ముల్లంగితో చుండ్రను తరిమికొట్టండిలా..!

దుంప జాతికి చెందిన ముల్లంగికి ఆదరణ కొంచెం తక్కువే అని చెప్పాలి. మిగతా దుంపలను ఇష్టాంగా తినేవారు సైతం ముల్లంగిని చూస్తే ముఖం విరుచుకుంటారు. మార్కెట్ లో ఎంత తాజా ముల్లంగిని చూసినా కొనడానికి ఆసక్తి చూపించరు. కానీ, దీనిని సలాడ్లలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీనికి కారణం, ముల్లంగి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండడమే.

2-Mana-Aarogyam-791ముల్లంగిని తరచూ తీసుకోవడం వల్ల లివర్‌, జీర్ణాశయం శుభ్రమవుతాయి. ఆయా భాగాల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ముల్లంగి ఆకులను కామెర్ల చికిత్స కోసం ఉపయోగిస్తారు. ఇక ముల్లంగిని తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. దీనిలో ఉండే సల్ఫర్‌ హైపో థైరాయిడిజం సమస్య ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది. అందువల్ల ముల్లంగిని తరచూ తినాలి. ముల్లంగిని తినడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు పునర్నిర్మాణమవుతాయి. కణాలకు నష్టం కలగకుండా ఉంటుంది. దీంతోపాటు రక్తంలో ఆక్సిజన్‌ సరఫరా పెరుగుతుంది.

4-Mana-Aarogyam-791ముల్లంగిలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. గాల్‌ బ్లాడర్‌ను సురక్షితంగా ఉంచుతుంది. శరీరంలో ద్రవాలు ఎక్కువగా చేరకుండా చూస్తుంది. ముల్లంగిలో ఆంథో సయనిన్స్‌ ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. ముల్లంగిలో ఉండే విటమిన్‌ సి, ఫోలిక్‌ యాసిడ్‌, ఫ్లేవనాయిడ్స్ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది అధిక బరువును తగ్గించడంలోనే కాకుండా, మన చర్మానికి మరియు జుట్టుకు ప్రయోజనం చేకూర్చడానికి అవసరమైన పోషకాలను కూడా అధికంగా కలిగి ఉంటుంది.

6-Mana-Aarogyam-791ముల్లంగిలో ఉండే మినరల్స్, విటమిన్స్ మన చర్మం మరియు జుట్టుకు తగిన పోషణను అందివ్వడంలో ఎంతగానో సహాయపడగలవని సౌందర్య నిపుణులు సూచిస్తుంటారు. దీనిలో విటమిన్ ఎ మరియు సి పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ మొదలగు మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్ నిక్షేపాలు చర్మానికి మరియు జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలను అందివ్వగలవని చెబుతున్నారు.

ముల్లంగి జుట్టు రాలడాన్ని అరికట్టి, జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది. చుండ్రు తగ్గించి జుట్టుకు సహజ సిద్దమైన షైనింగ్ ను అందిస్తుంది. ముల్లంగిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, చుండ్రును కలిగించే బ్యాక్టీరియాను అదుపు చేయడంలో సహాయం చేస్తాయి. క్రమంగా తలమీద చర్మ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

3-Mana-Aarogyam-791దీనికోసం ముల్లంగి తొక్క తీసి, ముక్కలుగా చేయాలి. దీనిని గ్రైండ్ చేసి రసాన్ని వేరుచేసుకోవాలి. ముల్లంగి రసంలో ఒక కాటన్ బాల్ ముంచి, తలపై ఆ రసాన్ని పూయాలి. పైనుండి టవల్ తో తలను చుట్టేసి 30 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్య నుండి తొందరగా బయటపడొచ్చు.

మరో రెమెడీ కూడా ప్రయతించొచ్చు. ముల్లింగిని తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి. ఒక బౌల్‌లో మూడు స్పూన్ల ముల్లంగి ర‌సం, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ నిమ్మ ర‌సం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి అర గంట అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువగా ఉండే షాంపూతో త‌ల స్నానం చేసేయాలి. ఇలా మూడు రోజుల‌కు ఒక సారి చేస్తే చుండ్రు క్ర‌మంగా త‌గ్గి పోతుంది.

7-Mana-Aarogyam-791అలాగే ముల్లింగిని మెత్త‌గా పేస్ట్ చేసుకుని, అందులో కొద్దిగా బాదం ఆయిల్ వేసి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని త‌లపై అప్లై చేసి.ముప్పై, న‌ల‌బై నిమిషాల పాటు వ‌దిలేయాలి. ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో హెడ్ బాత్ చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే. చుండ్రు నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

నల్ల ముల్లంగిలో జుట్టు పోషణకు సరిపడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లుగా చెప్పబడుతుంది. నల్ల ముల్లంగి తొక్క తీసి, ముక్కలుగా చేయాలి. దీనిని గ్రైండ్ చేసి రసాన్ని వేరుచేయాలి. ఈ రసాన్ని మీ తలపై సున్నితంగా రుద్ది, టవల్ లేదా షవర్ కాప్ ఉపయోగించి తలను కవర్ చేయాలి. 1 గంటపాటు అలానే వదిలేసి తరువాత నీటిని ఉపయోగించి బాగా రుద్ది కడగాలి. ఇలా నల్ల ముల్లంగి రసాన్ని తరచుగా అప్లై చేయడం మూలంగా జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది.

7-Mana-Aarogyam-791

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR