Home Life Style Meet This Couple From Hyderabad Who Build A House Called ‘Andari Illu’...

Meet This Couple From Hyderabad Who Build A House Called ‘Andari Illu’ For The Poor & Shelterless

0

Contributed By: Chintapalli Siva Santhosh

అందరి ఇల్లు :

హైదరాబాద్ లో కొత్తపేట రైతుబజార్ వెనుక మూడు అంతస్తుల భవనం ఒకటి ఉంది. ఆ ఇల్లు…. అందరి ఇల్లు. నిజమే ఆ ఇల్లు అందరిది…. మీకు ఆకలేస్తే భోజనం దొరుకుతుంది, చదువుకోవాలి అంటే గ్రంధాలయం లా పుస్తకాలు ఉంటాయి, ఆరోగ్యం బాగో లేదా వైద్యం అందుతుంది, మనసు బాగోలేదా ప్రశాంతత ను ఇచ్చే దేవాలయం అవుతుంది, కష్టపడి అలసిపోయారు కాస్త సేద తీరే చోటు అవుతుంది ఆశ్రయం లేని వారికి కాస్త చోటు దొరుకుతుంది. నిజమే ఇవన్నీ అక్కడ ఉంటాయి అందుకే అది “ అందరి ఇల్లు ‘”.

Image2డాక్టర్ ప్రకాష్, డాక్టర్ కామేశ్వరి అనే ఇద్దరి దంపతులుచే కొనసాగుతున్న “ అందరి ఇల్లు” సేవ సంస్థ. ఇద్దరు డాక్టర్లు,మంచి ఆదాయం వచ్చే ఉద్యోగాలను కాదనుకుని సేవ సంస్థ ను స్థాపించి అందరికి సాయం చేసి ఆదర్శమూర్తిలుగా నిలుస్తున్నారు ఆదర్శ దంపతులు.

అందరి ఇల్లు స్థాపించడానికి కారణం, వైద్యులుగా ఉద్యోగం చేసుకుంటున్న సమయం లో ఒక విదేశీ వైద్యుడు అన్న మాటలు “ మీ భారతీయులు కు ఆహారాన్ని పంచటం రాదు “ కు బాధ పడిన డాక్టర్ ప్రకాష్ ఉద్యోగాని రాజీనామా చేసి తోపుడు బండి పై అరటిపళ్ళు అమ్మటం మొదలుపెట్టారు,దాని వెనుక పెద్ద ఆశయమే ఉంది,అరటి పళ్ళను అమ్ముతూ ఒక్కటై న పేదవారికి ఇవ్వండి అని చెప్పేవారు. అరటి పళ్ళు అమ్మటం వల్ల కొంత మందికె సాయం చేయగలుతున్నాం అనుకుని కొన్నాళ్ళు గడిచిన తర్వాత అంటే జూన్15,2006 వ సంవత్సరం లో అందరి ఇల్లు ను స్థాపించి, ఆకలిగా ఉన్న వారు భోజనం చేసి వెళ్ళమని చెప్పేవారు.అలా మొదలైనది అందరి ఇల్లు.

ఇప్పుడు అనేక మంది కడుపు నింపుకుంటున్నారు,ఆశ్రయం పొందుతున్నారు. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు ఎవరి అనుమతి అవసరం లేదు. ఆకలితో ఉన్న వారు వచ్చి వంట చేసుకునేందుకు గ్యాస్,కూరగాయలు, వంట సరుకులు అన్ని సిద్ధంగా ఉంటాయి.వండుకుని కడుపునిండా తిని వెల్లచ్చు. అనేక మంది విద్యార్థులు ఇక్కడే ఉండి చదువుకుంటున్నారు, నిరోద్యగులు కూడా ఇక్కడి నుంచే ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్నారు. కుటుంబ పరిస్థితులు బాగోలేని వారు,ఎవరు లేని అనాథ లు ఇక్కడే ఆశ్రయం పొంది, కడుపు నింపు కుంటున్నారు. అందరి ఇల్లు లో ఇంకో ఆశ్చర్య కరమైన విషయం, అక్కడ ఒక గంట, ఒక బాక్స్ ను ఏర్పాటు చేశారు.ఈ రోజుల్లో మనసు ఉన్న బాధను ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి కొంత మందికి వస్తుంది.ఒక వేళ మన మనసు లో ఏమైనా బాధ ఉంటే అక్కడ ఉన్న గంటను మోగిస్తే ఎవరో ఒకరు వస్తారు,మనం వాళ్లతో మం బాధను పంచుకోవచ్చు. అలా కూడా మనం చెప్పుకోలేకపోతే ఒక కాగితం మీద రాసి అక్కడ ఉన్న బాక్స్ వేయచ్చు. మనసు ను ఓపెన్ చేసుకుని బాధను తీర్చుకోవచ్చు, ఓపెన్ లో ఉన్న కడుపును తిని క్లోజ్ చేసుకుని వెల్లచ్చు.

పై అంతస్తులో ప్రకాష్ గారి భార్య కామేశ్వరి క్లినిక్ నడుపుతున్నరూ,అక్కడి వచ్చే వారికి వైద్యాన్ని అందిస్తున్నారు.వైద్యానికి వచ్చిన వారు కూడా వండుకుని తిని నిండు మనసు తిరిగి ప్రయణమవుతారు.
ఒకసారి ఒకతను మా దగ్గరికి వచ్చాడు.అతనికి వండి పెట్టాం,తిన్న తర్వాత అతను అన్నాడు సార్ నేను తిని రెండు రోజులు అవుతుంది అన్నాడు.తిన్న తర్వాత అతని ముఖం లో మేము చూసిన సంతోషం మాకు చాలా శక్తిని ఇచ్చింది
అందుకే మా తర్వాత కూడా అందరి ఇల్లు నడవాలి అని మేము కోరుకుంటున్నాం.
“అందరి ఇల్లు “ ఇంటిలో వంట చేసుకోవటానికి అన్ని ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి, మా ఇంట్లో ఎలా వున్నా ఇక్కడ మాత్రం అని సిద్ధం చేసి ఉంచుతాం,ఒకోసారి సారి చుట్టూ పక్కల వారు కూడా తమ సాయని అందింస్తూ ఉంటారు అని చెబుతారు డాక్టర్ ప్రకాష్.

Exit mobile version