Home Health మలబద్దకం నుండి బయట పడాలిఅంటే ఈ చిట్కాలు తప్పనిసరి ?

మలబద్దకం నుండి బయట పడాలిఅంటే ఈ చిట్కాలు తప్పనిసరి ?

0

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందిని వేధిస్తున్న ఒక పెద్ద సమస్య మలబద్ధకం. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఆరోగ్యకరమైన ఆహరం మాత్రమే తీసుకోవడం అనేది కాస్త కష్టతరమైందే. అప్పటికప్పుడు దొరికే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తో మలబద్ధం సమస్య పెరిగిపోతోంది. ముఖ్యంగా చలికాలంలో అయితే ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని అంటున్నారు నిపుణులు. ఫలితంగా కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు, వాటితో పాటే ఇతర రుగ్మతలు ఏర్పడతాయి.

మలబద్దకంఅయితే ఇంట్లోనే కొన్ని హోమ్ రెమెడీస్ పాటిస్తే మలబద్దకాన్ని చాలా సులభంగా వదిలించుకోవచ్చు. అవేంటో చూద్దాం… ప్రస్తుత పరిస్థితుల్లో శరీరాన్ని డీహైడ్రేట్ అవకుండా ఉంచడం పెద్ద సవాలుగా మారింది. బిజీ లైఫ్ షెడ్యూల్లో నీరు త్రాగడానికి కూడా సమయం లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

దాహం వేసినప్పుడు చాలా మంది శీతల పానీయాలను తాగుతారు. కానీ ఇవి శరీరానికి ఎక్కువ హాని కలిగిస్తాయి. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాదు. ఎక్కువగా అంటే మరీ ఎక్కువగా కూడా తాగకూడదు. శరీరానికి సరిపోయేంత తాగితే చాలు.

సాధారణంగా తాగే నీటి కంటే కూడా కొద్దిగా వెచ్చని నీరు తాగితే.. జీర్ణక్రియ సమస్య తొలగిపోవడమే గాక మలబద్దకం నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ నిమ్మరసం లేదా గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు కలిపి తాగడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

ఇక ఆహార పదార్థాల విషయానికొస్తే…. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా సహాయపడతాయి. కడుపుని శుభ్రంగా ఉంచుతాయి. మలబద్దకాన్ని కూడా నివారిస్తాయి. బొప్పాయి, అరటి, నారింజ, నిమ్మ, పియర్, అవోకాడో వంటి పండ్ల లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. వీటిని పుష్టిగా తినవచ్చు. వాటిలో ఫైబర్ మాత్రమే కాకుండా, విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి.

అంతేగాక జీడిపప్పు, బాదం, నేరేడు పండు, బాదం వంటి ఆహారాలను కూడా తీసుకోవచ్చు. అలాగే ఆకుపచ్చ కూరగాయలు తినడం అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. బ్రోకలీ, బచ్చలికూర, మొలకలు కూడా చాలా ఫైబర్ కలిగి ఉంటాయి. పెరుగు, కిమ్చి వంటి ప్రోబయోటిక్ ఆహారం పేగులకు మంచి బ్యాక్టీరియాను పంపిస్తుంది. ఇది బ్యాక్టీరియాను సమతుల్యతతో ఉంచడానికి సహాయపడుతుంది. అంతేగాక మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.

మలబద్దకం నుండి బయటపడటానికి కలబంద రసం, ముడి పసుపు, నువ్వులు, అవిసె గింజలు, నానబెట్టిన చియా విత్తనాలు వంటివి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం లేదా యోగా.. చేయడం వల్ల మలబద్దకాన్ని తగ్గించవచ్చు. నడక, జాగింగ్, ఫ్రీ-హ్యాండ్, సైక్లింగ్ లేదా ఈత… ఈ వ్యాయామాలు మలబద్దకం సమస్యను దూరం చేయడంలో తోడ్పడుతాయి.

 

Exit mobile version