పచ్చి పాలు తాగడం ఎంత ప్రమాదమో తెలుసా?

ప్రతిరోజూ ఓ గ్లాసు పాలు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాలలో చాలా పోషకాలు ఉన్నాయి. చాలా మంది ఉదయం లేవగానే పాలు కచ్చితంగా తాగుతారు. పాలల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అలానే పాలల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల్ని, పళ్ళని దృఢంగా ఉంచుతుంది. డాక్టర్లు కూడా పాలని ప్రతి రోజూ తాగమని చెప్తూ ఉంటారు.

calciumపాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఫిట్ గా ఉండొచ్చు. ఇక పిల్లలకు కూడా ఉదయం పాలు తాగిస్తారు. ఇది బలవర్ధకమైన ఆహారం. రోజుకి రెండు సార్లు పాలు తాగితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవు. అయితే సాధారణంగా పాలు కాచిన తర్వాత ఉపయోగిస్తుంటారు.

కొంతమంది పాలు కాస్తే కానీ తాగరు.. మరి కొంతమంది పచ్చివే తాగుతుంటారు. అయితే కొందరికి ఓ అనుమానం ఉంటుంది? పచ్చిపాలు తాగవ‌చ్చా తాగకూడదా అంటే ఎవ‌రైనా పాలు కాచిన తర్వాత మాత్ర‌మే ఉపయోగించాలి అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే పచ్చి పాలలో విషతుల్యమైన బ్యాక్టీరియా ఉంటుంది. మనం నేరుగా తాగితే కడుపు లోకి వెళ్ళి అనేక అనారోగ్య సమస్యలు తీసుకువస్తుంది.

raw milkపిల్లలకు అయినా పెద్దలకు అయినా కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, జ్వరం వస్తుంది. కిడ్నీల సమస్యలు వస్తాయి. పచ్చి పాలు చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఇమ్యునిటీ పవర్ తక్కువగా ఉన్నవారు, ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మెడిసన్స్ వాడుతున్న వారు అస్సలు తీసుకోవద్దు. ఇప్పుడు చాలా మంది జ్యూస్ లు అవి తాగిన సమయంలో ఇలా పచ్చిపాలు అందులో మిక్స్ చేసి తాగుతారు. ఇలా కూడా వద్దు అని చెబుతున్నారు నిపుణులు.

kidneyపచ్చి పాలలో వ్యాధికారక ఈ కోలి, సాల్మొనెల్లా, ఇంకా బోలెడన్ని పరాన్న జీవులు ఉంటాయి. పాలు తీసే ప్రక్రియ ద్వారా ఇవన్నీ అందులోకి చేరుతాయి. పాలను కనీసం పది నిమిషాల పాటు వేడి చేయడం ద్వారా మాత్రమే ఈ హానికారక రసాయనాలను నివారించవచ్చు. పాశ్చరైజేషన్లో 45 శాతం బ్యాక్టీరియా నశిస్తుందని, పాలను మరుగబెట్టడం ద్వారా మిగతా బ్యాక్టీరియాను తొలగించవచ్చు.

milk boilingబ్యాక్టీరియా ఉండడం వల్ల పచ్చి పాలు త్వరగా పాడవుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు పచ్చి పాలను తీసుకోవద్దు. బాగా మరగబెట్టిన తర్వాత తీసుకోవాలి. పచ్చి పాలు తాగడం వల్ల శరీరంలో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. శరీరంలో యాసిడ్ పెరిగతే ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. అందుకే పచ్చిపాలు తాగకపోవడమే శ్రేయస్కరం.

bacteria in milkపట్టణాలలో పాల ప్యాకెట్లు లభిస్తాయి.. అవి నిల్వ ఉండడానికి అనేక రకాల రసాయనాలు కలుపుతారు. అటువంటి పాలను నేరుగా తాగకూడదు. అదేవిధంగా పల్లెటూర్లలో పాలు పితుకేటప్పుడు నీళ్లు లేదా ఇతర పదార్థాలను కలుపుతారు.. అలాంటి పాలను తాగితే అనేక ఉదర సమస్యలు వస్తాయి. వేడి చేయని పాలు తాగితే టీబీ వ్యాధి వస్తుంది. దీనిలో ఉండే హానికర బ్యాక్టీరియా వల్ల ఊపిరితిత్తుల పై ప్రభావం చూపుతుంది. అందువలన పచ్చి పాలు తాగక పోవటమే ఉత్తమం.

tuberculosis

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR