలను చేస్తాయి. అంటే సప్తస్వరాలు వినిపిస్తాయి. మరి ఈ మెట్లవెనుక నిర్మాణం ఎలాంటిది అనేది ఇప్పటికి అంతుచిక్కని ప్రశ్ననే. ఇంతటి విశేషం ఉన్న ఈ ఆలయాన్ని యునెస్కో సాంస్కృతిక పరిరక్షణ ఆలయంగా గుర్తించింది.

3. స్ట్రయిట్ లైన్ లో నిర్మించిన ఎనిమిది ఆలయాలు

Verupaksha Temple

మన భారతదేశంలో ఎలాంటి టెక్నాలజీ అనేది లేని కొన్ని వేల సంవత్సరాలకి పూర్వం నిర్మించబడ్డ కొన్ని కొన్ని శివుని ఆలయాలు ఒక స్ట్రయిట్ లైన్ నిర్మించడం అనేది ఆశ్చర్యకర విషయం. కేదార్నాథ్ నుండి మొదలుపెడితే కాళేశ్వరం లోని కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తి ఆలయం, కాంచీపురంలో ఏకాంబేశ్వర ఆలయం, తిరువనై లోని జంబుకేశ్వర ఆలయం, తిరువణ్ణా మలై లోని అన్నామలై ఆలయం, చిదంబరంలో నటరాజస్వామి ఆలయం, రామేశ్వరంలోని రామనాధ ఆలయం ఇవన్నీ కూడా ఒకే లాంగిట్యూడ్ లో నిర్మించబడ్డాయి. ఇందులో ఉన్న 5 పంచభూత ఆలయాలు యోగిక్ శాస్రం ఆధారంగా నిర్మించబడ్డాయని పురాణాలూ చెబుతున్నాయి.

మన ఇండియా మ్యాప్ లో ఈ ఆలయాలు చూస్తే అన్ని కూడా ఒక స్ట్రయిట్ లైన్ లో కనిపిస్తాయి. అయితే ఈ ఆలయాలు అన్ని కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎటువంటి పరికరాలు లేని కాలంలో నిర్మించబడ్డాయి. మరి ఈ అద్భుతం వెనుక ఎవరు ఉన్నారు? ఆ రోజుల్లో ఇలా ఒకే లైన్ వీటి నిర్మాణం ఎలా సాధ్యమైందని ఇప్పటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

4. ఖాడుమల్లేశ్వర శివాలయం – కర్ణాటక

Verupaksha Temple

ఈ ఖాడుమల్లేశ్వర శివాలయం లో నంది గుండా నీరు వస్తుండగా ఆ నీరు కింద అంతస్థులో ఉన్న శివలింగం పైన పడే అద్భుతాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ నంది నోటి నుండి నీరు ఎక్కడి నుండి వస్తుందనే ఇప్పటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంతటి విశేషం ఉన్న ఆ నందిని, శివలింగాన్ని చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

5. సుగాలి మాత – రాజస్థాన్

Verupaksha Temple

రాజస్థాన్ లోని మార్వాడ్ జిల్లాలో ఈ ఆలయం ఉంది. ఈ అమ్మవారి ఆలయంలో ఆశ్చర్యకర విషయం ఏంటంటే, గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహం యొక్క తలలు వంకరగా ఉంటాయి. అయితే వీటిని సరిచేద్దాం అని చూసిన చాలా మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ విగ్రహాలని తొలగించి అలంటి విగ్రహాలే తలలు సరిగా ఉన్న విగ్రహాలను ప్రతిష్టించినప్పటికీ ఆ తరువాత ఆ విగ్రహాల తలలు కూడా వంకరగా మారిపోయాయి. ఇలా ఇక్కడ అలా ఎందుకు అవుతుందనేది ఇప్పటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

ఇలా ఈ కొన్ని ఆలయంలో ఉన్న విశేషాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరచడమే కాకుండా వాటి వెనుక అసలు కారణం ఏంటనేది ఎవరికీ అంతుచిక్క కుండా మిస్టరీగానే మిగిలిపోయాయి