Home Health ముఖం మీద నల్ల మచ్చలు మాయం చేసే సులభమైన చిట్కాలు!

ముఖం మీద నల్ల మచ్చలు మాయం చేసే సులభమైన చిట్కాలు!

0

మనలో ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య నల్ల మచ్చలు. కొంతమందిలో ఇవి మరీ ఎక్కువగా కూడ ఉంటాయి.. అయితే వీటిని తొలగించేందుకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అవసరం లేదు. కొన్ని చిట్కాలతో ఇంటి వద్దే ఈ మచ్చలను మటుమాయం చేయొచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఇపుడు చూద్దాం..

Black Spotsవయస్సు పెరిగే కొద్ది చర్మ సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ముఖం మీద ముడతలు, మచ్చలు అందాన్ని తగ్గిస్తాయి. దీంతో చాలామంది ఆవేదనకు గురవ్వుతారు. ఈ మచ్చలు ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే, వీటి గురించి మీరు పెద్దగా ఆందోళన చెందక్కర్లేదు. చిన్ని చిన్ని చిట్కాలతో చాలా తక్కువ సమయంలో ఈ నల్ల మచ్చలను మాయం చేసుకోవచ్చు.

కలబంద నల్లమచ్చలు తొలగించటంలో బాగా ఉపయోగపడ్తుంది.. మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే రోజూ ఈ చిట్కా పాటించవచ్చు. కలబంద మధ్యలో జెల్‌లా ఉండే తాజా జిగురును ముఖానికి రాసుకుని మర్దన చేసి కాసేపు ఆరనివ్వండి. ఇలా రోజూ చేస్తే ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా ముఖం మీద మచ్చలు కూడా క్రమంగా మాయమవుతాయి.

అలాగే గుడ్డు కూడా.. గుడ్డులోని పసుపు పచ్చ సొనను పక్కకు తీసి కేవలం తెలుపును మాత్రమే ముఖానికి రాయండి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయండి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే నల్ల మచ్చలనేవే కనిపించవు.

విటమిన్-సి, యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే టమోటా మీ ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. అలాగే, ముఖంపై ముండే నల్ల మచ్చలను మాయం చేస్తుంది. వారంలో కనీసం రెండు సార్లు టమోటాలో మర్దన చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇక నిమ్మ రసం కూడా నల్లమచ్చలపై ప్రభావాన్ని చూపిస్తుంది..

నిమ్మకాయలో కూడా విటమిన్-సి ఉంటుంది. ఇది చర్మం మీద ఉండే నల్ల మచ్చలను సులభంగా తొలగిస్తుంది. ఎక్కడైతే నల్ల మచ్చలు ఉంటాయో అక్కడ నిమ్మకాయ రసం లేదా నిమ్మ బద్దలతో మర్దన చేయాలి. రోజూ ఇలా చేస్తే త్వరగానే ఫలితం కనిపిస్తుంది.

Exit mobile version