శ్రీకాళహస్తి ఆలయ విశేషాలు మరియు దాని విశిష్టత ?

శ్రీకాళహస్తిశ్వరస్వామి స్వయంభువు,శ్రీ అనగా సాలె పురుగు,కళా అనగా పాము,హస్తి అనగా ఏనుగు,ఈ మూడు జంతువులు శివభక్తి వలన కైవల్యం పొంది శివునిలో గలసిపోయినవి. అందువలన ఇచ్చట స్వామి వారికీ శ్రీ కాళహస్తిశ్వరుడు అని ఈ పురముకు శ్రీ కాళహస్తి అనియు పేరు వచ్చింది.

శ్రీకాళహస్తిసాలె పురుగు- శివ కైవల్యం:

కృతయుగంలో సాలె పురుగు తన శరీరం నుంచి వచ్చే సన్నని దారంతో కొండఫైనున్న శివునికి గుళ్ళ గోపురాలు ప్రాకారములు కట్టి శివునిపూజిస్తుంది. ఒకనాడు శివుడు పరిక్షింపదలచి అక్కడ మండుచున్న ధీపములో తగిలి సాలీడు రచించిన గుడి గోపురములను తగలబెట్టినట్టు
చేసాడు.

శ్రీకాళహస్తిఇది చుసిన సాలీడు దీపమును మ్రింగుటకు పోగా శివుడు ప్రతక్ష్యమై దాని భక్తికి మెచ్చి వరము కోరుకోమంటాడు. అపుడు సాలీడు మరల తనకు జన్మ లేకుండా చేయమని కోరుకుంటుంది.అందుకు శివుడు అంగీకరించి సాలిడుని తనలో ఐఖ్యమైనపోవునట్లు చేసాడు.ఈ విధముగా సాలీడు శివకైవల్యం పొంది తరించింది.

నాగు పాము-ఏనుగు-శివారాధన చేసి తరించుట:

ఏనుగు పాముల కథ త్రేతాయుగమున జరిగినది. ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతి రోజు శివలింగానికి పూజ చేసి వెళ్ళేది. అదే సమయంలో ఒక ఏనుగు కూడా ఆ శివలింగానికి పూజచేసి వెళ్లిపోయేది. ఏనుగు స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు,పుష్పములు, బిల్వదళములు తెచ్చి,పాము సమర్పించిన మణులను త్రోసివేసి,తాను తెచ్చిన నీటితో అభిషేకం చేసి పుష్పాలతో అలంకరించి పూజించి వెళ్ళేది. మరునాడు ఉదయం పాము వచ్చి చూసి తాను పెట్టి వెళ్ళిన మణులను గానక వాటికి బదులు బిల్వములు,పుష్పములు పెట్టి ఉండటం చూసింది. అప్పడు పాము మనస్సులో చాలా బాధపడింది.

శ్రీకాళహస్తికొంత కాలము వరకు పాము పెట్టిన మణులను ఏనుగు ,ఏనుగు ఉంచిన పుష్పాలను పాము శుబ్రపరచి తమ తమ ఇష్టనుసరముగా పూజచేసి ఈశ్వరుని పూజించేవి. ఒక రోజు పాము విసుగెత్తి తన మణులు త్రోయబడి ఉన్నందుకు కోపానికి గురై ఇలా జరగటానికి కారణము తెలుసుకోవాలని ప్రక్కనే ఉన్న పొదలో దాగి ఉంటుంది. ఆ సమయంలో ఏనుగు వచ్చి మణులను తోసేసి పూలతో ,బిల్వ పత్రాలతో పూజిస్తుంది. అది గమనించిన పాము కోపముతో తన శత్రువుఅయిన ఏనుగు తొండములో దూరి కుంభస్టలమున దానికి ఉపిరి ఆడకుండా అడ్డుపడుతుంది. ఈ భాధకు ఏనుగు తాలలేక ఈశ్వర ధ్యానంతో తొండముతో శివలింగమును తాకి శిరస్సును గట్టిగా రాతికేసి కొట్టుకొని మరణిస్తుంది.

శ్రీకాళహస్తిరాతికేసి కొట్టుకోవడం వలన ఏనుగు కుంభస్థలంలో ఉన్న పాము కూడా చచ్చి బయటపడింది. ఆ విధంగా ఇద్దరు తమ తమ నిజ స్వరూపంతో రుద్ర గణములుగా మారి స్వామిలోపల ఐక్యమైపోయారు. ఈ స్మృతి చిహ్నంగా కాళము పంచ ముఖ పాము ఆకారంలో తల భాగంలో ఏనుగు సూచకముగా రెండు దంతములను,సాలె పురుగు అడుగు భాగంలోనూ,తన లింగాకృతిలో ఐక్యం చేసుకొని శివుడు శ్రీ కాళహస్తిశ్వరుడుగా ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రంక `శ్రీ -కళా- హస్తి అని పేరుతో ప్రసిద్ధి చెందింది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR