Home Unknown facts రామాయణం గురించి మీకు తెలియని నమ్మలేని కొన్ని నిజాలు

రామాయణం గురించి మీకు తెలియని నమ్మలేని కొన్ని నిజాలు

0
తేత్రాయుగంలో రామాయణం జరుగగా రామాయణ గ్రంథాన్ని వాల్మీకి మహర్షి రచించాడు. వాల్మీకి వ్రాసిన రామాయణం కాకుండ ఇంకా ఎన్నో కథలు అనేవి వెలుగులో ఉన్నాయి. ఇక దేవుడు లోక కళ్యాణం కోసం కొన్ని అవతారాలు ఎత్తాడనీ చెబుతారు. మన పురాణాల విషయానికి వస్తే, శ్రీ మహావిష్ణువు రాక్షసుడైన రావణుడిని సంహరించడానికి మానవ అవతారం ఎత్తాడనీ అదే రామావతారం అని చెబుతారు. మరి రామాయణం లో జరిగిన చాలామందికి తెలియని కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ramanayam
విష్ణు సహస్ర నామం ప్రకారం శ్రీ మహావిష్ణువుకు 1000 పేర్లు ఉండగా అందులో రామ అనే పేరు 394 వది.
బీజాక్షరాలలోని అగ్నిబీజం నుండి రా,  అమృతబీజం నుండి మ, ద్వారా రామ అనే పేరుని రఘు రాజా వంశానికి గురువైన వశిష్ఠ మహర్షి శ్రీ రాముడికి రామ అనే పేరుని పెట్టాడని చెబుతారు.
శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో రామావతారం ఏడవది. విష్ణువు యొక్క అవతారం శ్రీరాముడు కాగా లక్ష్మణుడు, భరతుడు, శత్రజ్ఞుడు శేషనాగు, చక్రం, శంఖువు అవతారాలుగా చెబుతారు.
రామాయణంలో శ్రీరాముడికి శాంత అనే సోదరి ఉంది. ఈమె దశరథునికి కౌసల్య కి పుట్టిన సంతానం అని చెబుతారు.
మిధిలా రాజ్యానికి రాజు జనకుడు. శ్రీరాముడికి జనకుడి కుమార్తె జానకితో వివాహం జరిగింది. జనకుడి తమ్ముడైన కుశధ్వజుడు కి శ్రుతకీర్తి, ఊర్మిళ, మాండవి అనే ముగ్గురు కూతుర్లు ఉండగా, లక్ష్మణుడు తో ఉర్మిళకు, భరతుడికి మాండవి తో, శత్రుఘ్నుడుకి శ్రుతకీర్తి తో వివాహం జరిగింది.
సముద్ర మార్గం గుండా లంకకి వెళ్ళడానికి శ్రీరాముడు, వానర సైన్యం రామసేతుని నిర్మించారు. అయితే నలుడు, నీలుడు, హనుమంతుడు, 10 మిలియన్ల వానర సైన్యంతో రామసేతుని కేవలం ఐదు రోజులలో నిర్మించారని చెబుతారు.
రామసేతు నిర్మించేప్పుడు ఒక ఉడుత కూడా సహాయం చేయడంతో శ్రీరాముడు ఉడత సహాయాన్ని మెచ్చుకొని తన చేతితో ఉడత పైభాగాన్ని నిమరడంతో తెల్లని చారలు ఏర్పడ్డాయని అందుకే ఉడతలకి చారలు ఉంటాయని చెబుతారు.
కొన్ని సవంత్సరాల తపస్సు మరియు అంకితభావంతో రావణుడు సూర్యోదయం మరియు సూర్యాస్తమయాన్ని నిజంగా నియంత్రించగలిగినంత శక్తి తనలో ఉందని చెబుతారు. అంతేకాకుండా తన కొడుకు మేఘనాధుడు జన్మించే సమయంలో శిశువు యొక్క అమరత్వం కోసం గ్రహాలను ఒక నిర్దిష్ట వరుసలో ఉంచాడంటా.
సీతారాములు వనవాసానికి వెళ్ళినప్పుడు వారితో పాటుగా లక్ష్మణుడు కూడా వెళ్తాడు. అయితే సీతారాములకు అనుక్షణం కాపలాగా ఉండాలని భావించి 14 సంవత్సరాలు తనకి నిద్ర పోకుండా వరాన్ని ప్రసాదించమని నిద్రాదేవిని ప్రార్ధించగా నిద్రాదేవి దానికి అంగీకరించి లక్ష్మణుడి నిద్రని అతని భార్య అయినా ఊర్మిలకి ఇస్తుంది. అందుకే రామాయణంలో ఊర్మిళ 14 సంవత్సరాలు నిద్రలోనే ఉంటుంది.
శ్రీ రాముడు సీతాదేవిని అడవిలో వదిలి రమ్మని చెప్పగా, అరణ్యంలోకి వెళ్లిన సీతాదేవి అక్కడి ప్రజలకి వైదేహిగా మాత్రమే తెలుసు.
ఒక రోజు సీతాదేవి సింధూరం పెట్టుకుంటుండగా హనుమంతుడు సింధూరం ధరించడానికి కారణం ఏంటని అడుగగా, అప్పుడు సీతాదేవి శ్రీరాముడు ఎప్పుడు సంతోషంగా ఉండటానికి అని చెప్పగా, హనుమంతుడు శ్రీరాముడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని తన ఒంటి నిండా సింధూరాన్ని పూసుకుంటాడు. అందుకే హనుమంతుడి విగ్రహం కాషాయం రంగులో ఉంటుంది.
రామాయణంలో మొత్తం 32 స్త్రీ పాత్రలు ఉన్నవి.
రావణుడు కోన ఊపిరి తో ఉన్నప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడిని రావణుడి దగ్గరికి వెళ్లి నాలుగు మంచి విషయాలను తెలుసుకోమని పంపుతాడు.
శ్రీ రాముడు అయోధ్యని 11 వేలసంవత్సరాలు పరిపాలించాడు. ఆ కాలాన్నే రామరాజ్యం అని పిలిచేవారు.
సీతారాములకు లవకుశులు, ఊర్మిలలక్ష్మణులకు అగంధ చంద్రకేతులు, మాండవిభరతులకు పుష్కరుడు, తక్షుడు, శ్రుతకీర్తిశత్రుఘ్నలకి సుబాహువు – శతృఘాతకుడు అనే వారు జన్మించారు. అయితే శ్రీరాముని సమక్షంలోనే రాజ్య విభజన జరుగగా, పశ్చిమాన లవకు లవపురం, తూర్పున కుశకు కుషావతి, తక్షణునికి తక్షశిల, అగంధునికి అంగదనగరం, చంద్రకేతునికి చంద్రావతి నగరాలను ఇవ్వడం జరిగింది.

Exit mobile version