కాశీలో శవాలను దహనం చేసే ముఖ్యమైన ఘాట్స్ చరిత్ర!

0
1540

కాశ్యాంతు మరణాన్ముక్తి అను ఆర్యోక్తి ఉంది. కాశీలో మరణిస్తే ముక్తి తప్పక లభిస్తుంది అని దీని అర్ధం. ఎటు చూసినా అయిదు క్రోసులున్న ఈ పట్టణంలో, ఏజీవి మరణించినా ఆ సమయంలో కుడిచెవి పైకి ఉంటుంది. ఈశ్వరుడు తారక మంత్రోపదేశము చేసి మోక్షము ప్రసాదిస్తాడు. ప్రళయం వచ్చే సమయంలో కూడా, వారణాశికి నాశనము లేదట. ప్రళయకాలములో కూడా వారణాశి మునిగిపోకుండా త్రిశూలముతో గ్రుచ్చి ఎత్తి ఉంచుతాను అని శివుడు చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. చుట్టుపక్కల ఎక్కడ మరణించినా కాశి ఘాట్స్ లోనే కాల్చుతారు, ఆ బూడిద తోనే రోజు శివుడికి అభిషేకం చేస్తారు. కాశీలో శవాలను దహనం చేసే ముఖ్యమైన గంగా నది ,ఘాట్స్ గురించి చూద్దాం.

Kashi Ghatsముఖ్యంగా “గంగకు” దశహరా అని ఓ పేరు ప్రాచుర్యంలో ఉన్నది అంటే పదిరకాల దోషాలను పరిహరించేది అని అర్ధం. సకల పాప నివారిణి, గంగానది స్నానం ఏడేడు జన్మల పాపాలను పోగొట్టే శక్తి కలది. ఇక ఇక్కడి ఘట్టాల విషయానికి వస్తే. కాశి గంగానదీ తీరంలో 64 స్నాన ఘట్టాలు ఉన్నాయి, అన్నింటికంటే ప్రాముఖ్యమైనది మణికర్ణికాఘట్టము.

మణి కర్ణికా ఘట్టము :

Kashi Ghatsయాత్రీకులు ఈ ఘాట్ లో స్నానం చేసి, విశ్వేశ్వరుని దర్శించుతారు. ఈ ఘాట్ లో ఎల్లప్పుడూ శవ దహనాలు జరుగుతూనే ఉంటాయి. పూర్వం మహావిష్ణవు ఇక్కడ తన చక్రముతో ఒక తీర్థాన్ని త్రవ్వి, దాని తీరంలో శ్రీ విశ్వనాధుని గురించి తపస్సు చేసాడు. శ్రీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై, ఆ తీర్థాన్ని చూసి విఘ్ణ దేవుని తపమును మెచ్చుకొని అక్కడ విశ్వేశ్వరునిగా వెలిసాడు. ప్రత్యేక్షమైన సమయంలో శివుని కుడిచెవికి ఉండే, మణికుండలం జారీ , తీర్థంలో పడింది. కాబట్టి అది చక్రతీర్థం అనే పేరును సంతరించుకుంది. తరువాత కొంత కాలానికి, ఈ చక్రతీర్ధము మీదుగా గంగానది ప్రవహించింది.

హరిశ్చంద్ర ఘట్టము :

Kashi Ghatsపూర్వము హరిశ్చంద్ర మహారాజు వీరబాహువునికి , సేవకుడై ఇక్కడే కాటికాపరిగా పని చేసాడు. కాని ఇక్కడ మణికర్ణికా ఘాట్ లాగా శవదహన కార్యక్రమాలు అంతగా జరగటం లేదు.