గురక తగ్గించుకోడానికి ఇంటి చిట్కాలు మీ కోసం

గురక అనేది సాధరణ సమస్య. ఈ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. గురకపెడుతూ మీరు గాఢనిద్రను పొందవచ్చు కానీ, మీ గురక వల్ల మీ పాట్నర్ నిద్రలేమి రాత్రులను ఎన్నో గడిపి ఉండవచ్చు. ఈ సమస్య మిమ్మల్ని వెంటాడుతుంటే మీరు ఈ సమస్య నుండి బయట పడాలంటే కొన్ని నియమాలు పాటించాలి.

గురక అనేది నయం చేయలేని వ్యాధి లేదా రుగ్మత కాదు, ఇది శ్వాసించే సమయంలో సహజంగా ఎదుర్కొనే సమస్య. నిద్రించే సమయంలో వ్యక్తి శ్వాసపీల్చేటప్పుడు, శ్వాసను నిద్రలో గట్టిగా తీసుకోవడంతో క్రమేణా అది గురకకు దారితీస్తుంది. నిద్రిస్తున్నపుడు శ్వాసతీసుకోవడంలో గాలి సర్కులేట్ అవుతూ ఓకల్ కార్డులను వైబ్రేట్ చేస్తూ ధ్వని పుట్టిస్తుంది. గాలి అధికమయ్యే కొద్ది ధ్వని అధికమవుతుంది. మీరు నిద్రించే సమంలో మీ నోరు మరియు ముక్కు ద్వారా గాలి ఫ్రీగా పోకపోవడం వల్ల గురకకు కారణం అవుతుంది.

గురక తగ్గించుకోడానికి మరికొన్ని చిట్కాలు:

గురక తగ్గించుకోడానికి ఇంటి చిట్కాలుగురకను నివారించే ఆహారాలు, కొన్ని సందర్భాల్లో గురక మీ ముక్కులు మూసుకుపోవడం వల్ల లేదా దగ్గువల్ల గురకకు కారణం కావచ్చు. అయితే, ఈ గురక సమస్య రెగ్యులర్ గా ఉంటే, అప్పుడు ఇది నిజంగా సమస్యగా మారుతుంది. ఓకల్ కార్డులను వైబ్రేషన్ కు ప్రధాణ కారణం, శ్వాసనాళం మూసుకుపోవడం. అందుకు వయస్సు, నాసికా మార్గం మరియు సైనస్ సమస్య, అధిక బరువు మరియు ధూమపానం వంటి వి ప్రధాన కారణం కావచ్చు. ముఖ్యంగా మీరు పడుకొనే భంగిమ మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.

రాత్రి గురక వల్ల పగలు అలసట, చిరాకు, మరికొన్ని సమస్యలకు దారితీస్తుంది. ఇటువంటి ఆరోగ్యసమస్యలను క్రియేట్ చేయడంతో పాటు, నిద్ర సరిగా లేకుంటే మైండ్ ఒత్తిడికి గురవుతుంది. వ్యతిరేకత పెరిగి జీవితంలో లేదా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. గురక జంటల శారీరక సంబంధాలను కూడా దూరం చేస్తుంది. గురక వింటే చాలు ఇక నిద్ర మూడ్ పారిపోతుందని చెప్పే వారు చాలామందే వున్నారు. మరి ఒకరి పక్కన మరొకరు నిద్రించని జీవిత భాగస్వాములకు అనుబంధం కూడా లోపిస్తుంది. క్రమేణా వేరు పడటం, తదనంతరం విడాకులు వంటివి కూడా ఏర్పడతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే గురకను నియంత్రణ చేయడానికి సహాయపడే కొన్ని హోం రెమెడీస్ తెలుసుకుందాం.

పిల్లో(దిండు):

గురక తగ్గించుకోడానికి ఇంటి చిట్కాలుబెడ్ మీద ప్లాట్ గా నిద్రించడాని కంటే, మీకు అవసరం అయితే కొన్ని ఎక్స్ ట్రా పిల్లోను ఉపయోగించాలి. ఇది కణజాలం ద్వారా గాలి సులభంగా ప్రసరించడానికి తేలికవుతుంది. తలగడలు మెత్తగా వుండరాదు. గట్టిగా వున్న తలగడలపై పడుకుంటే గాలి బాగా ప్రవహిస్తుంది.

ఒక వైపుకు తిరిగి పడుకోవాలి:

గురక తగ్గించుకోడానికి ఇంటి చిట్కాలువెల్లకిలా పడుకునే కంటే పక్కకు తిరిగి పడుకుంటే శ్వాస హాయిగా ఆడుతుంది. నిద్రలో మీరు వెల్లకిలా పడుకుంటే, పక్కకు తిప్పమని మీ భాగస్వామికి చెప్పండి.

స్టీమింగ్:

గురక తగ్గించుకోడానికి ఇంటి చిట్కాలుగురక నిలపడానికి, ఆవిరి పట్టడం చాలా సింపుల్ హోం రెమెడీ. ఇది శాస్వనాళంలో మ్యూకస్ ను బయటకు నెట్టివేయడం వల్ల నాజల్ బ్లాకేజ్ ను క్లియర్ చేస్తుంది. దాంతో శ్వాస ఫ్రీగా ఆడుతుంది.

ధూమపానం నిలిపివేయాలి:

గురక తగ్గించుకోడానికి ఇంటి చిట్కాలుగురకకు పొగతాగటం కూడా ఒక కారణం. ఈ అలవాటు గొంతులో మంట, కొద్దిపాటి వాపు కూడా కలిగిస్తుంది. శ్వాస కష్టంగా తీసుకోవలసి వుంటుంది. ధూమపానం వదిలేయమని సలహా నివ్వండి. ఇతర చెడు అలవాట్లు కూడా మానేలా చూడండి. సమస్య చాలావరకు తగ్గిపోతుంది.

మద్యపానం మానేయాలి:

గురక తగ్గించుకోడానికి ఇంటి చిట్కాలుఆల్కహాలిక్ బెవరేజెస్, స్లీపింగ్ పిల్స్, ట్రాక్వైజర్స్ మరియు యాటిహిస్టమైన్స్ తీసుకోవడం నివారించడం వల్ల, గురకనుండి ఉపశమనం కలిగిస్తుంది. కండరాలను వదుల చేసి, ప్యాసేజ్ ను ఫ్రీ చేస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR