పులిపిర్లు రకాలు ఏంటి ? పులిపిర్లు పోగెట్టే ఇంటి చిట్కాలు ఏంటో తెలుసా ?

పులిపిర్లు.. వీటిని ఉలిపిరి కాయలని కూడా అంటారు, ఇంగ్లీష్‌లో వీటిని వార్ట్స్ అంటారు. హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల ఈ పులిపిరులు ఏర్పడతాయి. పులిపిరి కాయల సమస్య ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఇవి ఎక్కువగా ముఖం, మెడ, చేతులు, పాదాలపై వస్తుంటాయి. చర్మంలో కలిసిపోయే కొన్ని పులిపిర్లు పెద్దగా నొప్పిరావు. కానీ, కొన్ని దురద పుడుతుంటాయి. ఈ పులిపిర్లలో రకాలు కూడా ఉంటాయి.. చేతి వేళ్ల చుట్టూ వచ్చే పులిపిర్లను కామన్ వార్ట్స్ అని అంటారు. అలాగే పాదాలపై వచ్చే పులిపిర్లను ప్లాంటార్ వార్ట్స్ అంటారు. ఇక ముఖం, మెడ మీద వచ్చే పులిపిర్లను ఫ్లాట్ వార్ట్స్ అని అంటారు. కొంతమందికి జననాంగాలపై కూడా ఇవి ఏర్పడతాయి. వాటిని జనైటల్ వార్ట్స్ అని పిలుస్తారు.

Pulipirluవైరల్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడేవారిలో..రోగనిరోధక శక్తి లోపించినప్పుడు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు, కొన్ని రకాల వైరస్‌లు శరీరంపై దాడి చేస్తాయి. ఈ నేపథ్యంలో కొందరికి పులిపిర్లు ఏర్పడతాయి. పులిపిర్లను కత్తిరించటం, కాల్చటం వంటివి చేయకూడదు. ఇవి ఎక్కువగా రాపిడిగా ఉండే ప్రాంతాల్లోనే ఏర్పడతాయి. సాధ్యమైనంత వరకు ఇంటి చిట్కాలతో వీటిని తొలగించుకోవచ్చు.. సమస్య మరీ ఎక్కువ అనిపిస్తే వైద్యులను సంప్రదించి వీటిని మటుమాయం చేయొచ్చు. మరి ఈ లాక్ డౌన్ సమయంలో ఎలాగూ ఇంట్లోనే ఉంటాం కాబట్టి పులిపిర్లు తగ్గించే కొన్ని ఇంటి చిట్కాలేంటో ఇపుడు తెల్సుకుందాం..

Pulipirluఅందరి ఇళ్లలో ఉండకపోయినా మనకి ఈజీ గ దొరికే యాపిల్ సిడర్ వెనిగర్ తో పులిపిర్లకి చెక్ పెట్టొచ్చు.. దీనిలో అధిక యాసిడ్ కంటెంట్ ఉంటుంది. దీనివల్ల పులిపిర్లు మరింత పెరగకుండా సహజ సిద్ధంగా తగ్గిపోతాయి. దూదిని యాపిల్ సిడర్ వెనిగర్‌లో ముంచి పులిపుర్లు ఉన్నచోట అద్దితే చాలు. వారంలో కనీసం ఐదు రోజులు ఇలా చేస్తే పులిపిర్లు పూర్తిగా మాయమవుతాయి.

Pulipirluఇక అందరికి అందుబాటులో ఉండే కలబంద తో కూడా పులిపిర్లు పోగొట్టుకోవచ్చు.. కలబందలో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఇందుకు మీరు కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురును తీసుకుని పులిపిర్లపై రాస్తే చాలు.

Kalabandhaనెక్స్ట్.. బేకింగ్ పౌడర్… ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపండి. దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయండి. అలా రాత్రంతా వదిలిపెట్టండి. ఇలా రెండు నుంచి మూడు రోజులు చేసినట్లయితే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి. అరటి పండు తొక్కతో పులిపిర్లని తీసేయొచ్చు.. అరటి పండు తొక్కలో ఉండే ఎంజైమ్‌లు చర్మానికి మేలు చేస్తాయి. అరటి పండు తొక్కతో రోజు పులిపిర్లపై రుద్దితే అది క్రమేనా కనుమరుగు అవుతుంది.

Pulipirluఇక వెల్లులి.. సాధారణంగానే చాలా ఔషధ గుణాలుంటాయి దీంట్లో.. చర్మ వ్యాధుల నివారణకు ఈ వెల్లులి మంచి ఔషదం. ఇందులో ఉండే ఎల్లిసిన్.. ఫంగస్, వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. అలాగే పులిపిర్లను తొలగించడంలోనూ ఇది అత్యుత్తమంగా పనిచేస్తుంది. ఇందుకు మీరు వెల్లులి ముద్దగా చేసుకుని పులిపిర్లు ఉన్నచోట రాస్తే చాలు. ఇలా కొన్ని రోజులు క్రమం తప్పక చేస్తే పులిపిర్లు రాలిపోతాయి..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR