శరీరంలో ఏదైనా భాగంలో నొప్పి ఉంటే, వెంటనే మందులు వాడటం ప్రారంభిస్తారు. ఆ మందులు వాడితే ఆ సమయంలో తక్షణ ఉపశమనం ఇస్తుంది, కానీ కొంత సమయం తరువాత తిరిగి ఆ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంతవరకు మెడిసిన్ ని ఉపయోగించవద్దు. తలనొప్పి, వెన్ను నొప్పి, కడుపు నొప్పి ఇలా ఏ నొప్పిని అయినా తగ్గించుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలు సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండ్లు:
అరటిపండ్లు తినడం వల్ల అనేక రకాలైన నొప్పికి ఉపశమనం లభిస్తుందని చాలా కొద్ది మంది నమ్ముతారు. మహిళలు ముఖ్యంగా పాలు మరియు అరటిపండ్లు తినాలి. అరటిలో పెద్ద మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది శరీరభాగాల్లో కలిగే నొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే అథ్లెట్స్ కి ఎక్కువగా అరటి పండ్లు ఇస్తుంటారు.
పసుపు:
ఒక చిటికెడు పసుపు ఆహారం యొక్క రంగును మార్చేస్తుంది. అలాగే చిటికెడు పసుపు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పసుపులో కర్కుమిన్ ఉంది, ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే కొంతమంది పసుపు పాలు తాగుతారు. అలాగే, ఏ రకమైన నొప్పి ఉన్నా, పసుపు వాడటంతో అది నయమవుతుంది. ఇది కాకుండా, ప్రతిరోజూ పసుపును తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
చెర్రీ:
చెర్రీలో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది నొప్పిని తగ్గిస్తుంది. కండరాల నొప్పిని తగ్గించడంలో దీని ఉపయోగం అసాధారణమైనది. ఇది ఆర్థరైటిస్ వంటి సమస్యలకు కూడా ఉపశమనం ఇస్తుంది. అయితే, చేదుగా ఉండే చెర్రీస్ మాత్రమే నొప్పిని తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. తియ్యగా ఉండే చెర్రీస్ ఈ రకమైన ప్రయోజనాన్ని అందించవు.
అల్లం:
అల్లాన్ని టీ లేదా వేడి నీటితో తీసుకోవడం వలన ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఐరన్, కాల్షియం, అయోడిన్, క్లోరిన్ వంటివి ఇందులో ఉన్నాయి. ఇది బర్నింగ్ నుండి ఉపశమనం అందిస్తుంది. అల్లం యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది శరీర ఉష్ణోగ్రతను వెంటనే పెంచుతుంది కాబట్టి అల్లం ఎక్కువగా ఉపయోగించబడుతుంది.