Home Health మోకాళ్ళ నొప్పులని తగ్గించుకునేందుకు హోం రెమిడీస్ మీ కోసం

మోకాళ్ళ నొప్పులని తగ్గించుకునేందుకు హోం రెమిడీస్ మీ కోసం

0

వయసు, జీవనశైలి లేదా ఇతర కారణాల వల్ల చాలా మందికి తరచుగా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఈ మోకాళ్ళ నొప్పులని తగ్గించుకునేందుకు అనేక క్రీమ్స్ రాయడం, లేదా మందులను వాడుతుంటారు. కానీ సమస్యకి ఇంట్లోనే ఒక హోం రెమిడీ ప్రయత్నించడం ద్వారా సమస్య తీరుతుంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం.

Home Remedies To Reduce Knee Painఅల్లం:

అల్లంలో అనాల్జెసి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇది మోకాళ్ల నొప్పులను నివారిస్తుంది. కాబట్టి, కొద్దిగా అల్లం నూనెను మోకాళ్లపై అప్లై చేసి స్మూత్ గా మసాజ్ చేయాలి. అలాగే మీరు కొద్దిగా అల్లం పేస్ట్ ను కూడా అప్లై చేసి తక్షణ ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా మోకాళ్ల నొప్పుల వారు నొప్పి అధికంగా ఉన్నప్పుడు అల్లం టీలో పసుపు కలిపి తాగితే సరిపోతుంది. అలాగే ఒక గ్లాసు నీటిలో చిన్న అల్లం ముక్కను, సగం చెంచా పసుపును వేసి 10-15 నిమిషాలు మరిగించి తేనె కలుపుకుని తాగితే మంచిది. ఇలా వారానికి రెండు సార్లు చేసినా మోకాళ్ల నొప్పులు తగ్గు ముఖం పడతాయి.

నిమ్మ: 

నిమ్మ సిట్రస్‌ యాంటీ-ఇన్ప్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఇది మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది. మోకాళ్లొ నొప్పలతో బాధపడేవారు ఎక్కువగా దీన్ని ఉపయోగించడం మంచిది. తినే ఆహారంలో లేదా అప్పుడప్పుడు నిమ్మతో తయారుచేసిన పానీయాలు తాగడం మంచిది. అలాగే నువ్వుల నూనె, నిమ్మ రసం సమభాగాలుగా తీసుకుని వాటిని బాగా కలిపి కీళ్లపై మర్దన చేస్తే మోకాళ్ల నొప్పలు క్రమంగా తగ్గుతాయి.

పసుపు:

పసుపు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మోకాళ్ళ నొప్పులను,ఇన్ఫ్లమేషన్ ను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మోకాళ్ల నొప్పులకు ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. పసుపు మిక్స్‌ చేసిన పాలు తాగడం వల్ల మోకాళ్ల నొప్పల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొంత‌ ప‌సుపును తీసుకుని నీటితో క‌లిపి పేస్ట్‌లా చేయాలి. అనంత‌రం దాన్ని మోకాళ్ల‌పై మ‌ర్ద‌నా చేసిన‌ట్టు రాయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే నొప్పులు త‌గ్గుతాయి. ఒక టీస్పూన్ ప‌సుపు, 1 టీస్పూన్ చ‌క్కెర పౌడ‌ర్‌, 1 టీస్పూన్ లైమ్ పౌడ‌ర్‌ల‌ను తీసుకుని వాటిని త‌గినంత నీటితో బాగా క‌ల‌పాలి. దీంతో మెత్త‌ని, చిక్క‌ని పేస్ట్ త‌యార‌వుతుంది. ఈ పేస్ట్‌ను రాత్రి పూట స‌మ‌స్య ఉన్న ప్రాంతంలో రాయాలి. రాత్రంతా దాన్ని అలాగే వ‌దిలేయాలి. ఉద‌యాన్నే క‌డిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే నొప్పులు త‌గ్గిపోతాయి.

ఆవాల నూనె:

ఆవాల నూనెను ప్రతిరోజూ రెండుసార్లు మీ మోకాలు నొప్పి ఉన్న చోట పూస్తే ఉపశమనం పొందవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల ఆవాల నూనెలో వెల్లుల్లి , ఒక లవంగ వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరగించాలి. చల్లార్చి ఆ తర్వాత ఈ నూనెను నొప్పి ఉన్న చోట పూయాలి. ఇలా తరచూ చేస్తే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ నూనెతో మోకళ్లపై మసాజ్ మాత్రం తరచుగా చేస్తూ ఉండాలి.

సైడర్ వెనిగర్:

యాపిల్ పండుతో తయారయ్యే పదార్ధమే యాపిల్ సైడర్ వెనిగర్. రోజు మొత్తంలో ఏ భోజనానికి ముందైనా సరే ఒకటి లేదా రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వినేగర్ తీసుకుంటే మంచిది. యాపిల్ సైడర్ వెనిగర్ లో అల్కలిన్ లక్షణాలుంటాయి. మోకాలి లోపల హానికరమైన వాటిని తొలగించడంలో ఇది సాయపడుతుంది. రెండు కప్పుల నీటిలో రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తాగాలి. వేడి నీటి స్నానపు తొట్టెలో రెండు కప్పులు ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి కలపాలి. ఆ తొట్టెలో మోకాలును అరగంట సేపు ఉంచాలి. ఒక స్పూన్ ఆలివ్ నూనె, ఒక స్పూన్ యాపిల్ వెనిగర్ ను మిక్స్ చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో మాసాజ్ చేయాలి

ఎప్సం సాల్ట్:

ఎప్సం సాల్ట్ లో మోకాలి నొప్పిని నయం చేసే గుణాలు ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఒక బకెట్ లో వేడి నీటిని తీసుకొని అందులో రెండు నుండి మూడు చెంచాల ఎప్సం సాల్ట్ ను కలపండి. తరువాత 10 నుండి 15 నిమిషాల పాటూ మీ కాళ్ళను అందులో ఉంచండి. కాళ్ళను బయటకి తీసిన తరువాత తేమను అందించే ఉత్పత్తులను పాదాలకు పూయండి. ఎందుకంటే ఎప్సం సాల్ట్ కాళ్లను పొడిగా మారుస్తుంది. ఇలా తరచుగా చేస్తూ ఉంటే మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు.

కాల్షియం ఫుడ్స్:

అత్యధికంగా కాల్షియం ఉన్న పదార్ధాలు తీసుకుంటే మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఒక రోజుకి కనీసం ఒక గ్లాసు పాలను ఏదైనా ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. పాలలో లాగే పెరుగు, మజ్జిగలో కూడా అంతే మోతాదులో కాల్షియం నిల్వలు ఉంటాయి. సీ ఫిష్ లో చాలా ప్రసిద్ది చెందినవి, సార్డిన్స్. ఒక రోజులో మీకు కావల్సిన 33% కాల్షియం వీటిలో పుష్కలంగా లభిస్తుంది. ఎండిన అంజీర పండ్లును కూడా తినాలి. అరటి, బచ్చలికూర, బీన్స్, యాపిల్స్ వంటివి కూడా బాగా తినాలి. సోయాచిక్కుళ్ళు, కొత్తమీర, మెంతిఆకు, బెల్లం, నువ్వులు, పిస్తా, వాల్‌నట్‌, రాగులు, పొట్టుతో కల మినుములు,ఉలవలు, తోటకూర, తమలపాకులు, కారట్‌, కాలీఫ్లవర్‌, కరివేపాకు, పుదీనా, పసుపు, పొన్నగంటికూర, ధనియాలు, జీలకర్ర, చేపలు, జున్ను, గుడ్లు, చిలకడదుంపలు, ఎండుకొబ్బరి, బాదంవంటి వాటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినాలి.

ఫైనాపిల్:

మనకి మార్కెట్ లో విరవిగా దొరికే పండ్లలో ఫైనాపిల్ ఒకటి. తినడానికి ఇది కొంచెం పుల్లగా ఉంటుందనే కారణం తో చాలా మంది వెనకాడతారు కాని దీని ద్వారా మోకాళ్ల నొప్పులు దూరం అవుతాయి. కాల్షియం, మాంగనీస్‌ అధికంగా ఈ పండులో ఉంటాయి. ఎముకలకు బలం చేకూరుతుంది. కీళ్లనొప్పులు తగ్గిపోతాయి. రోజుకు వందగ్రాములు మాత్రమే పైనాపిల్‌ తింటే మంచిది.

క్యారట్:

క్యారెట్ అద్భుతమైన స్వీట్ టేస్ట్ ను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వ‌ల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్ లో పవర్ ఫుల్ విటమిన్స్, న్యూట్రీషియన్స్, అనేకం ఉన్నాయి. అందువల్ల క్యారట్ జ్యూస్ తాగడం వల్ల మోకాలి నొప్పులు దాదాపుగా తగ్గిపోతాయి. ప్రతిరోజూ క్యారట్ రసం తాగడం లేదా క్యారట్లు తినేడం చేయాలి. క్యారట్ జ్యూస్ లో నిమ్మకాయరసం కలుపుకుని తాగితే మోకాలి నొప్పి తగ్గిపోతుంది. అలాగే కీళ్లు దృఢంగా మారుతాయి.

బొప్పాయి విత్తనాల టీ:

బొప్పాయి విత్తనాల టీ అనేది మోకాళ్ల నొప్పుల నివారణకు అత్యుత్తమ సహజ మార్గం. బొప్పాయి విత్తనాలు జస్ట్ ఓ టీ స్పూన్ తీసుకుంటే ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. బొప్పాయి ఫలం కంటే వాటి విత్తనాలే మిక్కిలి ఔషధ విలువలు కలిగి ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. బొప్పాయి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. బొప్పాయి గింజల్ని మెత్తగా చేసి సలాడ్స్‌లో, పాలు, తేనె కలుపుకొని కూడా తిన‌వ‌చ్చు. కానీ రోజుకు ఒక టీ స్పూన్ మాత్రమే బొప్పాయి గింజల మొత్తాన్ని వాడాలి.

మెంతులు:

మెంతులు కాస్తంత చేదు అనిపిస్తాయి. అయితే వీటిలో చాలా ఔషధ గుణాలున్నాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తప్రసారాన్ని పెంచుతాయి. మెంతులను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి, ఉదయం వాటిని నమిలి తినాలి. జాయింట్‌ పెయిన్‌ నుంచి ఉపశమనం పొందడానికి మెంతుల పేస్టును కూడా అప్లై చేసుకోవచ్చు.

Exit mobile version