Home Unknown facts ఈ ఆలయంలోకి ఆడవారిని నిషేధించడానికి కారణం ఏంటి?

ఈ ఆలయంలోకి ఆడవారిని నిషేధించడానికి కారణం ఏంటి?

0

ప్రపంచం మొత్తంలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు చెప్పుకునే గుడిలో ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు ఉన్నాయి. ఇక్కడ గుడి దర్శనానికి ఎలా వెళ్లాలనేది ఒక ఆచారం ఉంది. అంతేకాకుండా ఈ గుడిలోకి ఆడవారిని అసలు అనుమంతించారు. ఎందుకంటే వారిని ఇక్కడికి రాకుండా నిషేదించారు. మరి ఆలా వారు నిషేదించబడటానికి కారణం ఏంటి? అక్కడి ఆచారాలు ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

island of okinoshimaఒకినోషిమా జపాన్‌లోని ఒక దీవి అది కొన్ని వందల ఏళ్లుగా ఒకినోషిమా దీవిలోని షింటో పూజారి అక్కడి దేవతను ఆరాధించటం ఆచారంగా వస్తోంది. కేవలం పురుషులకు మాత్రమే ప్రవేశానుమతి ఉన్న దీవి అది. అయితే కొరియా ద్వీపకల్పాన్ని, చైనాను కలిపే చోట ఈ దీవి ఉంటుంది. గతంలో ఇక్కడ అధికారులు చేపట్టిన తవ్వకాల్లో ఎన్నో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు లభించాయి. ఇక్కడ మహిళలను ఆ ఛాయలకు కూడా రానివ్వరు.

ఆ పవిత్ర ప్రాంతంలో ప్రవేశించే పురుషులు  అక్కడి ఆచారాలను తుచ తప్పకుండా పాటించాల్సిందే. దీవికి వెళ్ళాలంటే ముందుగా అక్కడి సముద్రంలో నగ్నంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.  ఈ దీవికి ఇటీవలే  యునెస్కో ప్రపంచ వారస్వత గుర్తింపు కూడా లభించింది. యునెస్కో గుర్తింపుతో ఈ దీవికి విపరీతమైన ప్రచారం దక్కనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి పర్యాటకులు పెద్ద ఎత్తున వెల్లువెత్తే అవకాశం ఉంది.

దీంతో ఒకినోషిమా దీవి ప్రత్యేకత, పవిత్రత దెబ్బతింటాయని అక్కడి పూజారులు భావిస్తున్నారట. ఈ కారణం చేతనే భవిష్యత్తులో ఇక్కడికి పర్యాటకులను అనుమతించబోమని, కేవలం పూజారులనే రానిస్తామని చెబుతున్నారు. ఈ ఏడాది ఆ దీవిలో కేవలం రెండు గంటలపాటు జరిగే వేడుకకు గాను 200 మందిని మాత్రమే అక్కడి పూజారి అనుమతించారు. అయితే, ఆడవారికి ప్రవేశం నిరాకరించటంపై ఓ అధికారి స్పందిస్తూ దీనిపై తామేమీ చేయలేమని వ్యాఖ్యానించారు.

అయితే మహిళలు సముద్రంలో ప్రయాణించి అక్కడికి చేరుకోవటం చాలా ప్రమాదకరమని భావిస్తారని, శతాబ్ధాలనాటి ఆనవాయితీని అక్కడి పూజారులు మార్చుకోబోరని  అన్నారు. ఇలాంటి నిషేధాన్ని  మహిళలను రక్షించటానికే పెట్టిఉంటారని అన్నారు. ఇటీవల పోలండ్‌లో సమావేశమైన యునెస్కో హెరిటేజ్‌ కమిటీ  తాజాగా ప్రకటించిన 33 ప్రదేశాల్లో ఒకినోషిమా ఒకటి. దీంతోపాటు భారత్‌లోని అహ్మదాబాద్‌ నగరంతోపాటు మానవుడు మొదటిసారిగా స్థిరనివాసం ఏర్పరుచుకున్నట్లు గుర్తించిన దక్షిణ ఫసిఫిక్‌ దీవుల్లోని టపుటపువాటీ అనే పొలినేషియన్‌ ట్రయాంగిల్‌ కూడా ఉంది.

Exit mobile version