Home Health వినికిడి సమస్యలను తగ్గించే ఇంటి చిట్కాలు!

వినికిడి సమస్యలను తగ్గించే ఇంటి చిట్కాలు!

0

మనిషికి ఉన్న జ్ఞానేంద్రియాలలో కన్ను తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్నవి చెవులే. అందుకే చెవులు సరిగా వినిపించకపోతే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మనం చెవులతో వింటాం, నోటితో మాట్లాడతాం. చూడటానికి ఈ రెండూ వేర్వేరు అవయవాలకు సంబంధించిన వ్యవహారాల్లాగా అనిపించినా… వీటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా పసితనంలో- మన చెవులు వినిపిస్తుంటేనే మనకు మాటలు వస్తాయి. మాటలు విని, ఆ విన్న వాటిని అనుకరించటం ద్వారా మనం మాటలు నేర్చుకుంటాం. అందుకే మాటలు రావటానికి వినికిడి శక్తి అత్యంత కీలకం.

earsకానీ వినికిడి శక్తిని అందించే చెవులని ఎక్కువ మంది ఆభరణాలు అలంకరించుకోవడానికీ, ఇయర్‌ ఫోన్లు, బ్లూటూత్‌లు పెట్టుకుని స్మార్ట్‌ ఫోన్ల నుంచి పాటలు వినడానికీ, మాట్లాడుకోవడానికీ ఎక్కువగా వాడుతుంటారు. గత కొంత కాలంగా పెరిగిన మొబైల్స్‌, స్మార్ట్‌ మొబైల్‌ వాడకంలో అత్యధిక శాతం మంది యువత రోజులో 24గంటలూ ఇయర్‌ ఫోన్లూ, బ్లూటూత్‌లతోనే గడుపుతున్నారు. దీంతో చెవి లోపల వాతావరణం బాగా వేడెక్కడం, అక్కడి అవయవాలు ఈ ధ్వని ప్రభావం వల్ల సక్రమంగా పనిచేయకపోవడంతో వినికిడి సమస్యలు ఏర్పడుతున్నాయి.

కళ్లజోళ్లు జారిపోకుండా సపోర్టుగానూ చెవులనే వినియోగిస్తారు. కానీ వీటి సంరక్షణపై మాత్రం పెద్దగా దృష్టి సారించరు. వయసు పెరుగుతున్నకొద్దీ కంటిచూపు క్షీణించినట్టే, నడివయసు నుంచే వినికిడి సమస్యలూ పెరుగుతున్నాయి. యాభై ఏళ్ల వయసు దాటిన వారిలో 40 శాతం మందికి పైగా ఏదో ఒక స్థాయి వినికిడి లోపం ఉంది. ఇక 70 ఏళ్లు పైబడిన వారిలో 70 శాతం మందికి ఈ సమస్య ఉంది. వీటితోపాటే ధ్వని కాలుష్యానికి లోనుకావటం, గాయాలు, వ్యాధులూ వినికిడి సమస్యలకు ప్రధాన కారణాలు. దాంతో చిన్నవిగా మొదలయ్యే వినికిడి సమస్యలు శాశ్వతమైన చెవుడుకూ, డిమెన్షియాకూ దారితీస్తుంటాయి. ప్రారంభంలోనే గుర్తిస్తే ఈ వినికిడి సమస్య నుంచి తేలిగ్గా బయటపడొచ్చు.

వినికిడి సమస్యలతో బాధపడుతున్న వారు చిన్న వయసు నుంచీ వృద్ధుల వరకూ ఉన్నారు. వినికిడి సమస్య పుట్టుకతో వస్తే దాన్ని తగ్గించడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ కొంత మందిలో వయసు పెరిగే కొద్దీ లేదా హెడ్ఫోన్స్ లాంటివి తరచూ ఉపయోగించడం వలన వినికిడి సమస్య పెరుగుతుంది. ఇలాంటివారు కొన్ని చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. మనం ఏదైనా సమస్య రాగానే మందుల షాపుల చుట్టూ, డాక్టర్లు చుట్టూ తిరుగుతూ ఉంటాం. కానీ మన ఆయుర్వేద వైద్యంలో ఇంటి చిట్కాలతో ఆ సమస్యలను అధిగమించడం చాలా సులభం. అలాంటి కొన్ని చిట్కాలు వినికిడి సమస్యకు కూడా ఉన్నాయి. మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో ఈ చిట్కాలు చేసి చాలా త్వరగా ఫలితాలను పొందవచ్చు.

ముఖ్యంగా దీనికి కావలసిన పదార్థం నువ్వుల నూనె. నువ్వుల నూనె ఆరోగ్యానికి మంచిదని మన అందరికీ తెలిసిందే. అయితే ఇది వినికిడి సమస్యలు తగ్గించడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ముందుగా ఒక రెండు చెంచాలా వామును తీసుకోవాలి. దీనిని కొద్దిగా నీటిని చేర్చి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. యాభై గ్రాముల నువ్వుల నూనెలో ఈ వాము పేస్ట్ను వేసి సన్ననిమంటపై కేవలం నూనె మాత్రమే మిగిలేలా వేసిన నీళ్లు ఇగిరిపోయేలా కలుపుతూ ఉండాలి. మిగిలిన నూనెను చల్లారిన తరువాత గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజుకు 4 చుక్కలు ఏ చెవిలో సమస్య ఉందో దానిలో వేసి దూదితో మూసివేయాలి. కొంతసేపటి తర్వాత దూదిని తీసివేసి చెవి పక్కకు వంచాలి. దానివలన చెవిలో ఏవైనా సమస్యలు ఉంటే తగ్గిపోతుంది.

ముల్లంగి రసం కూడా వినికిడి సమస్యలను తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దాని కోసం ఒక 20 గ్రాముల ముల్లంగి రసాన్ని తీసుకోవాలి. దీనిని ఒక నాలుగు చెంచాల నువ్వుల నూనెతో మరిగించి నూనె మిగిలిన తరువాత ఆ నూనెను నిల్వచేసుకోవాలి. రోజుకి రెండు, మూడు చుక్కలు ఉపయోగిస్తే సరిపోతుంది. ఇది ముందు చెప్పుకున్న చిట్కా కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. వీటిని వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక సమస్య వచ్చినప్పుడు ప్రయత్నించి చూడండి. ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి.

Exit mobile version