ద్రాక్షారామంలో గోదావరికి సప్త గోదావరి అనే పేరు ఎలా వచ్చింది?

0
997

పంచారామాల్లో ఒకటిగా ప్రణతులందుకొనే ద్రాక్షారామంలో భీమేశ్వర మూర్తి భక్తులను నిరంతరం ఆశీర్వదిస్తుంటాడు. దక్షిణ కాశీగా పేరొందిన ఈ క్షేత్రరాజం పౌరాణిక గాథల్లో అభివర్ణితమైంది. దాక్షాయణి ఆత్మాహుతి చేసుకొన్న చోట పరమేశ్వరుడు భీమరూపంలో స్వయంభువుడయ్యాడని ద్రాక్షారామ స్థలపురాణం చెబుతోంది. తొలుత ఈ లింగాన్ని కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు అర్చించాడని పురాణోక్తి. అలా సాక్షాత్తు సూర్యభగవానుడే స్వయంగా అభిషేకించడానికి ఓ కారణం ఉంది.

Sapta Godavariస్వయంభువుడైన భీమేశ్వరుణ్ణి అర్చించేందుకు సప్తరుషులు ఇక్కడికి గోదావరిని తీసుకువచ్చారని అంటారు. దీనికి సంబంధించిన ఓ ప్రసిద్ధ గాథ ప్రాచుర్యంలో ఉంది. ద్రాక్షారామానికి పది కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తోన్న గోదావరి జలాలతో భీమేశ్వరుడికి అభిషేకం చేయాలని సప్తర్షులు తలపోశారు.

Sapta Godavari అందుకు వీలుగా గోదావరిని తమ వెంట తరలించాలని భావించారు. అయితే పరవళ్లుతొక్కే గోదావరీ జలాలు తన యజ్ఞానికి భంగం కలిగిస్తాయని భావించిన తుల్యుడనే మునీశ్వరుడు, సప్తర్షులను నిలువరిస్తాడు.

Sapta Godavariఅది ఘర్షణకు దారితీసే సమయంలో వేదవ్యాసుడు వారి తగవును పరిష్కరిస్తాడు. గోదావరి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ద్రాక్షారామానికి చేరుకొంటుందనీ, అక్కడ సప్త గోదావరి పేరుతో పుష్కరిణిగా అవతరిస్తుందనీ తెలియజేస్తాడు. సప్తర్షులు భీమేశ్వరుడి సన్నిధికి చేరుకొనే వేళకు, సప్తగోదావరి జలాలతో సూర్యుడు తొలి అభిషేకాన్ని పూర్తిచేశాడనీ, ఆ విధంగా స్వయంభువును మొదటిసారిగా అర్చించిన ఖ్యాతి ఆదిత్యుడి సొంతమైందనీ క్షేత్రగాథ చెప్తోంది.