Home Health ఇంటి చిట్కాలతో అల్సర్ ని తగ్గించటం ఎలాగో తెలుసా ?

ఇంటి చిట్కాలతో అల్సర్ ని తగ్గించటం ఎలాగో తెలుసా ?

0

ప్రస్తుత కాలంలో చాలా మందిని పట్టి పీడుస్తున్న ఆరోగ్య సమస్య గ్యాస్ట్రిక్ అల్సర్. చిన్న ప్రేగు, అన్నవాహిక మరియు కడుపు పైభాగంలో బాధాకరమైన నొప్పిని కలిగి ఉండటం అనేది అల్సర్ గా భావిస్తారు. దీనికి కారణం మారిన జీవనశైలి విధానమే అని చెప్పవచ్చు. వేళకు తీసుకోని ఆహారం, తీసుకున్నా హడా వుడిగా క్షణాల్లో ముగించటం, చీటికి మాటికి చిరాకు, కారణం లేకుండానే కోపం వీటితో పాటు నిత్యం ఎదుర్కునే మానసిక ఒత్తిడి తోడుకావటంతో ‘గ్యాస్ట్రిక్‌ అల్సర్‌’ సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది. కడుపు పై బాగంలో వచ్చేటటువంటి అలర్స్ గా భావిస్తారు. అయితే ఇంటి చిట్కాలతో అల్సర్ ని తగ్గించటం ఎలాగో తెలుసుకుందాం.

Home tips to reduce ulcers

  • కూల్ డ్రింక్స్, అలాగే కెఫైన్ ఉండే పానీయాలను తీసుకోకూడదు. వాటి స్థానంలో హెర్బల్ టీ తీసుకోవడం మంచిది.
  • రోజూ ఉదయాన్నే ఓ గ్లాసు గోరువెచ్చని మంచి నీళ్లు తాగాలి.
  • రోజూ తీసుకొనే ఆహారంలో అరటిపండు, పుచ్చకాయ, కీరదోస లాంటి పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఎసిడిటీని తగ్గించడానికి పుచ్చకాయ జ్యూస్ మంచి ఔషదం.
  • ఎసిడిటి నుంచి ఉపసమనానికి కొబ్బరి నీళ్లు మంచిది.

  • రోజూ ఓ గ్లాస్ పాలు తీసుకోండి. పాలు గుండెల్లో మంటను తగ్గిస్తాయి.
  • మునక్కాయలు, బీన్స్, గుమ్మడి, క్యాబేజ్, క్యారెట్, ఉల్లికాడలతో చేసిన కూరలు ఆరగిస్తే ఎసిడిటీకి చెక్ పెట్టొచ్చు.
  • రాత్రి నిద్రపోవడానికి కనీసం రెండు, మూడు గంటల ముందు భోజనం పూర్తయ్యేలా చూసుకోండి.
  • మూడు పూటల భోజనానికి మధ్య తీసుకొనే విరామం కూడా మీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎప్పుడూ సమయానికి ఆహారం తీసుకోవాలి.
  • పచ్చళ్లు, కారంగా ఉంటే చట్నీలు, వెనిగర్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
  • కొన్ని పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించాలి. భోజనం తరవాత ఈ పుదీనా నీళ్లను ఓ గ్లాసు తీసుకుంటే ఎసిడిటి నుంచి ఉపశమనం లభిస్తుంది.

  • బెల్లం, నిమ్మ, అరటి, బాదం, పెరుగు మనకు తెలిసిన ఈ ఆహార పదార్థాలన్నీ ఎసిడిటి నుంచి రిలీఫ్‌ను ఇస్తాయి.
  • పొగతాగడం, మద్యం సేవించడం కూడా ఎసిడిటి సమస్యను అధికం చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది.

  • ఎసిడిటీతో బాధపడుతున్నవారు చూయింగ్ గమ్ నమలడం మంచిది. ఎందుకంటే దీని వల్ల నోటిలో లాలాజలం బాగా ఊరుతుంది. దీంతో అన్నవాహికలో ఆహారం ఏమైనా ఉంటే కిందికి వెళ్లిపోతుంది. దీనివల్ల గుండెల్లో మంట ఉండదు.
  • అల్లం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో అల్లం ఉండేలా చూసుకోండి. అల్లం టీ కూడా ఎసిడిటీని తగ్గిస్తుంది.

భోజనం చేయడానికి ముందు పంచదార కలిపిన ఒక గ్లాసు నిమ్మరసం తీసుకుంటే కడుపులో మంట ఉండదు.

 

Exit mobile version