కైలాసం నుండి శివపార్వతులు వెంకన్నస్వామి వివాహాన్ని చూడటం కోసం వచ్చిన పుణ్యస్థలం

0
2169

తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. ఈ స్వామిని ఏడుకొండలవాడని, గోవింధుడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, వెంకటరమణుడని, మలయప్ప అని ఇలా ఎన్నో పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే శ్రీవేంకటేశ్వస్వామి వివాహాన్ని చూడటం కోసం శివపార్వతులు కైలాసం నుండి ఈ ప్రాంతానికి వచ్చారని స్థల పురాణం. మరి ఆ పుణ్యస్థలం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

kailsa konaఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలో కైలాస కోన అని పిలువబడే ఒక పర్వత భాగంలో జలపాత ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం ఉండగా శివలింగానికి ఎదురుగా ఒక నంది విగ్రహం ఉంది. అయితే నారాయణవనం అనే గ్రామంలో పద్మావతి వేంకటేశ్వరస్వామి వారి వివాహాన్ని చూడటానికి వచ్చిన శివపార్వతులు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి ప్రకృతి రమణీయతలకి ముగ్దులై ఇక్కడే కొంతకాలం నివసించారని అందుకే ఈ కొనకు కైలాస కోన అనే పేరు వచ్చినదని స్థలపురాణం.

kailsa konaఇక శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వివాహ విషయానికి వస్తే, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఆకాశరాజు పాలించేవాడు. ఈ ఆలయం ఆయనే కట్టించారని స్థల పురాణం చెబుతుంది. శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర రూపంతో వేంకటాద్రి మీద వెలిసాడు. ఇక లక్ష్మీదేవి పద్మావతి రూపంతో ఆకాశరాజు దంపతులకి పుత్రికగా జన్మించింది. ఆ తరువాత యుక్త వయసుకి వచ్చిన పద్మావతీదేవి వేంకటేశ్వరుని తప్ప ఎవరిని వివాహం చేసుకోనని తనకు ఆ స్వామితోనే వివాహం జరిపించమని తన తండ్రిని కోరింది. అప్పడు కుమార్తె కోరికను మన్నించిన ఆకాశరాజు శ్రీ వెంకటేశ్వర, పద్మావతిల కళ్యాణం ఈ ప్రదేశంలోనే అతి వైభవంగా జరిపించాడని ఆ కల్యాణానికి ముక్కోటి దేవతలు, యక్షులు, కిన్నెరలు, గంధర్వులు వచ్చి తిలకించారని ప్రసిద్ధి.

kailsa konaఇక్కడి నారాయణవనంలో శ్రీ కల్యాణ వెంకటేశ్వరాలయం ఉన్నది. అతి ప్రాచీనమైన ఈ ఆలయం అరుణానది తీరంలో ఉంది. ఈ ఆలయం నందు గర్భగుడిలో కల్యాణ వేంకటేశ్వరుడు పక్కనే మరొక చిన్న గుడిలో పద్మావతి అమ్మవారు దర్శనం ఇస్తారు. పద్మావతి అమ్మవారి ముందు పెద్ద తిరుగలి రాయి కలదు. ఆ తిరుగలితో ఆమె పెండ్లి రోజున బియ్యము విసిరినారని చెబుతారు.

kailsa konaఇక కైలాసకోన ఆలయ విషయానికి వస్తే, ఈ పర్వత ప్రదేశంలో ఉన్నదీ కనుక ఇక్కడ ప్రతి రోజు అర్చనలు అనేవి జరుగవు.

SHARE