Home Health బోదకాల వ్యాధి నుండి ఉపశమనం ఇచ్చే ఇంటి చిట్కాలు!

బోదకాల వ్యాధి నుండి ఉపశమనం ఇచ్చే ఇంటి చిట్కాలు!

0

బోదకాలు సమస్య క్యూలెక్స్‌ రకం దోమ కుట్టటం వల్ల వస్తుంది.ఈ వ్యాధి ఫైలేరియా అనే సూక్ష్మక్రిమి ద్వారా సంక్రమిస్తుంది. ఇంటి పరిసరాల్లో ఉన్న మురుగునీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందే క్యూలెక్స్‌ దోమ ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలోని ‘మైక్రోఫైలేరియా’ క్రిములు మన శరీరంలో ప్రవేశించి మన లింఫ్‌ నాళాల్లో పెరిగి పెద్దవవుతాయి. అవి లింఫ్‌ గ్రంథుల్లో చేరి ఉండిపోతాయి. ఇవి అక్కడ పెద్దగా పెరగడం వల్లే మనకి బోదకాలు వస్తుంది.

బోదకాలువీటి నుంచి వచ్చే కొన్ని విషతుల్యాలు వల్ల లింఫు నాళాల్లో వాపు వస్తుంది. అలాగే ఈ క్రిములు చనిపోయి లింఫు నాళాల్లో అవరోధంగా మారటం వల్ల వీటికి బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా తోడవటం వల్ల కాలు వాపు, జ్వరం, గజ్జల్లో బిళ్లల వంటి బాధలు మొదలవుతాయి. వాపుల వలన సాధారణమైన పనులు చేసుకోలేకపోవడం, అంగవైకల్యం, శారీరక, మానసిక వ్యధ యీ వ్యాధి వలన కలిగే దుష్పరిణామాలు.

ఫైలేరియా వ్యాధి లక్షణాలు : 1. శరీరంలో ఫైలేరియా క్రిములు ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు కనబడడానికి 8 నుండి 16 నెలలు పట్టవచ్చు. 2. తొలిదశలో కొద్దిపాటి జ్వరం, ఆయాసం రావడం, తలనొప్పి వణుకు, 3. శోషనాళాలు పాడైపోయి, లింఫ్‌ ప్రసరణ ఆగిపోయి కాళ్లు, చేతులు వాయడం, 4. వాచిన చోట నొక్కితే సొట్ట పడడం, 5. చర్మంపై మచ్చలు, పుండ్లు, కాయలు, దురద పెట్టడం, రసి కారడం, 6. వరి బీజము (బుడ్డ) మర్మావయాలు పాడవడం, 7. గజ్జల్లో, చంకల్లో బిళ్లలు కట్టడం మొదలైనవి.

అయితే మనదేశంలో కొన్ని వేల ఏళ్ల క్రితం నుంచి ఉన్న వైద్యం ఆయుర్వేదం.. ఇందులో చికిత్సగా సహజంగా లభ్యమయ్యే ప్రకృతి ప్రసాదిత వస్తువులనే చికిత్స కోసం ఉపయోగిస్తారు. అల్లోపతిలో నయం కానీ వ్యాధులకు కూడా ఆయుర్వేదంలో చికిత్స ఉంది అని నిపుణులు చెబుతున్నారు. అల్లోపతిలో నయం కానీ వ్యాధుల్లో ఒకటి బోద కాలి వ్యాధి.

ప్రారంభదశలోనే వ్యాధి తెలుసుకుంటే నయం చేయడం ఈజీనే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. ఆయుర్వేదంలో మహా సుదర్శన చూర్ణం,నిత్యానంద రసం,శీతాన్శురసం,శ్లీపదారి లోహం , పునర్నవ మండూరము, లోహాసవము వంటి మందులు బోదవ్యాధిని అరికడతాయి. ఇంట్లో కూడా చిన్న చిన్న చిట్కాలతో వ్యాధి బాధనుంచి ఉపశమనం పొందవచ్చు.

  • జిల్లేడు మొక్క వేళ్ళు కాని, పత్తి చెట్టు వేళ్ళను కాని శుభ్రం చేసి, గంజితో కలిపి మెత్తంగా నూరి బోద వచ్చిన చోట లేపనం చేస్తుంటే వాపు తగ్గిపోతుంది.

  • బొప్పాయి ఆకులను నూరి, రసాన్ని పల్చగా బోద వచ్చిన చోట పులిమి, అరగంట తర్వాత కడిగేసుకుంటే వాపు క్రమంగా తగ్గుతుంది.
  •  చెట్టు బెరడు, ఆవాలు, శొంఠి సమపాళ్ళలో నూరి వాపు మీద రాస్తుంటే తగ్గుముఖం పడుతుంది.
  • వాపు ఉన్న ప్లేస్ లో రోజూ కాపడం పెడుతూ.. ప్రతిపూటా అల్లపు రసం తాగితే క్రమంగా బోద వాపు తగ్గుతుంది.

నివారణ:

ఈ వ్యాధి మానవుని మరణానికి దారి తీయక పోయినప్పటికీ, దీని వలన కలిగే దుష్పరిణామాలు మాత్రం చాలా తీవ్రమైనవి. వ్యాధి సంక్రమణను సరిగా అంచనా వేయడం, ప్రాథమిక దశలో గుర్తించడం కష్ట సాధ్యం. ఈ వ్యాధి సోకిన వారి వ్యాధినిరోధక శక్తి లోపించి యితర వ్యాధులకు గురి కావడానికి అవకాశం ఎక్కువ అవుతాయి. ఈ వ్యాధి నుంచి పూర్తి విముక్తి మార్గం లేదు. రాకుండా చూసుకోవడమే ఉత్తమం.

బోదకాలుకాబట్టి ఏడాదికోసారి ఫైలేరియా నివారణ మందులు మింగాలి. వ్యాధికారక దోమలను అరికట్టాలి. బోధకాలు వ్యాధికి విధిగా చికిత్స చేయించుకోవాలి. సంక్రమితుల్లో మానవ మలేరియా పరాన్నజీవి సూక్ష్మ దశలో ఉన్నపుడు రక్త వ్యవస్థలో మైక్రో ఫైలేరియాలను ఉత్పత్తి చేస్తుంది. మానవుల రక్తాన్ని సేకరించిన దోమలో మైక్రో ఫైలేరియా ఉండిపోతుంది. సంక్రమిత మైక్రో ఫైలేరియా 12 రోజుల్లో పెరిగి పెద్దదై మరొకరికి వ్యాపింపజేసే దశకు చేరుకుంటుంది. సంక్రమిత లార్వా దశలో ఉన్న దోమ మరొకరిని కుట్టినప్పుడు చర్మం మీద పరాన్నజీవులు ఉండిపోతాయి. కుట్టిన మార్గం ద్వారా లోనికి ప్రవేశించి లింఫ్‌ వ్యవస్థలోకి వెళ్లి స్థిరపడతాయి.

Exit mobile version