Hinduvulaki mathrame pravesham unna Devalayam

0
2887

శివుడు త్రిభువనేశ్వరుడిగా కొలువై ఉన్న ఈ ఆలయానికి కేవలం హిందువులకి మాత్రమే ప్రవేశం ఉంది. ఈ ఆలయంలోని ఆచారం ప్రకారం అక్కడే ఉన్న కొందమంది దేవతామూర్తులని దర్శించుకొని ఆ తరువాతే స్వామివారిని దర్శించుకోవాలని చెబుతారు. ఈ ఆలయంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మరి శివుడు కొలువై ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో గల విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.hinduvulakiఒడిశా రాష్ట్రం, పూరీ జిల్లా నుండి 60 కిలోమీటర్ల దూరంలో లింగరాజ ఆలయం ఉంది. ఈ లింగరాజ ఆలయంలో స్వామివారిని త్రిభువనేశ్వరుడు అని భక్తులు కొలుస్తారు. ఆ స్వామి వారి పేరుమీదుగానే ఈ ప్రాంతానికి త్రిభువనేశ్వరం అనే పేరు ఏర్పడి కాలక్రమేణా భువనేశ్వర్ గా పిలువబడుతుంది. ఈ ఆలయం సుమారు 40 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. hinduvulakiఇక ఈ ఆలయ విషయానికి వస్తే, స్వామివారు ఉన్న గర్భగుడి చాలా విశాలంగా ఉంటుంది. గది మధ్యలో ఎనిమిది అడుగుల వెడల్పు గల నల్లరాతి పానవట్టమూ నేలతో సమానమైన ఎత్తులోనే ఉండి, దాని మధ్యలో కేవలం తొమ్మిది అంగుళాల ఎత్తు ఉన్న శివలింగం ఉంది. ఈ శివలింగం జ్యోతిర్లింగంగా వెలుగొందుచున్నది. అయితే ఈ శివలింగం కేవలం శివుని రూపం కాదని శివుడు, విష్ణువు కలసిన హరిహర రూపం అని స్థల పురాణం చెబుతుంది. hinduvulakiఅయితే ఆలయ ప్రవేశ ద్వారానికి అనుకోని ఉన్న గణనాథుడు, స్కందుడు, గోశాలిని దేవి, నందివిగ్రహం ముందుగా దర్శించుకొని ఆ తరువాతే స్వామివారిని దర్శనం చేసుకోవడం పూర్వం నుండి ఒక సంప్రదాయంగా వస్తుంది. ఇక ఈ ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి ఆలయానికి ఎడమవైపు భాగాన అమ్మవారి ఆలయం ఉంది. ఈ అమ్మవారిని భగవతి అనే పేరుతో భక్తులు కొలుస్తారు. hinduvulakiఇలా ఇక్కడ శివుడు, విష్ణువు కలసి హరిహర రూపంలో దర్శనం ఇచ్చే ఆ ఆలయానికి ఎప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.5 hindhuvulaki matrame pravesham unna devalayam