పంటి నొప్పిని పోగ్గోటే వంటింటి చిట్కాలు

శరీరంలో చిన్న భాగమే అయినా… పంటి నొప్పి పూర్తి శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. పంటి నొప్పి వచ్చినప్పుడు సరిగా ఆహారం కూడా తినలేరు. తగినంత పోషకాహారాన్ని అందించే ఆహారం లేనప్పుడు శరీరం త్వరగా అలసిపోతుంది. అంతేనా, పంటి నొప్పి నయం అయ్యేవరకు మనం ఏ పని జాగ్రత్తగా చేయలేము. ధ్యాస మొత్తం దాని మీదే ఉంటుంది. అయితే తీవ్రమైన పంటి నొప్పి వచ్చినప్పుడు మనం మొదట వైద్య సహాయం తీసుకుంటాము. కానీ మన పూర్వీకులు, ప్రతి సమస్యను పరిష్కరించడానికి మనకు అమూల్యమైన ఆయుర్వేద విద్యను అందించారు. మరి పంటి నొప్పిని మాత్రం ఎందుకు వదిలివేస్తారా?

home remedies for toothacheమన పూర్వీకులు పంటి నొప్పికి చాలా సాధారణ వంటింటి నివారణలను సూచించారు. పురాతన కాలం నుండి ఇప్పటి వరకు కూడా లవంగాన్ని పంటి నొప్పికి అద్భుతమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అందులోనూ లవంగం నూనె సమ్మేళనం సహజ ఔషధం. అయితే దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లవంగం నూనెను నొప్పి ఉన్న ప్రాంతంపై పూసినప్పుడు లేదా అది చిగుళ్ళు, నాలుకకు తలిగినపుడు నొప్పి మరింత తీవ్రమవుతుంది. అందుకే ఒక పత్తి ఉండపై రెండు చుక్కల లవంగా నూనె పోసి, బాధాకరమైన పంటిపై జాగ్రత్తగా పూయాలి. నొప్పి తగ్గే వరకు దూది ఉండను అక్కడే ఉంచండి.

home remedies for toothacheఒకవేళ లవంగం నూనె అందుబాటులో లేనట్లయితే లవంగం పొడి లేదా ఒకటి రెండు లవంగాలు నొప్పి ఉన్న పంటి పై వేసి రసాయనాన్ని విడుదల చేయడానికి లవంగాలను కొరకడం లేదా పంటితో అదిమి పెట్టుకోవడం చేయాలి. ఇలా చేస్తే అరగంటలో నొప్పి తగ్గుతుంది.

home remedies for toothacheఇక మరో చిట్కా అల్లం, ఎర్ర మిరపకాయలు. అల్లం మరియు ఎర్ర మిరపకాయలు రెండూ వేడిగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటినీ సమాన నిష్పత్తిలో తీసుకొని అవసరమైన నీటితో పేస్ట్‌గా చేసుకోవాలి. చిగుళ్ళకు, నాలుకకు తాకకుండా ఉండెలా ఈ పేస్ట్‌ను చిన్న కాటన్ క్లాత్ మీద తీసుకొని నొప్పి ఉన్న పంటిపై ఉంచాలి. దీనిని ఒక్కొక్కటిగా కూడా ఉపయోగించవచ్చు. ఈ రెండూ అద్భుతమైన నొప్పి నివారణ మందులు.

home remedies for toothacheఉప్పు నీరు కూడా మంచి నొప్పి నివారణ ఔషధంగా పని చేస్తుంది. వేడినీటిలో ఒక చెంచా ఉప్పు వేసి దానితో గార్గ్లింగ్ చేయడం వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం ఉంటుంది. ఇది దంతాలలో చికాకు మరియు వాపును తగ్గిస్తుంది. ఈ నీటిని నోటిలో 30 సెకన్ల పాటు ఉంచి, ఆపై ఉమ్మివేయాలి. ఉప్పునీరు దంతాల చుట్టూ ఉన్న ప్రాంతాలను శుభ్రపరుచి మంటను కలిగించే ఆమ్లాలను తీసివేస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR