బ్లాక్ హెడ్స్ పోవాలంటే ఇవి తప్పక పాటించాలి ?

అందమైన ముఖం కావాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. బయటికి, ఫంక్షన్స్ కి వెళ్తున్నప్పుడు, స్పెషల్ డేస్ అయితే ఇంకా ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటారు. అలాంటి సమయంలో ముఖం మీద మచ్చలు, బ్లాక్ హెడ్స్ వంటివి ఉంటే ముఖం అసహ్యంగా కనపడుతుంది. అందుకోసం మార్కెట్ లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ తో కుస్తీ పడుతుంటారు.

బ్లాక్ హెడ్స్ఎన్ని వాడినా ఒక్కోసారి వీటిని తొలగించుకోవడానికి కాస్త కష్టం అవుతుంది. కానీ కొన్ని ఇంటి చిట్కాలతో సులభంగా సమర్ధవంతంగా వీటిని తొలగించుకోవచ్చు. అందమైన ముఖారవిందాన్ని పొందవచ్చు అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లాక్ హెడ్స్ఒక స్పూన్ రోజ్ వాటర్ లో చిటికెడు సముద్రపు ఉప్పు వేసి బాగా కలిపి ప్రభావిత ప్రాంతంలో రాసి పది నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ కారకాన్ని తొలగిస్తుంది.

బ్లాక్ హెడ్స్సముద్రపు ఉప్పులో కొన్ని వాటర్ వేసి ముఖానికి అప్లై చేయాలి. సముద్రపు ఉప్పులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరుచుకొనేలా చేసి బ్లాక్ హెడ్స్ కారకాన్ని తొలగిస్తుంది.

బ్లాక్ హెడ్స్ఒక స్పూన్ రోజ్ వాటర్ లో అరస్పూన్ విటమిన్ సి పొడి వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

బ్లాక్ హెడ్స్అరస్పూన్ కొబ్బరినూనెలో రెండు చుక్కల ట్రీ టీ ఆయిల్ వేసి ప్రభావిత ప్రాంతంలో రాసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ట్రీ టీ ఆయిల్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ చర్మ రంద్రాల్లో ఉండే విష పదార్ధాలను తొలగిస్తుంది. బ్లాక్ హెడ్స్ తొలగించటంలో బాగా పనిచేస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR