బ్రహ్మ ఆడవారిని సృష్టించే శక్తి ఎలా పొందాడు

0
334

సృష్టి ప్రారంభించే సమయంలో బ్రహ్మ రచించిన సృష్టి సరిగా విస్తరించలేదు. దీనితో బ్రహ్మదేవుడు తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. అప్పుడు ఆకాశవాణి ఇలా వినపడింది. బ్రహ్మా! మైథునీ సృష్టించు. ఆకాశవాణిని విన్న బ్రహ్మదేవుడు మైథునీ సృష్టిని చేయాలని నిశ్ఛయించుకున్నాడు.

brahmaకానీ అప్పటివరకు ఆడవారిని సృష్టించలేదు అందువల్ల అతడు తన పనిని పూర్తిచేయలేకపోయాడు. శివపరమేశ్వరుని కృప లేకుండా మైథునీ సృష్టి జరగదు. అందుకే అతడు శివుని ప్రసన్నుని చేసుకోవాలని కఠోరమైన తపస్సు చేసాడు. చాలాకాలం బ్రహ్మదేవుడు తన హృదయంలో ప్రేమపూర్వకంగా శివమహేశ్వర ధ్యానం చేస్తూ ఉన్నాడు. అతని తపస్సుకు ప్రసన్నుడైన ఉమామహేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు. దేవాదిదేవుడైన శివభగవానుని ఆ దివ్య స్వరూపాన్ని చుసిన బ్రహ్మ భక్తితో శివుని పూజించాడు.

Lord Shivaఅప్పుడు శివమహేశ్వరుడు బ్రహ్మా! నీ మనసులోని కోరిక అర్ధమైంది. సృష్టి వర్థిల్లాలన్న ఉద్దేశంతో నువ్వు చేసిన కఠోరమైన తపస్సుకు నేను చాలా సంతోషించాను. నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాను అంటూనే శివుడు తన శరీరం నుండి ఉమాదేవిని వేరు చేశాడు. పరమేశ్వరుని అర్ధాంగం నుండి వేరైన పరాశక్తికి బ్రహ్మదేవుడు సాష్టాంగనమస్కారం చేసాడు.

Lord Shivaసృష్టిలో స్త్రీ పురుషులను కలపడం ద్వారా నేను ప్రజోత్పత్తిని చేయాలనుకుంటున్నాను. కానీ ఇంత వరకు ఆడవారు సృష్టించబడలేదు. స్త్రీలను సృష్టించడం నా శక్తికి మించిన పని .దేవీ! నీవు సంపూర్ణ సృష్టికీ, శక్తులకూ మూలానివి. ఆడవారిని సృష్టించే శక్తిని నాకు ప్రసాదించు అని బ్రహ్మ అర్ధించాడు.

brahmaబ్రహ్మ ప్రార్ధనను విన్న శివాని తథాస్తు అంటూ అతనికి ఆడవారిని సృష్టించే శక్తిని ప్రసాదించింది. అప్పుడు ఆమె తన భృకుటీ (రెండు కనుబొమ్మలు )మధ్యభాగం నుండి తనతో సమానమైన కాంతిమతి అయిన ఓ శక్తిని సృష్టించింది. ఆ శక్తి బ్రహ్మ ప్రార్థనానుసారం దక్షపుత్రి అయింది. అలా బ్రహ్మకు శక్తిని అనుగ్రహించి శివాని మహాదేవుని శరీరంలో ప్రవేశించింది. తరువాత మహాదేవుడు కూడా అంతర్థానమై పోయాడు.