వంటింట్లో ఉండే ఈ ఔషదాలు వలన కలిగే ఉపయోగాలు తెలుసా ?

కరోనా కాలంలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ రకాల ఆహార పదార్థాలు, ఫ్రూట్స్, కషాయాలు, మందులు వాడుతున్నారు. కానీ, మన వంట గదిలోనే ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు ఉన్నాయని మాత్రం గ్రహించలేకపోతున్నారు. వీటిని మనం రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుంది. వీటి ద్వారా శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.

కరోనానిజానికి ప్రతి ఇంట్లో తయారుచేసే వంటకాలలో అల్లం ను రుచికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ అల్లం ఒక దివ్య ఔషధం లాంటిది. ఖరీదైన మందులు కొనుక్కొని ఉపయోగించినా అల్లం చేసే మేలు అవి కూడా చేయలేవు. అల్లం నిండా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. మనకు వేడి చేస్తే  మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని అర్థం. ఆ వేడి లేకుండా, రాకుండా అల్లం చేయగలదు. ముఖ్యంగా ఊపిరి తిత్తుల సమస్యలతో బాధపడేవారు శ్వాస సమస్యలతో బాధపడేవారు పచ్చి అల్లం రసం తాగితే మంచిదే. పోనీ ఏ టీలోనో అల్లం వేసుకొని తాగినా మంచిదే. గుర్తుంచుకోండి అల్లం ఎంత తాజాగా ఉంటే అంత ఎక్కువ మేలు చేస్తుంది. ముందుగా ఉదయం లేచిన వెంటనే పడి కడుపున అల్లం రసం తాగితే బాడీలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

కరోనా

  • అల్లం రసంలో లో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకున్న గాని ఉపయోగం ఉంటుంది.
  • అల్లం రసంలో తేనె పసుపు నిమ్మరసం కలిపి తీసుకుంటే కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది.
  • అల్లం రసం ఇష్టంలేని వారు రెండు పూటలా చిన్న అల్లం ముక్కను నోట్లో దవడ కిందపెట్టి కొంచెంకొంచెంగా అల్లం రసం తీసుకోవచ్చు.
  • ఇక అల్లం రసాన్ని వేడి నీటితో తీసుకుంటే చాలా మంచిది.
  • అల్లం క్రమంగా వాడడం వల్ల మన బాడీ లో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

కరోనా

  • అల్లం రసంలో ఎక్కువ శాతంలో విటమిన్ సి, మెగ్నీషియం ఇలా శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
  • కేవలం ఇమ్యూనిటీపవర్ అనిపించడమే కాకుండా కీళ్ల నొప్పులు ఇతర నొప్పులతో బాధపడుతున్న వారు కూడా అల్లం రసాన్ని ప్రతిరోజు సేవించడం వల్ల వాటి నుండి ఉపశమనం దొరుకుతుంది.
  • ఇక బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు అయితే అల్లం రసం ఒక వజ్రాయుధం లా పనిచేస్తుంది.
  • ప్రతిరోజు కొంత మొత్తంలో అల్లం రసాన్ని సేవిస్తే షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అంతేకాకుండా
  • అజీర్తి తో బాధపడుతున్న వారు కూడా అల్లం రసాన్ని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.

కరోనాఇక మనకు సర్వసాధారణంగా వచ్చే దగ్గు జలుబు వీటి నుండి మనం బయట పడాలంటే మనకు అందుబాటులో ఉన్న ఏకైక ట్రీట్మెంట్ అల్లం రసం. అల్లం రసాన్ని కొద్ది మోతాదులో సేవిస్తే ఈ రెండింటి నుండి మనం బయట పడవచ్చు.

అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే మీరు అల్లం రసాన్ని వాడేటప్పుడు అల్లం పై ఉన్న పొట్టు ని తొలగించి వాడడం ఉత్తమం.

వెల్లుల్లి :

కరోనాకాల్షియం, పొటాషియం, సల్ఫ్యూరిక్ కాంపౌండ్‌లతో వ్యాధి నిరోధక శక్తిని భారీగా పెంచడంలో వెల్లుల్లి పీహెచ్‌డీ చేసినట్లు లెక్క. బాడీలో క్రిములతో పోరాడే తెల్ల రక్త కణాలను వెల్లుల్ని పెంచుతుంది. వెల్లుల్లిని పచ్చిది తింటే మంచిది. ఎందుకంటే వేడి చేస్తే అందులోని సల్ఫర్ ఎంజైములు పోతాయి. మన పెద్దోళ్లు పచ్చళ్లలో వెల్లుల్లి రెబ్బలు వేసేది ఇందుకే. పచ్చి వెల్లుల్లి తినలేమని అనుకుంటే ఓ నాలుగు రెబ్బల్ని పచ్చడి చేసి ఏ నీటిలోనో కలుపుకొని గటగటా తాగేయండి. ఆ తర్వాత నోట్లో ఏ చక్కెరో కొద్దిగా వేసుకుంటే నోరు చేదుగా ఉండకుండా ఉంటుంది. జలుబు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది.

ఉల్లిపాయలు :

కరోనాఉల్లి ధర పెరిగినప్పుడు ఆందోళనలు చెయ్యడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే అందరూ ఉల్లిని వాడాలి. ఉల్లిలో విటమిన్ C, సల్ఫర్, జింక్, సెలెనియం, క్వెర్సెటిన్ ఉంటాయి. ఇవి మన వ్యాధినిరోధక శక్తిని అలా పెంచేస్తాయి. ముఖ్యంగా క్వెర్సెటిన్ అనేది నిండా యాంటీవైరల్ గుణాలతో ఉంటుంది. సెలెనియం కూడా అంతే. వైరస్‌ల వల్ల అలెర్జీలు రాకుండా చేస్తుంది. కాబట్టి తినే తినే ప్రతీ వంటలో ఉల్లి ఉండేలా చేసుకోండి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR