కిరాతకుడుగా ఉన్న వ్యక్తి వాల్మీకిగా మారడానికి గల కారణాలేంటి?

రామాయణం రాసింది ప్రాచేతసుడు అనే పేరుగల రుక్షుడు లేదా భార్గవుడు. ఆయన్నే వాల్మీకి అని అంటామని అందరికీ తెలిసిందే. కానీ కీరతకుడిగా ఉన్న వ్యక్తి వాల్మీకిగా మారడానికి గల కారణాలేంటి? ఆయనకు వాల్మీకి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

వాల్మీకికిరాతధర్మంతో ఉన్న రుక్షుడు అడవిలో ఉంటూ దారినపోయే వారిపై దోపిడీ చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు ఆ దారిలో సప్తమహర్షులు వెళ్లారు. వారి వద్ద ఉన్న సొమ్మును అపహరించాలన్న ఉద్దేశంతో రుక్షుడు వారిని చెట్టుకు కట్టేస్తాడు. అప్పుడు నారదుడు రుక్షుడుని ఇలా అడుగుతాడు.నీ పాపంలో, భార్యపుత్రులకి కూడా భాగం ఉందా? లేదా తెలుసుకునిరా! అని అంటాడు. అంతే వెంటనే ఈ కిరాతకుడు ఇంటికి వెళ్లి నేను చేసిన పాపంలో భాగాన్ని మీరు తీసుకుంటారా అని భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను అడుగుతాడు. కానీ వారందరూ ఒక్కటే సమాధానం చెప్తారు. నీవు తెచ్చిన ధనాన్ని లేదా ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాం. నీ పాపాలతో మాకు సంబంధం లేదు అని.

వాల్మీకిజన్మసంస్కారమో, జీవితంలో రాబోయే కాలంలో మార్పు కోసమో లేదా భగవత్ సంకల్పమో ఆ రుక్షుడు అడవిలోకి వచ్చి మహర్షుల కట్టు విప్పుతాడు. వారికి సాష్టాంగ నమస్కారం చేసి తప్పును మన్నించమని ప్రాధేయపడుతాడు. అంతేకాకుండా జీవితంలో తరించడానికి ఏం చేయాలో తెలపమని ప్రార్థిస్తాడు. దీంతో నారదుడు మరా అని రామనామాన్ని తిరగలమరగల ఉపదేశిస్తాడు. దాన్నే 12 లక్షలసార్లు అక్కడే కూర్చుని రుక్షుడు జపించాడు.

వాల్మీకిదాంతో అక్కడ పుట్టలు పెరిగాయి. నారదుడు తిరిగి వచ్చాడు. రుక్షుడు చుట్టూ పుట్టలు పెరిగడం చూసి వల్మీకం నుంచి వచ్చినవాడు కాబట్టి వాల్మీకిగా ప్రసిద్ధి చెందుతావని నారదుడు ఆశీర్వదిస్తాడు. అప్పటి నుంచి ఆ కిరాతకుడికి వాల్మీకి అనే పేరు వచ్చింది. మహా రుషిగా మారాడు. తపంబు ఆచరిస్తూ తదనంతర కాలంలో శ్రీమద్రామాయణాన్ని రాసి ధన్యుడుగా మారాడు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR