తలనొప్పిని చిటికెలో మాయం చేసే ఇంటి చిట్కాలు

అనేక కారణాలతో తలనొప్పి వేధిస్తుంటుంది. ఈ సమస్య మొదలు కాగానే మిగతా పనిపై దృష్టి సారించలేం. కాబట్టి వెంటనే మెడికల్ షాపుకి వెళ్లి ఏదో ఓ ట్యాబ్లెట్ తెచ్చి వేసుకుంటాం.

ఒక్క రోజు సరిగా నిద్రలేకపోయినా, పని ఒత్తిడి పెరిగినా.. ఇలా కారణం ఏదైనా ముందు వచ్చేది తలనొప్పే. కొందరికైతే.. వారు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా రెగ్యులర్ గా ఈ తలనొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి తగ్గించేందుకు పెయిన్ కిల్లర్ వేసుకోక తప్పదు. కానీ ఈ పెయిన్ కిల్లర్స్ ఎంత వరకు సురక్షితం. రెగ్యులర్‌గా ఇలానే తలనొప్పి వేధిస్తుంటే మందులపై ఆధారపడకుండా ఇంట్లోనే తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి..

Home Remedies For Headachesబాగా తలనొప్పిగా ఉన్నప్పుడు జీడిపప్పు, పిస్తా, బాదంపప్పులను తింటే వెంటనే తలనొప్పి తగ్గుతుంది. ఇవి పెయిన్ కిల్లర్స్‌గా పనిచేస్తాయి.

Home Remedies For Headachesతలనొప్పి బాగా ఉంటే బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలిని కొంత సేపు పీల్చుకోండి. కొద్ది సేపు వాకింగ్ చేయండి. వెంటనే నొప్పి తగ్గుతుంది.

ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీస్పూన్ అల్లం రసం కలుపుకుని తాగినా తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.

Home Remedies For Headaches

కొన్ని సార్లు మన శరీరంలో నీరు తక్కువైనా తలనొప్పి వస్తుంది. కనుక నీటిని బాగా తాగాలి. దీంతో తలనొప్పి తగ్గుతుంది.

ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Home Remedies For Headaches

  • కొద్దిగా రాతి ఉప్పును చేర్చిన పాలను తీసుకోవడం ద్వారా తలనొప్పి మాయం అవుతుంది.
  • ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రభావం తొందరగా ఉంటుంది.
  • యూకలిప్టస్‌ తైలం తలనొప్పి నివారిణిగా బాగా పని చేస్తుంది.
  • గోరువెచ్చని ఆవుపాలు తాగినా త‌ల‌నొప్పి నుంచి రిలాక్స్‌ అవ్వొచ్చు.

Home Remedies For Headachesచందనాన్ని పేస్ట్‌లా చేసుకుని నుదుటికి అప్లయ్‌ చేసినా మంచి గుణం కనిపిస్తుంది. కొబ్బరి నూనె వేడిని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెను నుదుటిపై 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్‌ చేసి చూడండి. తలనొప్పి త‌గ్గుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR