చెమట వాసనను తగ్గించే ఇంటి చిట్కాలు!

వర్షాలు పడుతున్నప్పటికీ ఉక్కపోత వలన చెమట పడుతూ ఉంటుంది. చెమట కారణంగా ర్యాషెస్ వస్తాయి. చర్మం ఎర్రగా అవుతుంది. దుర్వాసన వస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. రెయినీ సీజన్లో చెమట, తడి వల్ల బ్యాక్టీరియా చేరుతుంది. ముఖ్యంగా చాలా మంది వేసవిలో బాహుమూలల్లో చెమటకు చాలా ఇబ్బంది పడుతుంటారు.

1-Mana-Aarogyam-794ఎంత ఫ్రెష్ దుస్తులు వేసుకున్నా నిమిషాల మీద చెమటకు తడిసిపోవడం మాత్రమే కాకుండా ఆ చెమట వాసన కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే ఈ చెమట వాసనను అధిగమించే కొన్ని సులువైన చిట్కాలు ఇప్పుడు చూద్దాం. యాంటీ బ్యాక్టీరియల్ సోప్ వాడితే బ్యాక్టీరియా పోతుంది. చర్మం తాజాగా కనిపిస్తుంది. ఎసెన్షియల్ ఆయిల్ కలిపిన నీళ్లతో స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటుంది. పెప్పర్మింట్ ఆయిల్ కలిపిన నీళ్లతో స్నానం చేసినా కూడా చెమట వాసన రాదు.

3-Mana-Aarogyam-794ప్రతిరోజు స్నానం చేయడానికి వెళ్ళే ముందు మొత్తం శరీరానికి శనగపిండి మరియు పెరుగు మిశ్రమాన్ని పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి. తరువాత సబ్బు ఉపయోగించకుండా స్నానం చేయాలి. దీనివల్ల చర్మరంధ్రాలు మూసుకుపోయి చెమట సరిగా బయటి రాక ఆ ప్రదేశంలో వెలువడే దుర్వాసనను అరికట్టవచ్చు. అలాగే చర్మ రంద్రాలు వదులుగా అవ్వడం వల్ల శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. చర్మరంధ్రాలు ఆరోగ్యంగా మారడం వల్ల చెమట వాసనను నియంత్రిస్తుంది.

4-Mana-Aarogyam-794మౌత్ వాష్ లేదా టూత్‌పేస్ట్‌తో చెమట పట్టే ప్రదేశాలను శుభ్రం చేసినా ఫలితం ఉంటుంది. వారానికి మూడు సార్లు ఇలా చేయవచ్చు. నెల రోజుల పాటు ఇలా చేసిన తర్వాత, ఒక నెల రోజుల పాటు ఆపి మళ్లీ ప్రారంభించవచ్చు.. గాఢమైన ఆల్కహాల్, క్లీనింగ్ ఏజెంట్లు చర్మం పైపొరను పొడిబార్చకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

వంటల్లో వాడే ఈ వెనిగర్ పులుపు రుచితో ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన గుణాలు కలిగిఉంటుంది. వెనిగర్ సహజ క్రిమినాశకంగా పనిచేస్తుంది. అంతేకాదు తీవ్రమైన వాసన కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది. దుర్వాసన ఉన్న ప్రదేశాలలో సాధారణ వెనిగర్ లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ స్ప్రే చేసుకుని ఆ ప్రాంతాన్ని పొడి బట్టతో తుడుచుకోవాలి. లేదా స్నానం చేసేటపుడు నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి ఆ నీటితో స్నానం చేయడం వల్ల కూడా దుర్వాసనను తగ్గించుకోవచ్చు.

5-Mana-Aarogyam-794శరీరం నుండి వెలువడుతున్న దుర్గంధాన్ని తగ్గించడానికి మరొక మంచి ఉపాయం. సువాసన గల నూనెలను ఉపయోగించడం. స్నానానికి వెళ్ళేటప్పుడు 2 నుండి 3 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ లేక రోజ్‌వాటర్ ను బకెట్ నీళ్లలో కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. ఇది దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది మరియు శరీరంను సువాసనగా ఉంచుతుంది.

ఒక బకెట్ నీటిలో మూడు గ్రీన్‌టీ బ్యాగ్‌లను వేసి ఆ నీటిని నేరుగా స్నానానికి ఉపయోగించినా లేదా స్నానపు తొట్టిలో ఆ నీటిని పోసి, ఇరవై నిముషాల పాటు, అందులో సేదతీరినా శరీర దుర్వాసన పోవడంతో పాటు చర్మం కాంతివంతమవుతుంది. స్నానపు తొట్టిలోని నీటికి రెండు కప్పుల టమాటా రసం చేర్చి, అందులో అరగంట పాటు గడిపినా ఫలితం ఉంటుంది.

8-Mana-Aarogyam-794తాజా కొబ్బరి పాలు చెమట ఎక్కువ ఉత్పన్నం అయ్యే ప్రదేశాల్లో అప్లై చేసి కొద్దిసేపటి తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి లేదా ద్రాక్ష పళ్ల నుండి రసం తీసేసిన తరువాత మిగిలిన పిప్పితో బాగా రుద్దుకుని 5 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చెమట ఎక్కువ పట్టె ప్రదేశాల్లో చెమట తగ్గి తాజాధనం ఎక్కువసేపు ఉంటుంది.

బాత్ టబ్‌లోని నీటికి నాలుగు కప్పుల గులాబీ రేకులను లేదా అర కప్పు రోజ్ వాటర్‌ను కలపాలి. అందులో 20 నిముషాల పాటు సేద తీరితే సుగంధాలు వెదజల్లుతాయి. స్నానపు నీటికి గుప్పెడు వేపాకులను చేరిస్తే, చర్మంపై గల బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీనివల్ల శరీర దుర్వాసన తగ్గడమే కాకుండా అనేక చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.

7-Mana-Aarogyam-794మరొక సహజమైన ఉపాయం ఎండిన మారేడు ఆకుల పొడిని సేకరించి, సోప్ బేస్ ను తీసుకుని వేడి చేసి అందులో మారేడు ఆకుల పొడిని కలిపి సబ్బు తయారుచేసుకోవాలి. ఈ సబ్బును రోజూ వాడుతుంటే శరీర దుర్వాసనను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. తాజా పుదీనా ఆకులు నీళ్లలో వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేయడం వల్ల చర్మం ఆరోగ్యవంతమవడం మాత్రమే కాకుండా తాజాగా ఉండేలా చేస్తుంది. చర్మరంద్రాలు రిపేర్ చేయడం లో పుదీనా చక్కగా పనిచేస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR